Begin typing your search above and press return to search.

తమిళంలో వివేక్ రామస్వామి ప్రచారం... వీడియో వైరల్!

అవును... అధ్యక్ష అభ్యర్థిత్వానికి కోసం రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ పడుతున్న వివేక్ రామస్వామి.. తాజాగా తమిళ్ లో మాట్లాడారు

By:  Tupaki Desk   |   27 Sep 2023 4:07 AM GMT
తమిళంలో వివేక్ రామస్వామి ప్రచారం... వీడియో వైరల్!
X

అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం రిపబ్లికన్ పార్టీ తరఫున బరిలో ఉన్న భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి ప్రచారంలో దూకుడు ప్రదర్శించడంతోపాటు వైవిద్యాన్ని కనబరుస్తున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా తాజాగా భారత్ లో ఉన్నప్పటి తన మాతృభాష తమిళ్ లో మాట్లాడిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

అవును... అధ్యక్ష అభ్యర్థిత్వానికి కోసం రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ పడుతున్న వివేక్ రామస్వామి.. తాజాగా తమిళ్ లో మాట్లాడారు. ఇందులో భాగంగా ఆయనే తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియోని పోస్ట్ చేశారు. ఇందులో తనను కలిసిన వ్యక్తి తమరిని అమెరికా అధ్యక్షుడిగా చూడాలని అనుకుంటున్నట్లు తెలిపాడు.

ఇదే సమయంలో తాను తమిళనాడు నుంచి వచ్చానని చెప్పి పరిచయం చేసుకున్నాడు. రాబోయే ఎన్నికల్లో మంచి జరగాలని విషెస్ చెప్పాడు. ఈ సమయంలో వారికి షాకిచ్చే స్థాయిలో రామస్వామి తమిళంలోనే సమాధానం ఇచ్చారు. కేరళ, తమిళనాడు సరిహద్దులో ఉన్న పాలక్కాడ్ పట్టణంలో మాట్లాడే మాండలికంలో తన తమిళ్ ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

ఆ సంగతి అలా ఉంటే... 2024లో యూఎస్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల్లో అధ్యక్ష బరిలో నిలిచేందుకు పలువురు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష రిపబ్లిక్ పార్టీలో ఈ పోటీ ఎక్కువగా ఉందనే చెప్పుకోవాలి. కారణం... మాజీ అధ్యక్షుడు ట్రంప్ తో పాటు ఇండో అమెరికన్లు వివేక్ రామస్వామి, నిక్కీ హెలీ లాంటి వారు పోటీలో ఉన్నారు.

మరోవైపు తన ప్రచార కార్యక్రమాల్లో భాగంగా అమెరికా ఆర్థిక సంక్షోభంపై వివేక్ రామస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ముందుముందు అమెరికా ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే రాజకీయాలకు అతీతంగా ఉన్న వ్యక్తిని సీఈవో గా తీసుకుంటామని అన్నారు. ఇదే సమయంలో... గతేడాది బడ్జెట్ లో చేసిన తప్పులు చేయకుండా పారదర్శకంగా జరిగేలా చూస్తామని తెలిపారు.

ఇదే సమయంలో.. ఎన్నికల ప్రచారానికి నిధుల సేకరణ కోసం వివేక్‌ తో "ప్రత్యేక విందు" కు పలువురికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో పాల్గొనేందుకు 50వేల డాలర్ల పైనే చెల్లించాల్సి ఉంటుంది.