Begin typing your search above and press return to search.

సొంత వ్యాపారం పెట్టే యోచనలో కోహ్లీ... మేనేజర్ బంటీకి బై!

ఐసీసీ వన్ డే ప్రపంచకప్‌ అయిపోయింది. ఈ టోర్నీలో ఫస్ట్ నుంచీ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన టీం ఇండియాను ఫైనల్ మ్యాచ్ లో ఆసిస్ బోల్తా కొట్టించింది.

By:  Tupaki Desk   |   21 Nov 2023 7:30 AM GMT
సొంత వ్యాపారం పెట్టే యోచనలో కోహ్లీ... మేనేజర్  బంటీకి బై!
X

ఐసీసీ వన్ డే ప్రపంచకప్‌ అయిపోయింది. ఈ టోర్నీలో ఫస్ట్ నుంచీ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన టీం ఇండియాను ఫైనల్ మ్యాచ్ లో ఆసిస్ బోల్తా కొట్టించింది. దీంతో... టీం ఇండియా టాప్ ఆటగాళ్లలో ఒకరైన విరాట్‌ కోహ్లి విషణ్ణ వదనాలను చూడాల్సి వచ్చింది. ఈ ప్రపంచకప్‌ ఫైనల్‌ విరాట్ కొహ్లీ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి చర్చ తెరపైకి వచ్చింది. కారణం కోహ్లికి ఇదే చివరి కప్పు కావచ్చన్న అంచనా! ఈ సమయంలో కొహ్లీ నెక్స్ట్ స్టెప్ పై కథనాలు వెలువడుతున్నాయి.

అవును... తాజా ప్రపంచకప్ ఫైనల్ లో ఓడిపోయిన అనంతరం టీం ఇండియా ఆటగాళ్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమకు తోడుగా ఉన్న అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆ సంగతి అలా ఉంటే... ప్రపంచకప్ ఫైనల్ అనంతరం.. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి తన మేనేజర్‌ బంటీ సజ్ దేహ్ ను తొలగించినట్లు కథనాలొస్తున్నాయి.

వాస్తవానికి విరాట్ కోహ్లి వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలను కార్నర్‌ స్టోన్ అనే సంస్థ నిర్వహిస్తూ వస్తోంది. కోహ్లీ కోసం ఈ సంస్థ సుమారు పదేళ్ల నుంచి పనిచేస్తోంది. ఈ కార్నర్‌ స్టోన్ వ్యవస్థాపకుడు బంటీ సజ్ దేహ్.. విరాట్ కోహ్లీకి మేనేజర్ గా కంటే కూడ్దా స్నేహితుడిగా ఉంటారని చెబుతుంటారు. ఈ క్రమంలో తాజా పరిణామల నేపథ్యంలో కోహ్లి ఆ బంధాన్ని తెంచుకున్నట్లు చెబుతున్నారు.

ఇందులో భాగంగా కార్నర్ స్టోన్ సంస్థతో కోహ్లికి సుధీర్ఘకాలంగా ఉన్న అనుబంధం ముగిసిందని.. అయితే దీనికి గల స్పష్టమైన కారణాలు తెలియడం లేదని అంటున్నారు. మరోపక్క కోహ్లినే సొంతంగా ఓ కంపెనీ ప్రారంభించే యోచనలో ఉన్నట్లు క్రికెట్, బిజినెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభించినట్లు చెబుతున్నారు.

కార్మర్ స్టోన్ వ్యవస్థాపకుడు బంటి, విరాట్ కోహ్లి స్నేహం ఈ నాటిది కాదని వారి గురించి తెలినవారంతా చెబుతుంటారు. కోహ్లి వాణిజ్య ప్రయోజనాలు, బ్రాండ్ వాల్యూ వంటి అంశాలను బంటీ పర్యవేక్షిస్తుంటారు. ఇందులో భాగంగా పుమా సంస్థతో కోహ్లి వందకోట్ల ఒప్పందంతో పాటు అనేక ఒప్పందాలు కుదర్చడంలో బంటీదే కీలకపాత్ర అని అంటుంటారు.

ఈ కార్నర్‌ స్టోన్ సంస్థ క్రీడాకారులతో పాటుగా బాలీవుడ్ ప్రముఖుల వ్యాపార కార్యకలాపాలను సైతం నిర్వహిస్తూ ఉంటుంది. అయితే ఇతర క్రీడాకారుల కంటే కోహ్లీకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటుందనే విమర్శలు కూడా వినిపిస్తుంటాయి. ఈ కారణంతోనే రోహిత్ శర్మ, అజింక్యా రహానే, కేఎల్ రాహల్, శుభ్‌ మన్ గిల్ వంటి క్రీడాకారులు ఆ సంస్థ నుంచి బయటికి వచ్చేశారని అంటారు. అయితే... పీవీ సింధు, సానియా మీర్జా, ఉమేష్ యాదవ్, కుల్దీప్ యాదవ్ వంటి ప్లేయర్లు మాత్రం ఆ సంస్థలోనే కొనసాగుతున్నారు.

అయితే ఈ విమర్శలను అప్పట్లో బంటీ కొట్టిపడేశారు. ఇతర క్రీడాకారులు, సెలబ్రెటీల వ్యాపార కార్యకలాపాలను ఎలా నిర్వహిస్తామో.. కోహ్లీ విషయంలోనూ అదే ఫాలో అవుతామని అప్పట్లో స్పష్టం చేశారు. ఈ క్రమంలో తాజాగా బంటీ ని తన మేనేజర్ గా కొహ్లీ తప్పించారని.. దానికి కారణం కింగే సొంతంగా వ్యాపారం ప్రారంభించబోతున్నారని తెలుస్తుంది! దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది!