Begin typing your search above and press return to search.

చంద్రబాబుని కలిసిన వివేక కుమార్తె... సీఎం రియాక్షన్ ఇదే!!

ఈ వ్యవహారం ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో మరీ పీక్స్ కి చేరింది.

By:  Tupaki Desk   |   17 Sep 2024 1:19 PM GMT
చంద్రబాబుని కలిసిన వివేక కుమార్తె... సీఎం రియాక్షన్  ఇదే!!
X

గత కొంతకాలంగా ఏపీ రాజకీయాల్లో అత్యంత చర్చనీయాంశమైన అంశాల్లో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతం అనేది తెలిసిన విషయమే! ఈ వ్యవహారం ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో మరీ పీక్స్ కి చేరింది. నేరస్థులను జగనే రక్షిస్తున్నారంటూ అను వైఎస్సార్ కుమార్తె షర్మిళ, వివేకా కుమార్తె సునీత విమర్శలు గుప్పించారు.

ఒకానొక సమయంలో ఈ విమర్శలు మరింత పీక్స్ కి వెళ్లిన పరిస్థితి. ఒక్కమాటలో చెప్పాలంటే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రధానంగా కడప లోక్ సభ స్థానం పూర్తిగా వైఎస్ వివేకా హత్య కేసుపై విమర్శలు ప్రతివిమర్శల మధ్య జరిగిందని చెప్పొచ్చు! ఈ క్రమంలో తాజాగా ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన వేళ సునీత.. చంద్రబాబుని కలిశారు.

అవును... వివేకానందరెడ్డి కుమార్తె సునీత దంపతులు నేడు ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిశారు. ఈ సందర్భంగా బాబు దృష్టికి పలు కీలక విషయాలు తీసుకొచ్చారని తెలుస్తోంది. ఇందులో భాగంగా... వివేకా పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు అప్పటి సీబీఐ ఎస్పీ రాంసింగ్ తో పాటు తమపైనా అక్రమ కేసు పెట్టారని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది.

ఈ సమయంలో వివేకా పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదులో నిజానిజాలపై విచారణ చేయించాలని.. రాంసింగ్ పై కేసు వంటి అంశాలపైనా విచారణ చేయించాలని.. సీఐడీ ద్వారా వాస్తవాలు బయటకు తేవాలని సునీత దంపతులు సీఎం చంద్రబాబుని కోరినట్లు చెబుతున్నారు. అయితే సునీత విజ్ఞప్తిపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారని.. ఈ మేరకు హామీ ఇచ్చారని సమాచారం!

కాగా... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత నెలలో సునీత... ఏపీ హోంమంత్రి అనితను కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వివేకా హత్య తదనంతర పరిణామాలను హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా... గత ప్రభుత్వ హయాంలో హంతకులకే పోలీసులు అండగ నిలిచారని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో తాజాగా సీఎంను కలిశారు.