Begin typing your search above and press return to search.

ఓటర్లపై బీజేపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు.. రికార్డులు తీస్తున్న నెటిజన్లు!

అవును... బీజేపీ ఎమ్మెల్యే పెన్మెత్స విష్ణుకుమార్ రాజు అనుచిత వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   24 July 2024 6:00 AM GMT
ఓటర్లపై బీజేపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు.. రికార్డులు  తీస్తున్న నెటిజన్లు!
X

సాధారణంగా అధికారంలోకి వచ్చిన అనంతరం చాలా మంది రాజకీయ నాయకులు అధికారులపై అవాకులూ చెవాకులూ పేలుతుంటారు.. అభాసుపాలవుతుంటారు! అయితే తాజాగా ఏపీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాత్రం EkaMgaa ఓటర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కారణాలు ఏవైనా అసెంబ్లీ వేదికగా వైసీపీకి ఓటు వేసిన వారిపై శృతిమించిన వ్యాఖ్యలు చేశారు!

అవును... బీజేపీ ఎమ్మెల్యే పెన్మెత్స విష్ణుకుమార్ రాజు అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి ఓటు వేసినవారి గురించి అసెంబ్లీ సాక్షిగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చలో భాగంగా స్పందించిన విష్ణుకుమార్ రాజు... కూటమి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తూ, జగన్ పాలపై విమర్శలు చేశారు.

అది సహజమే! కానీ... అక్కడితో ఆగని ఆయన... వైసీపీకి ఓటు వేసినవారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీకి 40శాతం ఓట్లు పోలైన అంశాన్ని ప్రస్థావిస్తూ... ఆ పార్టీకి ఓట్లు వేశారంటే వాళ్లు అన్నం తినే వేశారా.. మనసుతో ఆలోచించి ఓట్లు వేశారా.. ఏ విధంగా ఓట్లు వేశారో అర్ధం కావటం లేదు అంటూ వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో... ఐదేళ్ల వైసీపీ పాలన చూసిన తర్వాత కూడా ఈ విధంగా ఓట్లు వేయటంపై ఆలోచించాలని అన్నారు. ఇలా వైసీపీ ఓట్లు వేసినవారిపై ఏపీ బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అసెంబ్లీ వేదికగా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు దిమ్మతిరిగే కౌంటర్లు ఇస్తున్నారని అంటున్నారు! ఈయన చేసిన వ్యాఖ్యలు ఈయనతోనే పోవని కామెంట్ చేస్తున్నారు!

కాగా... విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుంచి గెలిచిన విష్ణుకుమార్ రాజు ఇటీవల ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేయగా... 1,08,801 (57%) ఓట్లు పోలయ్యాయి. ఇక, 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయగా... 18,790 (10.63%) ఓట్లు పోలయిన సంగతి తెలిసిందే.