నిరసనలో భాగంగా యమునలో మునకేశాడు.. కట్ చేస్తే?
ఢిల్లీ రాష్ట్ర అధికారపక్షమైన ఆమ్ ఆద్మీ పాలన వైఫల్యాల్ని ఎత్తి చూపేందుకు ఆయన పెద్ద సాహసమే చేశారు
By: Tupaki Desk | 27 Oct 2024 7:10 AM GMTరాజకీయం అన్న తర్వాత నిరసనలు.. ఆందోళనలు మామూలే. తమ రాజకీయ ప్రత్యర్థులపై ఘాటు విమర్శలు చేయటం.. తీవ్రమైన ఆరోపణలు చేయటం ఓకే అయినా.. ఈ క్రమంలో వారి తప్పుల్ని ఎత్తి చూపాలన్న తొందరలో చేసిన ఒక ప్రయత్నం మొదటికే మోసం తెచ్చిన ఉదంతంగా దీన్ని చెప్పాలి. ఈ ఉదంతంలో ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచదేవ చిక్కుల్లో పడ్డారు. ఢిల్లీ రాష్ట్ర అధికారపక్షమైన ఆమ్ ఆద్మీ పాలన వైఫల్యాల్ని ఎత్తి చూపేందుకు ఆయన పెద్ద సాహసమే చేశారు. అత్యంత కాలుష్యంగా ఉంటూ.. విషపు నురగలుకక్కే యమునా నదిలో మునిగే సాహసానికి దిగారు.
ఇదంతా ఎందుకంటే ఆమ్ ఆద్మీ సర్కారు వైఫల్యాన్ని ఎత్తి చూపేందుకు. అన్నట్లే యుమన నదిలో దిగి.. అందులో మునకేశారు. అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. అందులోకి దిగేందుకు సాహసించని తీరుకు భిన్నంగా ఆయన ఏకంగా మునకేయటం హాట్ టాపిక్ గా మారింది. అయితే.. అనుకున్నట్లే యమునలో మునకేసిన మూడురోజులకు ఆయన మీద ప్రభావం పడింది.
యమున కాలుష్య ప్రభావంతో ఆయన ఇప్పుడు ఆసుపత్రిలోచేరాల్సి వచ్చింది. చర్మంపై దురదలు రావటంతో పాటు శ్వాస పీల్చుకోవటంలోనూ ఇబ్బందులు తలెత్తాయి. ఇతర ఆరోగ్య సమస్యలు ఒక్కసారి మీద పడటంతో ఆయన ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. యమునలో కాలుష్యం ఇంతలా పెరగటానికి ఆమ్ ఆద్మీ ప్రభుత్వ వైఫల్యంగా బీజేపీ మండిపడుతోంది. అంతేకాదు.. ఢిల్లీ కాలుష్య నివారణకు కేటాయించాల్సిన నిదుల్ని ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. ఇందులో భాగంగానే యమునలో మునిగారు. అయితే.. సచ్ దేవ్ యమునలో మునగటంపై ఢిల్లీపర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ విమర్శలతో విరుచుకుపడ్డారు. ఆయన చేష్టలన్నీ డ్రామాలుగా కొట్టిపారేశారు. మొత్తంగా బీజేపీ నేత ఆసుపత్రి పాలుకావటం వార్తాంశంగా మారింది.