మూడ్ ఆఫ్ విశాఖపట్నం...!
విశాఖపట్నం రాజధాని రాజసం కలిగిన జిల్లా. ఉత్తరాంధ్రాకు ముఖ ద్వారం. మినీ ఇండియాగా చెబుతారు.
By: Tupaki Desk | 8 Feb 2024 4:08 AM GMTవిశాఖపట్నం రాజధాని రాజసం కలిగిన జిల్లా. ఉత్తరాంధ్రాకు ముఖ ద్వారం. మినీ ఇండియాగా చెబుతారు. ఇక్కడ అభిప్రాయాలు చాలా స్పష్టంగా తెలివిగా ఉంటాయని కూడా అంటారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో అర్బన్ రూరల్ ఓ టర్ల మధ్యన అలాగే ఏజెన్సీ ఓటర్ల మధ్యన తీర్పులో వ్యత్యాసం కూడా కనిపిస్తుంటుంది. అలా విలక్షణమైన సలక్షణమైన తీర్పుని ఉమ్మడి విశాఖ జిల్లా ఇస్తుంది.
ఉమ్మడి విశాఖ జిల్లాలో పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2019లో ఇందులో ఏకంగా 11 అసెంబ్లీ సీట్లను వైసీపీ గెలుచుకుంది. విశాఖ సిటీలోని నాలుగుని టీడీపీ గెలుచుకుని సత్తా చాటింది. అలా విలక్షణమైన తీర్పు నాడు ఇచ్చిన జనాలు ఇపుడు 2024లో ఏ రకంగా రియాక్ట్ అవుతున్నారు అన్నది మూడ్ ఆఫ్ విశాఖను ప్రముఖ సర్వే సంస్థ పట్టుకునే ప్రయత్నం చేసింది. ఆ సర్వే ప్రకారం చూస్తే మొగ్గు టీడీపీ జనసేన కూటమికి కనిపిస్తోంది.
మొత్తం పదిహేను నియోజకవర్గాలు తీసుకుంటే టీడీపీ జనసేన కూటమికి 49.25 శాతం ఓటు షేర్ దక్కగా, వైసీపీకి 46.15 శాతం ఓటు షేర్ దక్కింది. ఇతరులకు 2.75 శాతంగా ఉంటే సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ 1.85 శాతంగా ఉంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూస్తే మొత్తం పదిహేను సీట్లలో టీడీపీకి మొగ్గు ఉన్నవి 8 ఉంటే, వైసీపీకి మొగ్గు ఉన్నవి 4 కనిపిస్తున్నాయి. హోరాహోరీ పోరుగా 3 సీట్లు ఉన్నాయి.
పాడేరు ఎస్టీ రిజర్వుడ్ సీటులో వైసీపీకి 49 శాతం టీడీపీ జనసేన కూటమికి 44 శాతం ఓటు షేర్ దక్కుతోంది. ఇతరులకు 4.5 శాతం, సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ 2.5 శాతంగా ఉన్నాయి. ఇక్కడ వైసీపీ 5 శాతం లీడ్ తో స్పష్టమైన ఆధిక్యతను కొనసాగిస్తోంది.
ఎలమంచిలిలో చూస్తే టీడీపీ కూటమికి 49 శాతం వైసీపీకి 47.5 శాతం ఓటు షేర్ దక్కుతూండగా ఇతరులకు 2 శాతం, సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ 1.5 శాతంగా ఉంది. ఇక్కడ వైసీపీ టీడీపీ కూటమి మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది.
పాయకరావుపేట ఎస్సీ రిజర్వుడ్ సీటు తీసుకుంటే వైసీపీకి 50 శాతం, టీడీపీ కూటమికి 46 శాతం ఓటు షేర్ దక్కేలా ఉంది. ఇతరులకు 2 శాతం, సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ కి 2 శాతం కనిపిస్తోంది. నాలుగు శాతం ఆధిక్యతతో వైసీపీ ఇక్కడ ఉంది.
నర్శీపట్నంలో టీడీపీ కూటమికి 49.5 శాతం వైసీపీకి 46 శాతం ఓటు షేర్ ఉంది. ఇతరులకు 2.5 శాతం, సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ 2 శాతం ఉంది. 3.5 శాతం ఓటు షేర్ తో వైసీపీ మీద టీడీపీ కూటమి ఇక్కడ ఆధిక్యంలో ఉంది.
విశాఖపట్నం సౌత్ లో వైసీపీకి 48.75 శాతం టీడీపీ కూటమికి 47 శాతం ఓటు షేర్ ఉంది. ఇతరులకు 2 శాతం, సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ గా 2.25 శాతం ఉంది. ఇక్కడ హోరా హోరీ పోరు రెండు పార్టీల మధ్య సాగే చాన్స్ ఉంది.
విశాఖ నార్త్ సీటులో చూస్తే వైసీపీకి 50 శాతం టీడీపీకి 47 శాతం ఓటు షేర్ ఉంది. ఇతరులకు 1.5 శాతం, సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ కింద 1.5 శాతం ఉంది. ఇక్కడ టీడీపీ కూటమి మీద వైసీపీ 3 శాతం ఆధిక్యతతో ఉంది.
విశాఖ పశ్చిమ సీటులో టీడీపీ కూటమి 52 శాతం ఓటు షేర్ వైసీపీకి 44 శాతం ఓటు షేర్ దక్కే చాన్స్ ఉంది. ఇతరులకు 2 శాతం, సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ 2 శాతం ఉంది. ఇక్కడ వైసీపీ మీద టీడీపీ కూటమి 8 శాతం ఓట్ షేర్ తో స్పష్టమైన ఆధిక్యతతో కొనసగుతోంది.
విశాఖ తూర్పులో చూసుకుంటే టీడీపీ కూటమికి ఓటు షేర్ 53 శాతం ఉంటే వైసీపీకి 44.5 శాతంగా ఉంది. ఇతరులకు 1 శాతం, సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ 1.5 శాతంగా ఉంది. ఇక్కడ 8.5 శాతం లీడ్ తో టీడీపీ కూటమి కొనసాగుతోంది.
చోడవరం సీటు విషయానికి వస్తే ఇక్కడ వైసీపీకి ఓటు షేర్ 49 శాతం టీడీపీ కూటమికి 48 శాతం ఉంది. ఇతరులకు 1.5 శాతం, సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ కింద 1.5 శాతం ఉంది. ఇక్కడ వైసీపీ 1 శాతం లీడ్ తో ఉంది. హోరా హోరీ పోరు తప్పేట్లు లేదు.
మాడుగులలో చూస్తే టీడీపీ కూటమి 50.5 శాతం వైసీపీ 45.5 శాతం ఓటు షేర్ తో ఉన్నాయి. ఇతరులకు 2 శాతం, సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ 2 శాతంగా ఉన్నాయి. ఇక్కడ టీడీపీ కూటమి వైసీపీ మీద 5 శాతం స్పష్టమైన ఆధిక్యతతో కొనసాగుతోంది.
అరకు సీటులో వైసీపీ 49.5 శాతం ఓటు షేర్, టీడీపీ 45 శాతం ఓటు షేర్ తో ఉన్నాయి. ఇక్కడ ఇతరులకు 3.25 శాతం, సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ 2.25 శాతంగా ఉన్నాయి. ఇక్కడ 4.5 శాతం లీడ్ తో వైసీపీ కొనసాగుతోంది.
భీమునిపట్నం సీటు విషయానికి వస్తే టీడీపీ కూటమికి 51 శాతం, వైసీపీకి 46 శాతం ఓటు షేర్ దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇతరులకు 1.5 శాతం, సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ 1.5 శాతంగా ఉన్నాయి. ఇక్కడ టీడీపీ కూటమి వైసీపీ మీద 5 శాతం స్పష్టమైన ఆధిక్యతతో కొనసాగుతోంది.
అనకాపల్లి తీసుకుంటే టీడీపీ కూటమి 49.5 శాతం, వైసీపీ 46.5 శాతం ఓటు షేర్ దక్కించుకునే చాన్స్ ఉంది. ఇతరులకు 2.5 శాతం వస్తే సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ కింద 1.5 శాతం కనిపిస్తోంది. ఇక్కద 3 శాతం లీడింగ్ తో టీడీపీ కూటమి ఉంది.
పెందుర్తి సీటు తీసుకుంటే టీడీపీ కూటమికి 51 శాతం వైసీపీకి 46 శాతం ఓటు షేర్ వచ్చే అవకాశం ఉంది. ఇతరులకు 1.75 శాతం, సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ 1.25గా ఉంది. ఇక్కడ 5 శాతం స్పష్టమైన ఆధిక్యతతో టీడీపీ కూటమి ఉంది.
గాజువాకలో తీసుకుంటే టీడీపీ కూటమి 49.5 శాతం వైసీపీ 46.5 శాతం ఓటు షేర్ తో ఉంటే ఇతరులకు 2.5 శాతం సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ గా 1.5 శాతం వచ్చే చాన్స్ ఉంది. ఇక్కడ 3 శాతం ఓటు షేర్ తో టీడీపీ కూటమి ఉంది.