Begin typing your search above and press return to search.

వీడియో వైరల్... విరాట్ కొత్త ఇంటిని చూశారా?

అవును... ప్రస్తుతం ఫ్యామిలీతో రిలాక్స్ అవుతున్న టీంఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కొహ్లీ.. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియోను పంచుకున్నాడు.

By:  Tupaki Desk   |   9 July 2024 2:30 PM GMT
వీడియో వైరల్... విరాట్  కొత్త ఇంటిని చూశారా?
X

టీ20 ప్రపంచకప్ - 2024లో గ్రాండ్ విక్టరీ, అనంతరం ముంబై వీదుల్లో కనీవినీ ఎరుగని అన్న స్థాయిలో జరిగిన సంబరాలు అనంతరం ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి లండన్ వెళ్లారు. ఈ సమయంలో చాలా కాలం తర్వాత ఆటకు దూరంగా ఉంటూ కుటుంబంతో సమయాన్ని ఆస్వాధిస్తున్న నేపథ్యంలో తాజాగా ఓ వీడియోను పంచుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.

అవును... ప్రస్తుతం ఫ్యామిలీతో రిలాక్స్ అవుతున్న టీంఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కొహ్లీ.. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియోను పంచుకున్నాడు. ఇందులో భాగంగా ఆలీబాగ్ లోని తన విలాసవంతమైన ఇంటికి సంబంధించిన గ్లింప్స్ ని పంచుకున్నారు. ఈ సందర్భంగా తన ఇంటిని నిర్మించిన టీం కు కృతజ్ఞతలు తెలిపారు.

ఇందులో భాగంగా తన ఆలీబాగ్ ఇంటిని నిర్మించే ప్రయాణం ఓ అద్భుత అనుభవం అని, అదంతా కలిసి రావడం నిజంగా సంతోషదాయకమని కొహ్లీ తెలిపాడు. ఈ సందర్భంగా తమ కలల ఇంటిని సాకారం చేసినందుకు ఆవాస్ టీం మొత్తానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ తన ప్రియమైనవారితో ప్రతీక్షణాన్ని ఆస్వాధించడానికి వేచి ఉండలేకపోతున్నట్లు వెల్లడించారు.

కాగా... ఈ ఏడాది జూన్ 29న బార్బడోస్ లో జరిగిన టీ20 ప్రపంచకప్ చరిత్రలో రెండోసారి భారత్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించిన కొహ్లీ... ప్రస్తుతం ఇంటర్నేషనల్ క్రికెట్ కు చిన్నపాటి విరామం ఇస్తున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన ఆ ఫైనల్ లో 59 బంతుల్లో 79 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో భారత్ ఏడు పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. అనంతరం కోహ్లీ టీ20 కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.