Begin typing your search above and press return to search.

ఎంపీ బిల్డింగ్ లో సీఎం ఆఫీస్...రాజయోగమే...!

ముఖ్యమంత్రి ఆఫీస్ ఎక్కడ అన్నది ఇపుడు చర్చగా ముందుకు వస్తోంది.

By:  Tupaki Desk   |   8 Aug 2023 1:30 AM GMT
ఎంపీ బిల్డింగ్ లో సీఎం ఆఫీస్...రాజయోగమే...!
X

ముఖ్యమంత్రి ఆఫీస్ ఎక్కడ అన్నది ఇపుడు చర్చగా ముందుకు వస్తోంది. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తరువాత అమరావతిలోని సచివాలయానికి వెళ్లిన సందర్భాలు బహు తక్కువ. ఆయన తాడేపల్లిలో కట్టుకున్న నివాసంలోనే క్యాంప్ ఆఫీసుని ఏర్పాటు చేసుకుని గత నాలుగేళ్ళుగా అక్కడ నుంచే పాలించారు. ప్రతీ రోజూ అక్కడే వివిధ శాఖల మీద సమీక్షా సమావేశాలు కూడా జరిగాయి.

ఇక విశాఖకు ముఖ్యమంత్రి మకాం మారుస్తున్నారు అన్నది కొత్త వార్త. ఇది నిజమే అన్నట్లుగా విశాఖలోని రుషికొండ వద్ద సిద్ధమవుతున్న ముఖ్యమంత్రి నివాస భవనం తార్కాణంగా ఉంది. చకచకా సాగుతున్న భవనం నిర్మాణం తో ఇక ముఖ్యమంత్రి విశాఖకు తరలిరావడం తధ్యమని అంతా భావిస్తున్నారు.

విశాఖలో ముఖ్యామంత్రి నివాసానికి అద్భుతంగా భవనం తయారవుతోంది. అదే సమయంలో సీఎం క్యాంప్ ఆఫీసుకు భవనం ఎక్కడ అంటే దానికి కూడా జవాబు ఉంది. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు చెందిన మరో అద్భుతమైన భవనంలో సీఎం క్యాంప్ ఆఫీసుని ఏర్పాటు చేస్తారని ప్రచారం గట్టిగా సాగుతోంది.

విశాఖలో ఎంవీవీ సత్యనారాయణ ఎంవీవీ బిల్డర్స్ పేరిట ఎన్నో కట్టడాలను నిర్మించారు. అందులో ఒకటిగా ఉన్న ఈ భవనంలోనే సీఎం ఇక మీదట క్యాంప్ ఆఫీసుగా వాడుకుంటారని అంటున్నారు. దాంతో అక్కడ కూడా అవసరమైన హంగూ ఆర్భాటాలు తయారవుతున్నాయని అంటున్నారు.

దీంతో ఇపుడు విశాఖ ఎంపీ బిల్డింగ్స్ మీద అందరి ఫోకస్ పడింది. సీఎం క్యాంప్ ఆఫీస్ అంటే ఏపీ పాలన అంతా అక్కడ నుంచే సాగుతుంది. దాంతో ఒక విధంగా టెక్నికల్ గా చెప్పుకుంటే రాజధానిగా విశాఖ ఉంటే హాట్ స్పాట్ గా సీఎం క్యాంప్ ఆఫీసు ఉంటుంది. అలాంటి ఆఫీస్ లోకేట్ అయి ఉన్న బిల్డింగ్ కే రాజముద్ర రాజమర్యాద దక్కుతాయి.

అలా కనుక చూసుకుంటే విశాఖ ఎంపీ లక్కీ అని అంటున్నారు. ఆయన జగన్ కి అత్యంత సన్నిహితులు అన్నది తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఆయనను ఎంపీగా మరోసారి పోటీ చేయమని జగన్ కోరుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఎంపీకి మాత్రం ఈసారి అసెంబ్లీకే పోటీ చేయాలని ఉందని అంటున్నారు.

దాంతో ఏకంగా ఎంపీ బిల్డింగ్ లోనే సీఎం క్యాంప్ ఆఫీసు ఉంటుందని అంటున్నారు కాబట్టి రానున్న రోజుల్లో ఎంపీ అసెంబ్లీ కోరిక కూడా తీరే అవకాశం ఉందని అంటున్నారు. ఏది ఏమైనా జగన్ విశాఖ మకాం గురించి రోజుకోక న్యూస్ తెలుస్తోంది. ఇందులో నిజానిజాలు పక్కన పెడితే భారీ ఎత్తున ప్రచారం మాత్రం జరుగుతోంది. అన్నట్లు సీఎం జగన్ నివాసం ఉండే ప్రాంతం భీమిలీ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది అని అంటున్నారు. భీమిలీ టీడీపీకి ఒకపుడు కంచుకోట. ఇపుడు వైసీపీ ఆ సీటుని గెలుచుకుంది. మరి వచ్చే ఎన్నికల్లో కూదా గెలించేందుకు సీఎం విశాఖ మకాం ఉపయోగపడుతుంది అని అంటున్నారు.