Begin typing your search above and press return to search.

స్టీల్ ప్లాంట్ మీద ఒట్టు...ఇష్యూ వెరీ సీరియస్...!

ఒక్కో ఎన్నికల్లో ఒక్కో అంశం హాట్ టాపిక్ గా ఉంటుంది. ఉత్తరాంధ్రకు సంబంధినంతరవకూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇష్యూ చాలా పెద్దదిగానే ఉంది.

By:  Tupaki Desk   |   8 April 2024 3:39 AM GMT
స్టీల్ ప్లాంట్ మీద ఒట్టు...ఇష్యూ వెరీ సీరియస్...!
X

ఒక్కో ఎన్నికల్లో ఒక్కో అంశం హాట్ టాపిక్ గా ఉంటుంది. ఉత్తరాంధ్రకు సంబంధినంతరవకూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇష్యూ చాలా పెద్దదిగానే ఉంది. మరీ ముఖ్యంగా విశాఖ సిటీలో కొంత వరరకూ రూరల్ లో దాని ప్రభావం గట్టిగానే ఉంటుందని అంటున్నారు. ఉత్తరాంధ్రా అంతటా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రత్యక్షంగా పాతిక నుంచి ముప్పై వేల మంది కార్మికులు ఉద్యోగులు పనిచేస్తున్నారు.

అలాగే పరోక్షంగా మరో లక్ష మంది దాకా పనిచేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మందికి ఉపాధిని ఇస్తోంది. ఆర్ధికంగా వాణిజ్యపరంగా ఉత్తరాంధాకు కీలకంగా ఉంది. అలాంటి స్టీల్ ప్లాంట్ ఇష్యూని అన్ని రాజకీయ పార్టీలు గత మూడేళ్ళుగా లైట్ తీసుకున్నాయి.

స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తామని 2021 ఫిబ్రవరిలో కేంద్రం సూచనాప్రాయంగా తెలియచేసింది. నాటి నుంచి ఉద్యోగులు కార్మికులు అందరూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని ఉద్యమాలు చేస్తున్నారు. వేయి రోజులు పై దాటి సాగుతోంది ఉక్కు నిరసన శిబిరం.

ఇంత జరుగుతున్నా పట్టని రాజకీయ పార్టీలకు ఇపుడు అక్కర వచ్చింది. విశాఖ సిటీతో పాటు రూరల్ లో కొన్ని కీలక సీట్లను గెలవాలంటే విశాఖ స్టీల్ ప్లాంట్ మీద అనుకూలంగా మాట్లాడాలి. అందుకే ప్రతీ వారూ వచ్చి స్టీల్ ప్లాంట్ మీద ఒట్టు పెట్టేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయనీయమని అంటున్నారు. మేము కూడా పోరాడుతున్నామని అంటున్నారు.

స్టీల్ ప్లాంట్ విషయంలో మా చిత్తశుద్ధిని శంకించలేరు అని అంటున్నారు. వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై ప్రధాని మోడీ విశాఖపట్నం వచ్చినపుడు వేలాది మంది ప్రజల ఎదుటే కుండ బద్దలు కొట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

విశాఖకే కాదు ఏపీకే ఉక్కు ఫ్యాక్టరీ తలమానికం అంటున్నారు.గాజువాక నియోజక వర్గంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే సెంటిమెంట్ ను వదులుకునే ప్రసక్తే లేదని విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీలక్ష్మి స్పష్టం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటికరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.బీజేపీ పార్టీ నేతృత్వంలోని కూటమి విశాఖకు ద్రోహం చేస్తున్నాయని ఆమె విమర్శించారు.విశాఖ కు వ్యతిరేకంగా వస్తున్న కూటమి నేతలను నిలదీయాలని ఆమె పిలుపు నిచ్చారు.

మరో వైపు టీడీపీ కూటమి నేతలు విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం కాకుండా కాపాడుతామని అంటున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలే తమకు ముద్దు అంటున్నారు. అయితే రాజకీయ పార్టీలు ఇస్తున్న ఈ ఎన్నికల హామీలను ఉక్కు ఉద్యమకారులు తిప్పికొడుతున్నారు. మూడేళ్ళ పాటు ఉక్కు సమస్యను ఉద్యమన్ని పట్టించుకోని వారు ఇపుడు ఎన్నికల నేపధ్యంలోనే ఇలా మాట్లాడుతున్నారని వామపక్షాలు విమర్శిస్తున్నాయి. ఉక్కు ప్రైవేట్ కాకుండా ఉండాలంటే బీజేపీ జనసేన టీడీపీలతో పాటు వైసీపీకి కూడా ఓటు వేయరాదని వారు అంటున్నారు.

విశాఖలోని గాజువాక. పెందుర్తి, విశాఖ పశ్చిమ, ఉత్తరం నియోజకవర్గాలతో పాటు అనకాపల్లి సహా రూరల్ లో చాలా నియోజకవర్గాలలో ఉక్కు ఉద్యమ ప్రభావం ఉంది. రెండు ఎంపీ సీట్ల మీద ఉక్కు ప్రైవేటీకరణ అంశం ఉంటుంది. దాంతో రాజకీయ పార్టీలు అన్నీ కలసి ఉక్కు మద్దతు కోసం తమ వంతుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. మరి ఎవరికి ఉక్కు కార్మికుల మద్దతు దక్కుతుందో చూడాలి.