విశాఖ ఎంపీ సీటు మీద హాట్ హాట్ డిస్కషన్!
విశాఖ ఎంపీ సీటు చాలా ప్రతిష్టాత్మకమైనది. ఇక్కడ నుంచి ఎంపీగా గెలిచిన వారు గొప్పగా భావిసారు
By: Tupaki Desk | 19 May 2024 4:13 AM GMTవిశాఖ ఎంపీ సీటు చాలా ప్రతిష్టాత్మకమైనది. ఇక్కడ నుంచి ఎంపీగా గెలిచిన వారు గొప్పగా భావిసారు. దేశంలో 542 లోక్ సభ సీట్లు ఉంటే అందులో అందరికీ తెలిసినవి బహు కొద్ది మాత్రమే. అందులో విశాఖ ఎంపీ సీటు ఉంది. ఏపీలో మెగా సిటీగా ఉండడంతో ఈ సీటు మీద వైసీపీ టీడీపీ రెండూ ఫోకస్ పెట్టాయి. బీసీ కార్డుతో పాటు లోకల్ స్లోగన్ తో వైసీపీ బొత్స ఝాన్సీని బరిలోకి దించింది.
టీడీపీ మాజీ ఎంపీ దివంగత నేత ఎంవీవీస్ మూర్తి మనవడు శ్రీ భరత్ ని వరసగా రెండవసారి పోటీ చేయించింది. తాజాగా జరిగిన పోలింగ్ సరళి చూస్తే ఎవరు విజేత అన్నది చెప్పలేని పరిస్థితి ఉంది అని అంటున్నారు. 2019 మాదిరిగానే అనూహ్యమైన ఫలితం వస్తుందా అన్న చర్చ కూడా సాగుతోంది.
విశాఖ ఎంపీ సీటు పరిధిలో పోలింగ్ ఈసారి తక్కువ జరిగింది. దాంతో ఈ తక్కువ పోలింగ్ ఎవరి కొంప ముంచబోతోంది అన్నది కూడా పార్టీలలో హాట్ హాట్ డిస్కషన్ సాగుతోంది. మొత్తం 19 లక్షల మందికి పైగా ఓటర్లు ఉంటే ఓటేసింది పదమూడు లక్షల మంది. దాంతో ఏపీలోని పాతిక ఎంపీ సీట్లలో అతి తక్కువ పోలింగ్ జరిగిన సీటుగా విశాఖ ఎంపీని చూస్తున్నారు.
విశాఖ ఎంపీ సీటు పరిధిలోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో క్రాస్ ఓటింగ్ జరిగింది అన్న వార్తతో రెండు పార్టీల శిబిరాలు ఉలిక్కిపడుతున్నాయి. ఎస్ కోటలో క్రాస్ ఓటింగ్ జరిగిందని టీడీపీ ఎంపీకి ఆ పార్టీ రెబెల్ వర్గం ఓట్లేస్తే వైసీపీ రెబెల్ వర్గం ఓట్లూ కూడా శ్రీ భరత్ కి పడ్డాయని అంటున్నారు. టీడీపీ టికెట్ ఆశించిన గొంప క్రిష్ణ వర్గం శ్రీ భరత్ కోసం పనిచేసింది అని అంటున్నారు. అదే టైం లో టీడీపీ నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్ధికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేశారు అన్న ప్రచారం సాగుతోంది.
ఇక మరో రెండు అసెంబ్లీ సెగ్మెంట్లలో టీడీపీ మంచి మెజారిటీతో గెలుసుంది అనుకున్న చోట కూడా వైసీపీకి అనుకూలంగా కొంత క్రాస్ ఓటింగ్ జరిగింది అని ప్రచారం అయితే సాగుతోంది. ఇక విశాఖ సిటీలో రెండు సీట్లలో వైసీపీకి విజయావకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరో రెండు చోట్ల హోరా హోరీ పోరు సాగింది. మొత్తం మీద చూసుకుంటే టీడీపీ గెలిచినా లేక వైసీపీ గెలిచినా పదివేల లోపే మెజారిటీ రావచ్చు అన్నది పోలింగ్ అనంతరరం ఒక విశ్లేషణగా ముందుకు వస్తోంది. ఎవరు విజేత అన్నది తెలియాలంటే జూన్ 4 వరకూ వేచి చూడాల్సిందే.