Begin typing your search above and press return to search.

జమీమా హనీ ట్రాప్... జ్యూస్ ఇచ్చి స్టార్ట్ చేస్తుంది.. తెరపైకి మరో ఘోరం!

ఈ నేపథ్యంలో తాజాగా ఓ కీలకమైన మూడో కేసు విశాఖ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ లో నమోదయ్యింది.

By:  Tupaki Desk   |   16 Oct 2024 7:00 AM GMT
జమీమా హనీ ట్రాప్... జ్యూస్  ఇచ్చి స్టార్ట్  చేస్తుంది.. తెరపైకి మరో ఘోరం!
X

ఇటీవల కాలంలో వెలుగుచూసిన జాయ్ జమీమా హనీ ట్రాప్ వ్యవహారాలు ఎన్నో, ఎన్నెన్నో, మరెన్నో, ఇంకెన్నో మలుపులు తీసుకుంటున్నాయని అంటున్నారు! ఈ సందర్భంగా ఆమె బాధితులు పోలీస్ స్టేషన్ లకు క్యూ కడుతున్నారు! ఈ నేపథ్యంలో తాజాగా ఓ కీలకమైన మూడో కేసు విశాఖ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ లో నమోదయ్యింది.

అవును... జాయ్ జమీమా హనీ ట్రాప్ వ్యవహారం విశాఖలో హాట్ టాపిక్ గా మారింది. ఆమె బాధితులు ఒక్కొక్కరుగా వెలుగులోకి వస్తున్నారు! ఇందులో భాగంగా... ఇప్పటికే భీమిలీ, కంచరపాలెంలో ఆమెపై కేసులు నమోదవ్వగా.. తాజాగా మరో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విశాఖ ఎయిర్ పోర్ట్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు.

వివరాళ్లోకి వెళ్తే... విశాఖ మురళీనగర్ లో ఓ కంపెనీలో ప్రాజెక్ట్ హెడ్ గా చేరాడూ హైదరాబాద్ కు చెందిన వ్యక్తి. ఈ సమయంలో... తాను ఆ కంపెనీ యజమాని బంధువునంటూ జాయ్ జమీమా అతడిని పరిచయం అయ్యింది. ఈ నేపథ్యంలో... అతని ఆఫీస్ టైమింగ్స్ ని పగటి నుంచి నైట్ షిఫ్ట్ కి మార్పించింది.

ఈ సమయంలో అతడితో చనువుగా ఉంటు, జ్యూస్ లు ఇస్తూ ముగ్గులోకి లాగింది! ఈ సమయంలో అతడు మత్తులో ఉన్న సమయంలో నగ్మంగా ఫోటోలు తీసిందని చెబుతున్నారు! ఆ ఫోటోలు చూపించి అతని నుంచి ఇప్పటికే లక్షల్లో డబ్బులు వసూలు చేసిందంట. దీంతో తనను వదిలేయాలని బాధితుడు వేడుకొనగా.. రూ.3 కోట్లు డిమాండ్ చేసిందని చెబుతున్నారు.

ఈ సమయంలో బాధితుడు విశాఖ నుంచి హైదరాబాద్ కు వెల్లిపోతున్నాడనే అనుమానంతో సుమారు వారం రోజుల పాటు గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేసిందట. ఈ సమయంలో బాధితుడి ఒంటిపై ఉన్న గాయాలను ఫోటోలు తీసి, అతని కుటుంబ సభ్యులకు పంపించేదంట.

ఈ విధంగా రకరకాలుగా బ్లాక్ మెయిల్ కి పాల్పడిందని చెబుతున్నారు. దీంతో... కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ఇటీవల ఆమెపై భీమిలిలో కేసు నమోదవ్వడంతో ఈ బాధితుడు ధైర్యం చేసి బయటకు వచ్చి ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో జాయ్ జమీమా అక్రమాలకు సహకరిస్తున్నవారిపై పోలీసులు గట్టి నిఘా పెట్టారని తెలుస్తోంది.

కాగా... జమీమా బాధితుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో... ఆమె వెనుక ఓ పెద్ద ముఠా ఉన్నట్లు చెబుతున్నారు. ఆమెను అడ్డుపెట్టుకుని డబ్బున్న వారిని ఉచ్చులోకి లాగుతున్నారని.. ఈ క్రమంలో ఆమెతో వారికి డ్రగ్స్ అలవాటు చేస్తున్నారని అనుమానిస్తున్నారు.

ఇప్పటికే జమీమా నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్ టాప్ లో పలు కీలక సమాచారం దొరికిందని తెలుస్తోంది! ఇదే క్రమంలో... ఆమె ఫోన్ పే ద్వారా జరిగిన లావాదేవీలను పరిశీలిస్తున్న పోలీసులు.. ఆమెకు డబ్బులు ఎవరి నుంచి వచ్చాయి, అవి ఎవరికి ట్రాన్స్ ఫర్ అయ్యాయి అనే విషయాలపి కూపీ లాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలుసుకున్న ముఠాసభ్యుల వివరాల మేరకు వెదుకులాట ప్రారంభించారని సమాచారం!