పక్కన అనుష్క ఉంటే పర్లేదా కోహ్లీ?
కొందరికి కొన్ని రకాల భయాలుంటాయి. అవి చిన్నప్పుడే బలంగా నాటుకుపోతాయి. దీంతో పెద్దవాళ్లు అయినా ఆభయాలు తొలగిపోవు. చివరికి అది ఓ ఫోబియాలా మారిపోతుంది.
By: Tupaki Desk | 1 Dec 2024 11:30 PM GMTకొందరికి కొన్ని రకాల భయాలుంటాయి. అవి చిన్నప్పుడే బలంగా నాటుకుపోతాయి. దీంతో పెద్దవాళ్లు అయినా ఆభయాలు తొలగిపోవు. చివరికి అది ఓ ఫోబియాలా మారిపోతుంది. టూర్లలో భాగంగా క్రికెటర్లు విమాన ప్రయాణాలు తరుచూ చేస్తుంటారు. తాజాగా విరాట్ కోహ్లీ కి విమానం అంటే భయ మన్న సంగతి వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపాడు. `నాకు విమానం ఎక్కడం అంటే భయం కాదు.
కానీ టేకాఫ్ అయ్యేటప్పుడు, దిగేటప్పుడు భయంకరమైన జర్క్ ఉంటుంది. కొన్నిసార్లు టర్బులెన్స్ వల్ల అటూ ఇటూ ఊగుతుంది. ఆ సమయంలో గుండె ఆగినంత భయం కలుగుతుంది. సీటును చేతుల్లో గట్టిగా పట్టుకుంటా. నా పక్కన కూర్చున్న వాళ్లు మాత్రం ఎంచక్కా ఆ భయం లేకుండా ఉంటారు. అప్పుడంతా ఎవరి పనుల్లో వాళ్లు ఉంటారు. నాకు మాత్రం చచ్చేంత భయం కలుగుతుంది. ఆ సమయంలో వాళ్లను చూస్తే అంత ధీమాగా ఎలా ఉంటున్నారు? అనిపిస్తుంది.
కొన్నేళ్లగా విమాన ప్రయాణాలు చేస్తున్నప్పటికీ ఆ భయం ఇప్పటికీ పోలేదు. అంతే కాదు విమానం ఎక్కినట్లు కల వచ్చినా కూడా భయం వేస్తుంది. కానీ ఆసమయంలో నా పక్కనే అనుష్క ఉంటే మాత్రం ఆభయం కాస్త తగ్గుతుంది. తను ఉంటే తనని పట్టుకుంటాను కాబట్టి భయం స్థాయి తగ్గుతుంది. కానీ భయం మాత్రం పూర్తిగా దక్కదు. ఆ రకంగా విమానాయనం నాలో ఓ ఫోబియాలా మారిపోయింది` అని అన్నారు.
విరాట్ కోహ్లీ- బాలీవుడ్ నటి అనుష్క శర్మ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కలరు. ప్రస్తుతం అనుష్క హిందీ సినిమాలతో బిజీగా ఉండగా...కోహ్లీ మ్యాచ్ లు..ప్రాక్టీస్ అంటూ బిజీగా ఉంటున్నాడు.