ఫ్యామిలీలో గొడవలపై మంచు విష్ణు ఇంట్రస్టింగ్ కామెంట్స్!
గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీలో గొడవలు రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... తమకు ప్రాణహాని ఉందంటూ మంచు మోహన్ బాబు, మనోజ్ లు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్న పరిస్థితి.
By: Tupaki Desk | 24 Feb 2025 8:44 AM GMTటాలీవుడ్ లో విడుదలకు సిద్ధంగా ఉన్న భారీ చిత్రాల్లో "కన్నప్ప" ఒకటనే సంగతి తెలిసిందే. ఈ సినిమాను మంచు ఫ్యామిలీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తుందని చెబుతున్నారు. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడిన విష్ణు.. కన్నప్పపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. పైగా.. ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్ వంటి స్టార్ లు ఉండటంతో అంచనాలు పెరిగిపోతున్నాయి.
గతంలో ఎన్నడూ లేని స్థాయిలో అన్నట్లుగా భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏప్రిల్ 25న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ పనిలో విష్ణు బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తమ ఫ్యామిలీ గొడవలపై స్పందించారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అవును... గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీలో గొడవలు రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... తమకు ప్రాణహాని ఉందంటూ మంచు మోహన్ బాబు, మనోజ్ లు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్న పరిస్థితి. ఇటు హైదరాబాద్ నుంచి అటు చంద్రగిరి వరకూ పలు కేసులు నమోదైనట్లు చెబుతున్నారు. అయితే తన పోరాటం ఆస్తుల కోసం కాదని.. ఆత్మాభిమానం కోసమని మనోజ్ చెబుతున్నారు.
ఈ సమయంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మంచు విష్ణు స్పందించారు. ఈ సందర్భంగా తన తండ్రిపట్ల ఆయనకున్న గౌరవం, ఆరాధనా భావంతో పాటు ఫ్యామిలీ సమస్యలపైనా స్పందించారు. ఇందులో భాగంగా... తన ఎదుట శివుడు ప్రత్యక్షమై వరం ఇస్తానంటే.. ఎన్ని జన్మలెత్తినా తనకు తండ్రిగా మోహన్ బాబే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటామని అన్నారు.
ఇదే సమయంలో.. తనకు ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టమని.. నేను అమ్మనాన్నతో ఉండాలని.. ఇదే సమయంలో నా పిల్లలు అలాంటి కుటుంబ వాతావరణంలోనే పెరగాలనేది నా కోరిక అని విష్ణు తెలిపారు. ఇక తమ కుటుంబంలోని కలహాలు, గొడవలకు త్వరగా ఫుల్ స్టాప్ పడితే బాగుండనిపిస్తోందని విష్ణు అన్నారు.