వీడు తోపు వ్యక్తిత్వ వికాస నిపుణుడు.. ఇంట్లో భార్యను తల్లిని మాత్రం..!
ఆమెపై అతగాడి అరుపుల్ని విన్నయనికా.. వారి మధ్యకు వెళ్లి అతడికి సర్ది చెప్పే ప్రయత్నంచేసింది. దీంతో గొడవ మరింత ముదిరింది. భర్తకు సర్ది చెప్పే పని యనిక చేయగా.. ఆమె పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించాడు వివేక్.
By: Tupaki Desk | 24 Dec 2023 5:53 AM GMTఊరంతా నీతులు చెబుతూ.. నిజ జీవితంలో ఎలా బతకాలి. ఎంత ఉన్నత విలువలు ఉండాలంటూ సొల్లు చెప్పే చాలామంది.. వారి వ్యక్తిగత జీవితాల్లో ఆ సూత్రాల్ని పాటించకపోగా.. అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంటారు.ఆ కోవకు చెందిన ఈ ఉదంతం గురించి తెలిస్తే షాక్ తినాల్సిందే. అంతేకాదు.. అడ్డమైన ప్రతి ఒక్కడు తమ మాటలతో ప్రజల్ని ఎంతలా మోసం చేస్తున్నారో అర్థమవుతుంటుంది. ఇలాంటోడి నీతుల్ని ఇంతకాలం విన్నామా? అన్న భావన కలిగేలా చేసి.. మన మీద మనకే చిరాకు పుట్టేలా చేస్తుంది.
సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సరుగా.. బడా బిజినెస్ ప్రైవేటు లిమిటెడ్ వ్యవస్థాపకుడైన వివేక్ బింద్రా సుపరిచితుడు. వ్యక్తిత్వవికాసం గురించి గంటల కొద్దీ స్పీచులు ఇస్తూ.. తన నీతివంతమైన మాటలతో లక్షలాది మంది మనసుల్ని దోచుకుంటూ ఉంటాడు. అతడి వ్యక్తిత్వ వికాస ప్రసంగాలకు లక్షలాది మంది ఫిదా అయిపోవటమే కాదు అతడి యూట్యూబ్ చానల్ కు భారీగా జనాలు ఫాలో అవుతుంటారు. ఆయన్ను ఫాలో అయ్యే వారిలో సెలబ్రిటీలు కూడా ఉంటారు. అలాంటి వివేక్ బింద్రాకు సంబంధించిన షాకింగ్ నిజం బయటకు వచ్చింది.
వివేక్ బింద్రాకు.. యనికాకు డిసెంబరు ఆరున పెళ్లైంది. వీరిద్దరు నొయిడాలోని సెక్టార్ 94లోకొత్త కాపురాన్ని ప్రారంభించారు. పెళ్లైన తర్వాతి రోజు ఉదయం వివేక్ కు.. అతడి తల్లికి మధ్య ఏదో గొడవ జరిగింది. ఆమెపై అతగాడి అరుపుల్ని విన్నయనికా.. వారి మధ్యకు వెళ్లి అతడికి సర్ది చెప్పే ప్రయత్నంచేసింది. దీంతో గొడవ మరింత ముదిరింది. భర్తకు సర్ది చెప్పే పని యనిక చేయగా.. ఆమె పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించాడు వివేక్.
ఆమెను గదిలోకి లాక్కెళ్లి ఆమెపై దాడి చేయటమే కాదు.. ఆమె ఫోన్ ను పగలగొట్టాడట. అంతేకాదు.. అతగాడి దెబ్బలకు ఆమె వినికిడి శక్తి కోల్పోయినట్లుగా ఆమె సోదరుడు పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ ఉదంతం గురించి తెలిసిన వారంతా షాక్ తింటున్నారు. ఫిర్యాదు నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. వివేక్ బింద్రా తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.