Begin typing your search above and press return to search.

రేవంత్ రెడ్డి కరెక్ట్...బీజేపీ రాజు కుండబద్దలు కొట్టారు !

కొన్ని విషయాలలో బీజేపీ రాజు గారు ముక్కు సూటిగానే వ్యవహరిస్తారు అనడానికి మరో ఉదాహరణ ఇది.

By:  Tupaki Desk   |   23 Dec 2024 2:18 PM GMT
రేవంత్ రెడ్డి కరెక్ట్...బీజేపీ రాజు కుండబద్దలు కొట్టారు !
X

కొన్ని విషయాలలో బీజేపీ రాజు గారు ముక్కు సూటిగానే వ్యవహరిస్తారు అనడానికి మరో ఉదాహరణ ఇది. ఏపీ బీజేపీ కానీ తెలంగాణా బీజేపీ కానీ సినీ హీరో అల్లు అర్జున్ ఇష్యూలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తప్పు పడుతోంది. విమర్శలు చేస్తోంది అయితే అదే బీజేపీకి చెందిన సీనియర్ నాయకుడు ఏపీ శాసనసభలో బీజేపీ పక్ష నాయకుడు అయిన విష్ణు కుమార్ రాజు బెనిఫిట్ షోలు రద్దు చేస్తూ తెలంగాణా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అంటూ తనదైన డెసిషన్ చెప్పేశారు. అయితే ఇది వ్యక్తిగత అభిప్రాయం అంటూనే ఆయన చెప్పాల్సింది చెప్పారు.

ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ తన అభిప్రాయం అంటూనే బెనిఫిట్ షోల మీద గట్టిగానే కామెంట్స్ చేశారు. ఈ కల్చర్ ని పూర్తిగా రద్దు చేయాలని కూడా కోరారు. దీని వల్ల సామాన్యులు జేబుకు చిల్లు పడుతోంది అని అన్నారు. ఇక ఈ బెనిఫిట్ షోలు వేసుకుంటే లబ్ది పొందే వారు ఎవరు అని ఆయన ప్రశ్నించారు. మూడు వందల ఖరీదు చేసే టికెట్ ని మూడు రెట్లు పెంచి తొమ్మిది వందలకు అమ్ముతున్నారని ఆయన విమర్శించారు. సగటు జనాల సినీ వ్యామోహాన్ని ఈ విధంగా వాడుకుంటున్నారు అని ఆయన హాట్ కామెంట్స్ చేశారు.

డబ్బుతో పాటు అక్కడ జరిగే తొక్కిసలాటలో సామాన్యుల ప్రాణాలు కూడా పోతున్నాయని అన్నారు. అల్లు అర్జున్ ఇష్యూలో తమ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి ఇది రాజకీయ ప్రతీకార చర్యగా భావించవచ్చునని, అలాగే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అల్లు అర్జున్ అరెస్ట్ ని తప్పు పట్టవచ్చు కానీ ఈ విషయంలో రేవంత్ రెడ్డి చేసినది కరెక్ట్ అని రాజు ఫుల్ క్లారిటీతో చెప్పారు. ఈ కేసులో రేవంత్ రెడ్డి చేస్తున్న మంచి గురించి మెసేజ్ కూడా చేశాను అని ఆయన అన్నారు.

దీంతో ఇపుడు బీజేపీ రాజు గారి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇప్పటిదాకా కాంగ్రెస్ నుంచి కమ్యూనిస్టుల నుంచి రేవంత్ రెడ్డి నిర్ణయానికి మద్దతు వచ్చింది. బీజేపీ అయితే రేవంత్ రెడ్డి సర్కార్ మీద విమర్శలతో దాడి చేస్తోంది. అక్కడ ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులూ రేవంత్ రెడ్డి సర్కార్ ని ఈ విషయంలో కార్నర్ చేస్తున్నారు

అయితే ఏపీ బీజేపీలో కీలకంగా ఉన్న నేత విష్ణు కుమార్ రాజు రేవంత్ రెడ్డి గుడ్ జాబ్ చేస్తున్నారు ఆయన చేసినది కరెక్ట్ అని ప్రశంసించడం అంటే ఇది కమలం పార్టీ పరంగా సంచలనమైన ప్రకటనగా చూడాల్సి ఉంది. బీజేపీలో ఇది భిన్న వాదనగా కూడా చూడాల్సి ఉంది. అయితే విష్ణు కుమార్ రాజు తన సొంత అభిప్రాయమని చెప్పారు. కానీ పాలిటిక్స్ లో ప్రజా జీవితంలో సొంత అభిప్రాయాలు ఏవీ ఉండవు, మీడియా ముఖంగా ఆయన తన ఒపీనియన్ చెప్పాక కచ్చితంగా అది హైలెట్ అయి తీరుతుంది. మొత్తానికి రాజు గారు తన సొంత పార్టీతోనే ఈ విషయంలో డిఫర్ అవుతున్నారని అంటున్నారు.

అయితే ఆయన ప్రజా కోణంలో మాట్లాడారని కూడా అంటున్నారు బెనిఫిట్ షోలు కల్చర్ వద్దు అన్నది ఆయన చెప్పిన విషయమని సామాన్యుల పక్షాల ఆయన మాట్లాడారని మరో వైపు ఆయనకు మద్దతు దక్కుతోంది. ఏది ఏమైనా విష్ణు కుమార్ రాజు ఈ హీటెడ్ ఇష్యూలో తన వాయిస్ వినిపించి తన సైడ్ ఏంటో కూడా చెప్పేశారు.

మరి ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది. అందులో బీజేపీ భాగస్వామ్యంగా ఉంది. రాజు గారి ఈ విధంగా చెప్పిన విషయం కూటమి ప్రభుత్వం కూడా సీరియస్ గా డిస్కష్ చేస్తుందా అన్నది కూడా మరో చర్చగా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.