Begin typing your search above and press return to search.

మారు మనసుతో వైసీపీ నేతలు...బాబు ఓకే చెబుతారా ?

విశాఖ సౌత్ నుంచి రెండు సార్లు టీడీపీ టికెట్ మీద గెలిచిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మళ్లీ పసుపు పార్టీ తీర్ధం పుచ్చుకోవడానికి సిద్ధం అని కబురు పంపుతున్నారు.

By:  Tupaki Desk   |   20 July 2024 2:26 AM GMT
మారు మనసుతో  వైసీపీ నేతలు...బాబు ఓకే చెబుతారా ?
X

వైసీపీలోకి వెళ్ళిన టీడీపీ మాజీ తమ్ముళు మనసు మార్చుకున్నారు. మారు మనసుతో తిరిగి సైకిలెక్కేందుకు సిద్ధంగా ఉన్నామని వర్తమానం పంపిస్తున్నారు. తప్పు జరిగిందని అంటున్నారు. క్షమించమని కూడా వేడుకుంటున్నారు తమకు చోటిస్తే సర్దుకుని పోతామని రాయబారాలలో స్పష్టం చేస్తున్నారు.

విశాఖ జిల్లాకు చెందిన వీరిని టీడీపీలోకి చేర్చుకోవడానికి ఒక మాజీ మంత్రి ద్వారా హై కమాండ్ కి కబురు పంపించారుట. అయితే వారిని చేర్చుకోవద్దని ఎట్టి పరిస్థితుల్లో చాన్స్ ఇవ్వవద్దని ఆయా నియోజకవర్గాల్లో క్యాడర్ తో పాటు నాయకులు కూడా హై కమాండ్ కి చెబుతున్నారుట.

విశాఖ సౌత్ నుంచి రెండు సార్లు టీడీపీ టికెట్ మీద గెలిచిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మళ్లీ పసుపు పార్టీ తీర్ధం పుచ్చుకోవడానికి సిద్ధం అని కబురు పంపుతున్నారు. ఆయనకు విద్యా వ్యాపారాలు ఉన్నాయని అంటున్నారు. అధికార పార్టీలో ఉంటేనే ఆయనకు అంతా సజావుగా సాగుతుంది.

గతంలో వైసీపీలోకి వెళ్ళేందుకు కూడా ఇదే కారణం అని అంటున్నారు. అయితే సౌత్ లో ఆయన రాకను టీడీపీ తమ్ముళ్ళు గట్టిగా తప్పుపడుతున్నారు. ఆయన వస్తే మళ్లీ వర్గ పోరు స్టార్ట్ అవుతుందని వారు అంటున్నారు. అయితే విశాఖ సౌత్ కి జనసేన నుంచి గెలిచిన ఎమ్మెల్యే వంశీ క్రిష్ణ శ్రీనివాస్ ఉన్నారు.

ఆయనది తూర్పు నియోజకవర్గం. 2029లో ఆయన అక్కడే పోటీ చేస్తారు అని అంటున్నారు దాంతో వాసుపల్లి తాను పార్టీలో చేరితే 2029 నాటికి అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు. టీడీపీలో సౌత్ లో లీడర్లు ఉన్నా ఎమ్మెల్యే స్థాయి కలిగిన వారు లేరని ఆలోచిస్తున్నారు. అందుకే తనకు టీడీపీలో చేరేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నారు

విశాఖ పశ్చిమం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలు అయిన ఆడారి ఆనంద్ కుమార్ తనతో పాటు తన సోదరి ఎలమంచిలి మున్సిపాలిటీ చైర్ పర్సన్ ని కూడా తీసుకుని వస్తామని చెబుతున్నారు. మొత్తం మీద అంతా కలసి టీడీపీలో చేరిపోతామని అంటున్నారు. టీడీపీలోనే తన తండ్రి నాలుగు దశాబ్దాలుగా సేవ చేశారని దివంగత నేత విశాఖ డైరీ చైర్మన్ ఆడారి తులసీరావుని గురించి కూడా ప్రస్తావనకు తెస్తూ చంద్రబాబు మెప్పు పొందేందుకు చూస్తున్నారు.

అలాగే మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు కూడా తన విద్యా వ్యాపారాలను కాపాడుకోవడానికి టీడీపీలో చేరాలని ఉత్సాహ పడుతున్నారు. వీరితో పాటు మొత్తం ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు అయిదుగురు దాకా టీడీపీ వైపుగా అడుగులు వేస్తున్నారు. తమకు పదవులు అవసరం లేదని కాస్తా చోటిస్తే చాలు అని వారు అంటున్నారు.

ఈ విషయంలో క్యాడర్ అభ్యంతరాలు చెబుతూండడంతో అధినాయకత్వం ఆగుతోందని అంటున్నారు. కొంతకాలం జరిగాక పరిస్థితి సద్దుమణుగుతుందని దాంతో చేర్చుకోవచ్చు అన్నది టీడీపీ హై కమాండ్ ఆలోచనగా ఉందిట. వైసీపీలో ఎవరూ పెద్ద నేతలు మిగలకుండా చేస్తేనే ఆ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు అన్నది టీడీపీ పెద్దల వ్యూహంగా ఉంది అని అంటున్నారు.