'విష్ణు' చక్రానికి.. 'గంట' అడ్డు.. రాజుగారి ఆవేదన ..!
బీజేపీ సీనియర్ నాయకుడు, విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తీవ్ర అసహనంలో ఉన్నారట.
By: Tupaki Desk | 7 Feb 2025 12:30 AM GMTబీజేపీ సీనియర్ నాయకుడు, విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తీవ్ర అసహనంలో ఉన్నారట. కూటమిలో భాగస్వామిగా ఉన్నా.. తనకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని తెగ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అసలు కూటమి పార్టీగా ఉన్నామా? లేక.. ప్రతిపక్షంలో ఉన్నామా? అని ఆయన అనుచరుల వద్ద తెగ ఆవేదన పడుతున్నట్టు విశాఖ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని తెలిసింది.
1) గత 2014-19 మధ్య టీడీపీ హయాంలో రాజుగారు కొన్ని కాంట్రాక్టు పనులు చేశారు. ఈ పనులకు సంబం ధించి 86 కోట్ల రూపాయలకు పైగానే ఆయనకు ప్రభుత్వం నుంచి బకాయిలు రావాల్సి ఉంది. వైసీపీ హయాంలో ఈ సొమ్ములు ఇచ్చేందుకు.. నాయకులు సిద్ధపడలేదు. పైగా పార్టీ మారితే ఇస్తామని ఆఫర్ ఇచ్చారని రాజుగారే అనేక సందర్భాల్లో చెప్పారు. ఈ విషయంపై కూటమి సర్కారు వద్ద ఆయన ప్రస్తావిం చారు. అయినప్పటికీ.. సొమ్ముల విషయం తేల్చడం లేదని రాజుగారు చెబుతున్నారు. చూద్దాం.. చేద్దాం.. అనే మాటే వినిపిస్తోంది.
2) గత ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల మాట ఎలా ఉన్నా.. ప్రస్తుతం కూటమి సర్కారు చేపట్టిన రహదారుల నిర్మాణ పనులకు సంబంధించి రాజుగారికి కాంట్రాక్టులు దక్కడం లేదు. ఆయన ఎంత ప్రయత్నించినా.. ప్రయోజనం లేకుండా పోతోంది. దీంతో తనకు పాత బకాయిలు ఇవ్వడం లేదని.. కొత్త పనులు కూడా అప్పగించడం లేదని.. ఆయన వాపోతున్నారు. కూటమిలో ఉన్నామంటే ఉన్నామని.. తమకు వాల్యూలేకుండా పోయిందని చెబుతున్నారు.
అయితే..ఈ రెండు అంశాలకు కూడా.. టీడీపీ కీలకనాయకుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావే అడ్డు పడుతున్నారన్నది రాజుగారి వర్గం చేస్తున్న ఆరోపణ. అయితే.. దీని వెనుక ఉన్న నిజాలేంటనేది వారు వెల్లడించడం లేదు. గంటా మాత్రం భీమిలిలోనే ఉంటున్నారు. పార్టీ పరంగా పనిచేసుకుంటున్నారు. కానీ, రాజుగారి వర్గం మాత్రం గంటా ఎక్కడ ఉన్నా.. చేయాల్సింది చేస్తున్నారని... అన్ని విషయాలను తమకు యాంటీగా మారుస్తున్నారని.. నిధులు ఇవ్వకుండా అడ్డుపడుతున్న వారిలో ఆయన కూడా ఉన్నారని ఆరోపిస్తున్నారు. కానీ, వీటికి సంబంధించిన రుజువులు కానీ.. సాక్ష్యాలు కానీ, వారు ప్రొవైడ్ చేయడం లేదు. మొత్తానికి రాజుగారి ఆవేదన ఇదన్నమాట.