రాజస్థాన్ రాజకుటుంబంలో మొదలైన రగడ
ఇటీవల కాలంలో కుటుంబ గొడవలు కామన్ గా మారాయి. గతంలో ఉమ్మడి కుటుంబాల్లో ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండేవి కావు.
By: Tupaki Desk | 20 May 2024 6:08 AM GMTఇటీవల కాలంలో కుటుంబ గొడవలు కామన్ గా మారాయి. గతంలో ఉమ్మడి కుటుంబాల్లో ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండేవి కావు. ఇప్పుడు అన్ని చిన్న కుటుంబాలు చింతలతో కాలం గడుపుతున్నాయి. రాజకుటుంబాల్లో అయితే ఆస్తుల కోసం గొడవలు చెలరేగడం సహజమే. ఈనేపథ్యంలో రాజస్థాన్ లో ఓ రాజకుటుంబంలో వారసత్వం కోసం దుమారం రేగుతోంది.
రాజస్థాన్ లోని భరత్ పుర్ రాజకుటుంబంలో తన భార్య, మాజీ ఎంపీ దివ్యా సింగ్ తనయుడు అనిరుధ్ తనను వేధిస్తున్నారంటూ మాజీ రాష్ట్రమంత్రి విశ్వేంద్ర సింగ్ (62) వాపోయారు. తన ఆస్తి తనకు దక్కకుండా వారు తనపై దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నా తన గురించి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో కొన్ని రోజులు సంచారం చేస్తూ మరికొన్ని రోజులు హోటళ్లలో తలదాచుకుంటున్నట్లు వెల్లడించారు. భరత్ పురలో ఉన్న తన ఇంట్లోకే రానివ్వడం లేదు. నన్ను చంపేందుకు కుట్ర పన్నుతున్నారు. సోషల్ మీడియాలో తనపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు.
తనకు నెలకు రూ.5 లక్షల భరణంతో పాటు మోతీ మహల్ ను తిరిగి తనకు ఇప్పించాలని కోరుతున్నాడు. తన భార్య దివ్యాసింగ్, కుమారుడు అనిరుధ్ కలిసి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. వారసత్వ ఆస్తులను విశ్వేంద్రసింగ్ విక్రయిస్తున్నాడని తల్లికొడుకులు వాపోతున్నారు. దీంతో న్యాయస్థానం ఏం తీర్పు చెబుతుందో తెలియడం లేదు.
ఇప్పుడు కేసు కోర్టుకు వెళ్లడంతో ఏ రకమైన తీర్పు ఇస్తుందోనని అందరు చూస్తున్నారు. దివ్యాసింగ్, అనిరుధ్ లకు అనుకూలంగా వస్తుందా? లేక విశ్వేంద్ర సింగ్ కు మద్దతుగా నిలుస్తుందా అనేది తేలాల్సి ఉంది. రాజ కుటుంబం కేసు కావడంతో అందరిలో ఉత్కంఠ పెరుగుతోంది.