Begin typing your search above and press return to search.

ఉక్కు పరిశ్రమకు కేంద్రం భారీ ఆర్థిక సాయం

తాజాగా విశాఖ ఉక్కు కోసం కేంద్రం 1,650 కోట్ల రూపాయలను పెట్టుబడి నిధిగా మంజూరు చేసింది.

By:  Tupaki Desk   |   4 Nov 2024 5:44 PM GMT
ఉక్కు పరిశ్రమకు కేంద్రం భారీ ఆర్థిక సాయం
X

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం అవుతుందని ఇటీవల వరకూ ప్రచారం సాగుతూ వచ్చింది. అయితే ఆ ప్రతిపాదన పాతబడి పోయినట్లు అయింది. విశాఖ ఉక్కుని పట్టాలెక్కించి తిరిగి లాభాల బాటను పట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇపుడు ఒక్కోటి కనిపిస్తున్నాయి.

లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటి అంటే విశాఖ ఉక్కు అనబడే రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ కి కేంద్రం భూరి సాయాన్ని ప్రకటించింది. అంటే స్టీల్ ప్లాంట్ లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను కేంద్రం నిలుపుదల చేస్తోంది అని అంటున్నారు. అదే సమయంలో ఉక్కుని ఆదుకునేందుకు ఉదారంగా నిధులు అందించేందుకు ముందుకు వస్తోంది.

తాజాగా విశాఖ ఉక్కు కోసం కేంద్రం 1,650 కోట్ల రూపాయలను పెట్టుబడి నిధిగా మంజూరు చేసింది. దీంతో ఉక్కు నష్టాలు కష్టాలు తగ్గించుకుని ప్లాంట్ ని చక్కగా కొనసాగించడానికి కేంద్రం ఈ కీలక చర్యలను తీసుకుంది అని అంటున్నారు.

నిజానికి చూస్తే విశాఖ ఉక్కు కర్మాగారంలో నిధుల కొరత అన్నది పట్టి పీడిస్తోంది. అలాగే ముడి పదార్ధాల కొరత కూడా ఉంది. దాంతోనే ప్లాంట్ మూసివేస్తారు అని అంతా అనుకున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక సాయం చేయడం ద్వారా విశాఖ ఉక్కుని ఆ కష్టాల నుంచి బయటకు తెస్తోంది.

ఉజ విశాఖ ఉక్కుకి ఈక్విటీకి 500 కోట్ల రూపాయలు, అలాగే వర్కింగ్ క్యాపిటల్ లోన్ గా 1140 కోట్ల రూపాయలను విడుదల చేసింది. 1650 కోట్ల రూపాయలను కేటాయించడం ద్వారా విశాఖ ఉక్కులో పెట్టుబడుల ఉపసంహరణ నుంచి పూర్తి ఉపశమనం కలిగించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది అని అంటున్నారు.

మరో వైపు విశాఖ ఉక్కు విషయంలో ఎస్బీఐ కాప్స్ ఉక్కు కర్మాగారం ఏ విధంగా సుస్థిరత సాధిస్తుంది అన్న దాని మీద ఒక నివేదికను తయారు చేసి కేంద్రానికి దానిని పంపేందుకు చర్యలు తీసుకుంటోంది. అది కనుక కేంద్రానికి చేరితే ఉక్కుకు పూర్తి స్థాయిలో ఉపశమనం కలుగుతుందని అంటున్నారు.

మొత్తం మీద చూస్తే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ బాట నుంచి ఆర్ధికంగా కోలుకునే దిశగా కేంద్రం సాయం అందించడం గొప్ప విషయం అని అంటున్నారు. దీనికి అంతటికీ కారణం ఏపీ ప్రభుత్వం అంటున్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు విశాఖ ఉక్కు పరిరక్షణకు హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగా ఇపుడు కేంద్రం నుంచి ఆర్ధిక సాయం భారీగా దక్కేలా చర్యలు తీసుకుంటున్నారు అని అంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం విశాఖ ఉక్కు కర్మాగారం పూర్తి స్థాయిలో అభివృద్ధి సాధిస్తుందని అంటున్నారు. ఆ మంచి రోజులు వస్తే కనుక విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న మాట చరిత్రలో బంగారు అక్షరాలతో లిఖించబడుతుంది.