Begin typing your search above and press return to search.

జగన్ కోసం విశాఖ ఏం చేస్తోందంటే....?

జగన్ ఈ నెల 24న విశాఖలో అడుగుపెట్టనున్నారు. అదే విధంగా విశాఖ నుంచి ఆయన పాలన చేయనున్నారు. సీం క్యాంప్ ఆఫీసు ఈ సరికే రెడీ అయింది.

By:  Tupaki Desk   |   24 Sep 2023 3:45 AM GMT
జగన్ కోసం విశాఖ ఏం చేస్తోందంటే....?
X

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖకు మకాం మారుస్తారు అన్నది ఖాయం అయిపోయింది. ఏకంగా ముఖ్యమంత్రి మంత్రి వర్గ సమావేశంలో దీనికి సంబంధించి సమాచారాన్ని ఇచ్చారు. ఆయన విజయదశమి శుభవేళ విశాఖకు రానున్నారు. ఆ రోజు నుంచి విశాఖ కేంద్రంగా చేసుకుని పాలన సాగిస్తారు. ఇదిలా ఉంటే జగన్ విశాఖ రాక, విశాఖ నుంచి పాలించడం ద్వారా విశాఖకు రాజధాని కళను కల్పించడం అన్నది పెద్ద ఎత్తున ప్రజలలో ప్రచారం చేయాలని, ప్రజా భాగస్వామ్యంతోనే విశాఖ పాలనను మొదలెట్టాలని కూఒడా వైసీపీ నిర్ణయించింది.

జగన్ ఈ నెల 24న విశాఖలో అడుగుపెట్టనున్నారు. అదే విధంగా విశాఖ నుంచి ఆయన పాలన చేయనున్నారు. సీం క్యాంప్ ఆఫీసు ఈ సరికే రెడీ అయింది. దాంతో పాటు అవసరమైన కార్యాలయాల కోసం ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇదిలా ఉంటే జగన్ విశాఖ రాక సందర్భంగా ఆయనకు స్వాగత సత్కారాలు అదిరిపోయే రేంజిలో ఉండాలని వైసీపీ తలపోస్తోంది.

విశాఖ రాజధాని కావాలని అప్పట్లో నాన్ పొలిటికల్ జేయేసీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేసింది. విశాఖభేరీ అంటూ మీటింగ్స్ కూడా నిర్వహించింది. ఇపుడు నాన్ పొలిటికల్ జేయేసీ ఆధ్వర్యంలో అక్టోబర్ 15 నుంచి 24 వరకూ అంటే పది రోజుల పాటు విశాఖ సహా ఉత్తరాంధ్రా జిల్లాలలో గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి పట్టణ స్థాయి దాకా ప్రతీ రోజూ విశాఖకు వందనం పేరుతో కార్యక్రమాలు నిర్వహించనుంది.

విశాఖకు రాజధాని రాబోతోంది అన్న సంగతిని ప్రతీ గ్రామానికి ప్రజలకూ తెలియచేయడం నాన్ పొలిటికల్ జేయేసీ లక్ష్యంగా ఉంది. అదే విధంగా విశాఖ నుంచి ముఖ్యమంత్రి పాలన చేస్తే విశాఖ సహా ఉత్తరాంధ్రా ప్రాంతాలకు పెద్ద ఎత్తున మేలు ఎలా జరుగుతుందో అన్న దానిని కూడా వివరంగా జనాలకు చెప్పనుంది.

అభివృద్ధి ఏ విధంగా పరుగులు తీస్తుంది, ఈ ప్రాంతాలలో జీవన విధానం ఏ విధంగా ఉన్నతం కానుంది అన్నది విశదీకరించనుంది. మరో వైపు జగన్ ఈ నెల 24న విశాఖ వచ్చేనాటికి మొత్తం మూడు జిల్లాలలోనూ ప్రజా చైతన్యం రగిలించి కనీ వినీ ఎరుగని తీరులో ముఖ్యమంత్రికి విశాఖలో ఘన స్వాగతం పలకాలని నిర్ణయించింది.

ఈ మేరకు వైసీపీ ఉత్తరాంధ్రా రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి మంత్రి గుడివాడ అమరనాధ్ నాన్ పొలిటికల్ జేయేసీతో తాజాగా సమావేశం జరిపారు. విశాఖలో ముఖ్యమంత్రి పాలన గురించి గ్రామ గ్రామాలలో ఎలా ప్రచారం చేయాలి, సీఎం రాక సందర్భంగా ఏ విధంగా వెల్ కం చెప్పాలన్నది కూడా ఈ సమావేశం లో చర్చించారు. మొత్తానికి విశాఖ ప్రజల ఆకాంక్షలను రాజకీయాలకు అతీతంగా తెలియచేయడంతో పాటు జగన్ విశాఖవాసి అవుతున్న వేళ ఆయనకు పూర్తి స్థాయిలో స్వాగతం పలకాలని నాన్ పొలిటికల్ జేయేసీ డిసైడ్ అయింది.