పో*ర్న్ కు ప్రత్యామ్నాయం కావాలి... లంచ్ బ్రేక్ లో సె*క్స్ చేయండి!
తాజాగా రష్యా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలపై స్పందించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ కామెంట్స్ చేశారు.
By: Tupaki Desk | 20 Dec 2024 4:23 AM GMTఇటీవల కాలంలో పో*ర్న్ ఇండస్ట్రీ ప్రతీ దేశానికి సమస్యగా మారుతుందనే చర్చ విపరీతంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో భారత్ వంటి దేశాలు కొన్ని వెబ్ సైట్స్ ని బ్లాక్ చేసినప్పటికీ.. దొడ్డి దారులు వెత్తుకుంటూ ఆ వెబ్ సైట్ లు ఏదో మూల దర్శనమిస్తున్నాయని అంటున్నారు. ఈ సమయంలో పుతిన్ ఆసక్తికర విషయం లేవనెత్తారు.
అవును... అశ్లీల కంటెంట్ కు ప్రత్యామ్నాయాలను రుపొందించాలని పుతిన్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా... ప్రజల దృష్టిని ఆకర్షించడానికి మరింత ఆసక్తికరమైన, ఉద్వేగభరితమైన ఏదైనా కొత్త అంశాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. తాజాగా రష్యా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలపై స్పందించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ కామెంట్స్ చేశారు.
ఈ సందర్భంగా స్పందిస్తూ... ప్రపంచవ్యాప్తంగా పో*ర్న్ సైట్లు సందర్శిస్తున్నారని.. ఇది కేవలం రష్యాకు మాత్రమే ఉన్న సమస్య కాదని.. ప్రతీ దేశానికి ఉన్న సమస్య అని వ్యాఖ్యానించారు పుతిన్. అందువల్ల.. అటువంటి కంటెంట్ ను నిషేధించడానికి మరింత బలమైన ప్రత్యామ్నాయాన్ని అందించడం చాలా ముఖ్యం అని అభిప్రాయపడ్డారు.
పని విరామ సమయంలో సె*క్స్ లో పాల్గొనండి!:
ఇదే సమయంలో... ఇటీవల దేశంలో తగ్గుతున్న జననాల రేటును పరిష్కరించే లక్ష్యంతో ఆసక్తికర సూచనలు చేశారు పుతిన్. ఇందులో భాగంగా.. మధ్యాహ్నం భోజన, సాయంత్రం కాఫీ విరామ సమయాల్లో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనాలని, దేశంలో తగ్గుతున్న సంతానోత్పత్తి రేటును పెంచాలని సూచించారు.
ప్రస్తుతం రష్యాలో సంతానోత్పత్తి రేటు ఒక్కో మహిళకు సుమారు 1.5 మంది పిల్లలుగా ఉండగా.. జనాభా స్థిరత్వానికి అవసరమైన 2.1 కంటే ఇది తక్కువ అనే ఆందోళనల నేపథ్యంలో ప్రెసిడెంట్ ఈ వ్యాఖ్యలు చేశారు!
ఉక్రెయిన్ తో యుద్ధం ముగించేందుకు సిద్ధం!:
ఇదే సమయంలో ఉక్రెయిన్ తో అవిరామంగా జరుగుతున్న యుద్ధం గురించి పుతిన్ స్పందించారు. ఇందులో భాగంగా... ఉక్రెయిన్ తో యుద్ధం ముగించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని.. దీనికోసం ఎవరితోనైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని.. దీనిపై ఎలాంటి ముందస్తు షరతులూ పెట్టకుండా బేషరతుగా చర్చలకు సిద్ధంగా ఉన్నామని పుతిన్ వెల్లడించారు.