కాంగ్రెస్ లో చేరికపై వివేక్ క్లారిటీ... పోటీ చేసే స్థానం ఫిక్స్!
అవును... బీజేపీకి రాజీనామా చేసి త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే ప్రచారంపై ఎంపీ వివేక్ వెంటస్వామి స్పందించారు.
By: Tupaki Desk | 25 Oct 2023 12:22 PM GMTఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రసవత్తర రాజకీయం జరుగుతుంది. రోజు రోజుకీ రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. అసంతృప్తులు పార్టీలు మారుతంటే.. అధిష్టాణాలు బుజ్జగించే పనుల్లో బిజీగా ఉన్నాయి. మరోపక్క నామినేషన్ల ప్రక్రియకు సమయం దగ్గరపడింది. ఇందులో భాగంగా నవంబర్ 3వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 30న ఎన్నికలు జరగనున్నాయి.
ఈ సమయంలో రెండుమూడు నియోజకవర్గాలు మినహాయిస్తే అధికార బీఆరెస్స్ ఆల్ మోస్ట్ అభ్యర్థులందరినీ ముందే ప్రకటించింది. ఇదే క్రమంలో మేనిఫెస్టోనూ విడుదల చేసేసింది. సెంట్ మెంట్ లో భాగంగా హుస్నాబాద్ నుంచి ఎన్నికల ప్రచార శంఖారావం పూరించింది! ప్రచారం జోరు పెంచింది. మరోపక్క కాంగ్రెస్ పార్టీ 55 మందితో అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. ఇప్పటికీ ఆపరేషన్ ఆకర్ష కంటిన్యూ చేస్తుంది.
త్వరలో రెండో విడత జాబితా విడుదలవుతుందని చెబుతున్నారు. ఇదే సమయంలో బీజేపీ కూడా 52 మంది అభ్యర్థులతో తొలిజాబితా విడుదల చేసింది. నాటి నుంచి ఆ పార్టీలో అసంతృప్తుల స్వరాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో... కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామిలు బీజేపీని వీడతారని.. అనంతరం కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది.
ఈ సమయంలో ప్రచారాన్ని నిజం చేస్తూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజినామా చేశారు. ఈ నెల 27న కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని తెలుస్తుంది! దీంతో వివేక్ వెంకటస్వామిపై ఫోకస్ పెరిగింది. పైగా ఈయన తండ్రి వెంకటస్వామి సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ లో వివిధ హోదాల్లో పని చేయడంతోపాటు.. ఫక్తూ కాంగ్రెస్ వాదిగా ఉండటంతో.. వివేక్ కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నారని పుకార్లు షికారు చేశాయి. ఈ ప్రచారం పైన వివేక్ స్పందించారు.
అవును... బీజేపీకి రాజీనామా చేసి త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే ప్రచారంపై ఎంపీ వివేక్ వెంటస్వామి స్పందించారు. తాను బీజేపీ వీడి కాంగ్రెస్ లో చేరుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తాను కాంగ్రెస్ లో టచ్ లో లేనని, పార్టీ మార్పుపై చర్చలు చేయలేదని క్లారిటీ ఇచ్చారు. తాను బీజేపీకి రాజీనామా చేయటం లేదని ప్రకటించారు.
ఇదే సమయంలో... రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పు గురించి తనకు తెలియదని, తాను మాత్రం బీజేపీలోనే వుంటానని తేల్చి చెప్పారు. తాను మాత్రం తెలంగాణలో బీజేపీ విజయం కోసం పని చేస్తానని వివేక్ తెలిపారు. ఇదే క్రమంలో... తాను అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలబడటం లేదని.. వచ్చే లోక్ సభ ఎన్నికలకు సిద్దం అవుతున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా... పెద్దపల్లి నుంచి నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేసారు.
దీంతో... వివేక్ వెంకటస్వామి పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారానికి ఆయన స్పష్టమైన ఫుల్ స్టాప్ పెట్టారని అంటున్నారు పరిశీలకులు. మరి దీనికి సంబంధించిన ప్రచారాలు కూడా తదనుగుణంగా ఆగిపోతాయే లేదో చూడాలి! కాగా... బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాలో పలువురు సీనియర్ల పేర్లు లేకపోవడంతో... వారంతా పార్టీ మారబోతున్నట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఎంపీలుగా పోటీచేయడంపై వారు ఆసక్తి చూపడంతోనే... వారి అభిష్టాన్ని అధిష్టాణం పరిగణలోకి తీసుకుందని మరికొంతమంది వివరణ ఇచ్చారు!