Begin typing your search above and press return to search.

జగన్ భారీ ఆఫర్ కి నో చెప్పిన విశాఖ !

విశాఖలోనే జూన్ 9న రెండోసారి సీఎం గా ప్రమాణం చేస్తాను అని జగన్ పదే పదే ఎన్నికల సభలో చెప్పారు.

By:  Tupaki Desk   |   4 Jun 2024 6:55 AM GMT
జగన్ భారీ ఆఫర్ కి నో చెప్పిన విశాఖ !
X

వైసీపీ విశాఖకు భారీ ఆఫర్ ని ప్రకటించింది. విశాఖను అంతర్జాతీయ నగరంగా చేస్తామని ప్రామిస్ చేసింది. విశాఖను పాలనా రాజధానిగా చేస్తామని కూడా పేర్కొంది. విశాఖలోనే జూన్ 9న రెండోసారి సీఎం గా ప్రమాణం చేస్తాను అని జగన్ పదే పదే ఎన్నికల సభలో చెప్పారు.

కానీ తీరా చూస్తే కనుక విశాఖ జిల్లా మొత్తం వైసీపీని దూరం పెట్టేసింది. 2019 ఎన్నికల్లో విశాఖలో వైసీపీకి మొత్తం 15 సీట్లకు గానూ 11 వస్తే ఈసారి కేవలం రెండంటే రెండు చోట్ల మాత్రమే ఆధిక్యత కనిపిస్తోంది. అవి పాడేరు, అరకు సీట్లుగా ఉన్నాయి.

దీనిని బట్టి చూస్తే విశాఖ ప్రజానీకం అంతా మాకొద్దీ రాజధాని అని ముక్తకంఠంతో తీర్పు ఇచ్చేశారు అని అంటున్నారు. విశాఖను తాము విశ్వ నగరం చేస్తామని పాలనను ఇక్కడికే తీసుకుని వస్తామని జగన్ ఎంత చెప్పినా విశాఖ జనాలు ఏ మాత్రం నమ్మలేదు అనడానికే ఇది ఒక ఉదాహరణ అని అంటున్నారు.

ఏది ఏమైనా విసాఖ వాసులు మాత్రం రాజధానిగా అమరావతినే కోరుకుంటున్నారు అని స్పష్టమైది. విశాఖ ప్రశాంత నగరం అని అభివృద్ధి మాత్రమే జరగాలి తప్ప రాజధాని పేరుతో రాజకీయం తగవని అంటున్నారు. అందుకే విశాఖ గురించి ఎంత వైసీపీ చెప్పినా ప్రజలు మాత్రం వద్దు అనే అంటూ వచ్చారు.

మరో వైపు అమరావతి రాజధానిగా ఉండాలని వైసీపీ గతంలో ఒప్పుకుని ఆ తరువాత 2019లో మాట మార్చడం వల్ల అక్కడ జనాలు వైసీపీని తీసి పక్కన పెట్టారు. అలా అటు రాజధాని కోరుకున్న అమరావతి వాసుల కోరికను పట్టించుకోకుండా ఇటు విశాఖ రాజధాని వద్దు అంటున్న కూడా ఇదే రాజధాని అని వైసీపీ చేసిన ఈ స్వారీకి గుక్క తిప్పుకోలేని జవాబుని అంటు అమరావతి వాసులతో పాటు ఇటు విశాఖ వాసులు కూడా ఇచ్చారు అని అంటున్నారు.

ప్రజల మనసెరిగి రాజకీయాలు ఎవరైనా చేయాలి కానీ తన సొంత అజెండాను జనం నెత్తి మీద రుద్దాలనుకుంటే మాత్రం అది తప్పు అవుతుందని కూడా తాజా ఫలితాలు నిరూపించాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు అన్నది కూడా పచ్చి నిజం అయింది అని అంటున్నారు.