ఆయనకు 71, ఆమెకు 39... పుతిన్ మళ్లీ మొదలు పెట్టారంట!
ప్రస్తుతం ఈమె క్రెమ్లిన్ కు మద్దతుగా ఉండే "సేఫ్ ఇంటర్నెట్ లీగ్"కు హెడ్ గా వ్యవహరిస్తున్నారు
By: Tupaki Desk | 20 Feb 2024 3:38 PM GMTరష్యా అధ్యక్షుడు పుతిన్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా వివాదాస్పద అధ్యక్షుల జాబితాలో కూడా పుతిన్ కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుందని చెబుతుంటారు. ఇక తనకు ఎదురుతిరిగిన వారిని హత్యలు చేయిస్తారని నిత్యం విమర్శలు ఏదో ఒక మూల వినిపిస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో 71 వయసున్న పుతిన్ మళ్లీ ప్రేమలో పడ్డారని స్థానిక మీడియా కోడై కూస్తుంది.
అవును... రష్యా అధ్యక్షుడి వ్యక్తిగత జీవితం రహస్యంగా ఉన్నప్పటికీ... 71 ఏళ్ల పుతిన్ 39ఏళ్ల ఎకాథరీనా మిజులినాతో సంబంధం కలిగి ఉన్నట్లు స్థానిక మీడియాలో కథనాలొస్తున్నాయి. తనకంటే 32 ఏళ్లు చిన్నదైన ఆమెతో పుతిన్ కి అవినాభావ సంబంధం ఉందని అంటున్నారు. పుతిన్ కు అనుకూల సెనెటర్ గా పేరున్న ఎలెనా మిజులినా(69) కుమార్తెనే ఎకాథరీనా కావడం గమనార్హం.
ప్రస్తుతం ఈమె క్రెమ్లిన్ కు మద్దతుగా ఉండే "సేఫ్ ఇంటర్నెట్ లీగ్"కు హెడ్ గా వ్యవహరిస్తున్నారు. ఉక్రెయిన్ తో యుద్ధం నేపథ్యంలో రష్యాతో పాటు పుతిన్ పై వచ్చే విమర్శలను తొలగించడం, ఖండించడమే ఈ సంస్థ ప్రధానమైన పని. ఈ క్రమంలోనే బార్బీ బొమ్మలా కనిపించే ఈమెతో పుతిన్ సన్నిహితంగా ఉంటున్నారంటూ వార్తలు వస్తున్నాయి.
ఎకాథరీనా 2017లో ఈ "సేఫ్ ఇంటర్నెట్ లీగ్" లో చేరారు. చైనాను సందర్శించే రష్యన్ ప్రతినిధులకు అనువాదకురాలిగా అంతకు ముందు ఆమె పనిచేశారు. ఈ క్రమంలో... ఈమెతో పుతిన్ ప్రేమాయణం నిజమేనంటూ ఉక్రెయిన్ మీడియా కథనాలు ప్రచురిస్తోంది. దీంతో వీటిని ఉటంకిస్తూ డైలీ మెయిల్ రిపోర్ట్ లో పుతిన్ ప్రేమ వ్యవహారానికి సంబంధించిన వార్తను తెరపైకి తెచ్చింది.
కాగా.. 2014లో పుతిన్ తన భార్య లియుడ్మిలాకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. వారిది సుమారు 30 ఏళ్ల వైవాహిక బంధం కాగా... ఆ తర్వాత ఒలిపింక్స్ గోల్డ్ మెడలిస్ట్ "అలీనా కబయేవా"తో ఆయన ప్రేమలో ఉన్నారని.. ఫలితంగా వీరికి ముగ్గురు సంతానం కూడా ఉన్నారంటూ కథనాలొచ్చాయి. ఈ క్రమంలో తాజాగా ఈ కొత్త ప్రేమ వ్యవహారం తెరపైకి వచ్చింది.