Begin typing your search above and press return to search.

ఉక్రెయిన్, రష్యా చర్చలు మధ్య భారత్ ….పుతిన్!

గత కోతికాలంగా ఉక్రెయిన్ ,రష్యా దాడులతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఇన్ని రోజులకు రష్యా చర్చలకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది.

By:  Tupaki Desk   |   5 Sep 2024 12:11 PM GMT
ఉక్రెయిన్, రష్యా చర్చలు మధ్య భారత్ ….పుతిన్!
X

గత కోతికాలంగా ఉక్రెయిన్ ,రష్యా దాడులతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఇన్ని రోజులకు రష్యా చర్చలకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఇదే విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ తెలిపారు. అయితే రష్యాకు ఉక్రెయిన్ కు మధ్యవర్తిత్వం చేసే అవకాశం కేవలం మూడు దేశాలకే ఆయన కల్పించారు. ఆగస్టు ప్రాంతంలో రష్యాలోని కుర్స్క్ సమీపంలో ఉక్రెయిన్ సరిహద్దు చొరబాటు ప్రారంభించింది. సరిహద్దు మీదుగా వేలాదిమంది సైనికులను పంపి అనేక గ్రామాలను స్వాధీనం చేసుకోవడానికి తలపెట్టింది. ఇక దీనిపై రష్యా తన రేంజ్ చర్య తీసుకోవడం ప్రారంభించింది.

తాజాగా రష్యాలోని వ్లాడివోస్టాక్ నగరంలో జరిగిన ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్‌లో ఎదురైన ప్రశ్నలకు పుతిన్ సమాధానం ఇస్తూ..రష్యా చర్చలకు సిద్ధంగా ఉందని, అయితే 2022లో ఇస్తాంబుల్ లో కుదుర్చుకున్న రష్యా, కైవ్ ఒప్పందం ఆధారంగానే చర్చలు జరుపుతామని స్పష్టం చేశారు. అయితే తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉక్రెయిన్ పర్యటన తర్వాత..రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు కుదిరేలా కనిపిస్తున్నాయి.

ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పిన పుతిన్..అందుకోసం తమ మిత్ర దేశాలైన ఇండియా, చైనా,బ్రెజిల్ సహకరించాలని కోరారు. ఈ నేపథ్యంలో మాట్లాడుతూ “మిత్రులను, భాగస్వాములను గౌరవించడం మాకు అలవాటు. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధానికి కారణమైన సమస్యలను మా మిత్ర దేశాలు పరిష్కరించగలరని భావిస్తున్నాను. వారితో ఈ పరిస్థితులపై నిత్యం సంప్రదింపులు జరుపుతూ సమస్యలపై చర్చిస్తున్నాము.” అని పుతిన్ అన్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన రష్యా ప్రెసిడెన్షియల్ స్పోక్స్‌పర్సన్ .. ప్రస్తుతం రష్యా,ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న భీకర పోరును పరిష్కరించడంలో భారతదేశంలో కీలక పాత్ర పోషించగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.పెస్కోవ్ మాట్లాడుతూ.. భారత ప్రధానికి పుతిన్ కు మధ్య మంచి సాన్నిహిత్యం ఉందని.. మోడీకి రష్యా తో పాటు అటు ఉక్రెయిన్ తో కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయని.. అందుకే వీరు దేశాలతో మాట్లాడి శాంతి చర్చలు మోడీ సునాయాసంగా జరపగలరు అన్న ధీమా వ్యక్తం చేశారు.