ఒక రైలు కథ : నాందేడ్ టు విశాఖ
వీరంతా ఆంధ్రప్రదేశ్ లోనితాడేపల్లి, రాజమండ్రి, విశాఖపట్నం ప్రాంతాలకు చెందిన వారు. ఓటు వేయాలన్న సంకల్పంతో రెండు నెలలు ముందుగానే రైలు టికెట్లు బుక్ చేసుకున్నారు.
By: Tupaki Desk | 14 May 2024 5:18 AM GMTఓటు మన హక్కు. దానిని వినియోగించుకోవడం మన బాధ్యత అనుకున్నారు వారు. ఉపాధి, ఉద్యోగరీత్యా వారు మహారాష్ట్రలోని నాందేడ్ లో ఉంటున్నారు. వీరంతా ఆంధ్రప్రదేశ్ లోనితాడేపల్లి, రాజమండ్రి, విశాఖపట్నం ప్రాంతాలకు చెందిన వారు. ఓటు వేయాలన్న సంకల్పంతో రెండు నెలలు ముందుగానే రైలు టికెట్లు బుక్ చేసుకున్నారు.
దాదాపు ఐదు వేల మందితో బయలుదేరిన ఆ రైలు నాందేడ్ నుంచి విశాఖపట్నం వెళ్లాల్సిన రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మే 12వ తేది రాత్రి 9.30 కు రావాల్సి ఉంది. అయితే 5-6 గంటలు ఆలస్యంగా రావడంతో 13 తేది తెల్లవారిజామున 3 నుంచి 4 గంటల ప్రాంతంలో చేరుకుంది. దీంతో మధ్యాహ్నం 3 లేదా 4 గంటలకు తమ తమ నియోజకవర్గాలకు చేరుకుని ఓటు హక్కు వేసే అవకాశం ఉంటుందని భావించారు. కానీ విశాఖపట్నం చేరుకునే సరికి సోమవారం సాయంత్రం 5.17 నిమిషాలు అయింది.
రైలు దిగి స్టేషన్ నుంచి ఇండ్లకు వెళ్లి పోలింగ్ కేంద్రాలకు వెళ్లేసరికి పోలింగ్ సమయం 6 గంటలు దాటడంతో పోలింగ్ కేంద్రాల గేట్లు మూసేశారు. తాము ఎంతో దూరం ప్రయాణించి వచ్చామన్నా సమయం అయిపోయిందని చెప్పేశారు. రైలు ప్రయాణంలోనే వారు వీడియో రూపంలో ఎన్నికల సంఘానికి, రైల్వే అధికారులకు మొరపెట్టుకున్నా ఎవరూ స్పందించలేదు. దీంతో తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకోలేకపోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.