Begin typing your search above and press return to search.

బెంబేలెత్తించిన బెరిల్‌ హరికేన్‌.. విరాట్ వీడియో కాల్ వైరల్!

ఆగ్నేయ కరేబియన్ ప్రాంతం సమీపంలో ఏర్పడిన బెరిల్ హరికేన్ తీవ్రరూపం దాల్చింది.

By:  Tupaki Desk   |   3 July 2024 6:12 AM GMT
బెంబేలెత్తించిన బెరిల్‌  హరికేన్‌.. విరాట్  వీడియో కాల్  వైరల్!
X

ఆగ్నేయ కరేబియన్ ప్రాంతం సమీపంలో ఏర్పడిన బెరిల్ హరికేన్ తీవ్రరూపం దాల్చింది. ఫలితంగా... బార్బడోస్, గ్రెనడా, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్ దీవులను కుదిపేసింది. అయితే ప్రస్తుతం దీని తీవ్ర కేటగిరీ 4కు తగ్గిందని చెబుతున్నారు. ఇప్పుడు ఈ హరికేన్ జమైకా వైపు సాగుతున్నట్లు నేషనల్ హరికేన్ సెంటర్ తెలిపింది. ఈ సమయంలో టీంఇండియా జట్టు అక్కడే చిక్కుకుపోవడం గమనార్హం!

అవును... కరేబియన్ దివుల్లో బెరిల్ హరికేన్ భారీ బెంబేలెత్తించేసింది. సుమారు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు భారీ విధ్వంసమే సృష్టించాయి. ఫలితంగా... అనేక దీవులుల్లో తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టాలు జరిగాయి. సుమారు 20ఏళ్ల క్రితం వచ్చిన "ఐవాన్" హరికేన్ తర్వాత ఈ "బెరిల్" హరికేనే తీవ్రమైందని అధికారులు చెబుతున్నారు.

ఈ భారీ హరికేన్ వల్ల సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్ లోని "యూనియన్ ఐలాండ్" దాదాపు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని అంటున్నారు. ఆల్ మోస్ట్ ఇళ్లు అన్నీ ధ్వంసమయ్యాయని చెబుతున్నారు. విమానాశ్రయ పైకప్పు సైతం ఎగిరిపోయిందని వెల్లడించారు. సుమారు 3000 నివాసాలున్న యూనియన్ ఐలాండ్ పొడవు, వెడల్పులు వరుసగా మూడు మైళ్లు, ఒక మైళు కాగా... ఈ బెరిల్ దెబ్బకు దీవి ఆల్ మోస్ట్ కనుమరుగైపోయిందని అంటున్నారు.

ఈ సమయంలో చుట్టుపక్కల దీవుల్లో కూడా పూర్తిగా తాగునీరు, విద్యుత్ సరఫారా పూర్తిగా నిలిచిపోయినట్లు ప్రధానమంత్రి రాల్ఫ్ గోన్సాల్వ్స్ వెల్లడించారు. పరిస్థితులు కొలిక్కి రావడానికి మరింత సమయం పడుతుందని వెల్లడించారు. యూనియన్ ఐలాండ్ పునర్నిర్మాణానికి సుమారు ఏడాది కాలం పట్టొచ్చని, బిలియన్ డాలర్లు అవసరమవుతాయని ఆయన తెలిపారు.

విరాట్ కొహ్లీ వీడియో కాల్!:

టీ20 ప్రపంచ కప్ లో విజేతగా నిలిచిన టీంఇండియా జట్టు బెరిల్ హరికేన్ సమయంలో బార్బడోస్ లోనే ఉంది. ఈ హరికేన్ కారణంగా ప్రతికూల పరిస్థితులు నెలకొనడంతో ఆటగాళ్లతో పాటు, సహాయక సిబ్బంది, బీసీసీఐ అధికారుల్లు రెండు రోజులుగా అక్కడే ఉన్నారు. అయితే ప్రస్తుతం వాతావరణం కాస్త మెరుగుపడటంతో... వారంతా ప్రత్యేక విమానంలో భారత్ కు బయలుదేరారు!

ఈ సమయంలో... అక్కడ జట్టుతో పాటు హోటల్ లో ఉన్న విరాట్ కొహ్లీ... తన భార్య అనుష్క శర్మకు వీడియో కాల్ చేసి అక్కడి పరిస్థితులను చూపించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇక అక్కడ నుంచి బయలుదేరిన భారత్ జట్టు గురువారం ఉదయం ఢిల్లీ చేరుకోనున్నట్లు తెలుస్తోంది.