వైసీపీ రెక్కలు విరిచిన వాలంటీర్ !
అవునా నిజమా అంటే ఇపుడు వైసీపీ నేతలు అంతా పెద్ద గొంతుక చేసుకుని అవుని ఇదే నిజం అని బల్లగుద్దుతున్నారు.
By: Tupaki Desk | 8 Jun 2024 3:59 AM GMTఅవునా నిజమా అంటే ఇపుడు వైసీపీ నేతలు అంతా పెద్ద గొంతుక చేసుకుని అవుని ఇదే నిజం అని బల్లగుద్దుతున్నారు. అధికారంలో ఉన్నపుడు అయిదేళ్ళ పాటు వీరంతా కిమ్మనలేదు. వలంటీర్లతోనే అంతా అన్నారు. వారే తమ బలమని చెప్పుకున్నారు. కానీ దిగువ స్థాయి క్యాడర్ మాత్రం మొత్తుకుంది.మొర పెట్టుకుంది, చివరికి చేతులెత్తేసింది. ఫలితంగా వైసీపీ ఎన్నడూ చూడని విధంగా కనీ వినీ ఎరుగని తీరులో ఓటమి పాలు అయింది.
దాంతో మాజీ మంత్రుల నుంచి సీనియర్ నేతలు మాజీ ఎమ్మెల్యేలు అంతా ఒక్కొక్కరుగా మీడియా ముందుకు వచ్చి పెదవి విప్పుతున్నారు. వాలంటీర్ల వల్ల సర్వనాశం అయ్యామని బోరుమంటున్నారు. అది నిజమే అని గణాంకాలు చెబుతున్నాయి.
కాస్తా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే వైసీపీ పుట్టింది 2011లో. తొలి ఎన్నికల్లోనే జగన్ కడప ఎంపీగా ఆయన తల్లి విజయమ్మ పులివెందుల ఎమ్మెల్యేగా భారీ ఆధిక్యతతో గెలిచారు. అపుడు ఏర్పడిన బలమైన కార్యకర్తల సమూహం 2019 ఎన్నీకల వరకూ వెన్నంటే ఉంది.
అలా 2012లో ఉమ్మడి ఏపీలో జరిగిన ఉప ఎన్నికల్లో మొత్తం 18 ఎమ్మెల్యేలకు 15 సీట్లు వైసీపీ గెలుచుకుంది. అందంతా కార్యకర్తల బలంతోనే అని అంటున్నారు. ఇక 2014లో వైసీపీ సార్వత్రిక ఎన్నికల సమరంలోకి దూకిది. అపుడు ఏకంగా 67 సీట్లు గెలుచుకున్నారు. అది కూడా కార్యకర్తల వ్యవస్థతోనే అని గుర్తు చేస్తున్నారు.
ఇక 2019లో అయితే కార్యకర్తల వ్యవస్థతో ఏకంగా 151 సీట్లను వైసీపీ కైవశం చేసుకుని కనీ వినీ ఎరుగని తీరున రికార్డు మోత మోగించింది. అయితే గత అయిదేళ్లుగా వాలంటీర్లను చూసుకుని కార్యకర్తలను ఏ మాత్రం పట్టించుకోలేదు. దాంతో పాటు వారిని పూర్తిగా గాలికి వదిలేసారు. వాలంటీర్ల వ్యవస్థను నమ్ముకున్నారు. దాంతో ఎన్నికలకు పోతే జస్ట్ 11 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే వచ్చాయి.
దీనిని సోషల్ మీడియాలో సొంత పార్టీ వారో లేక వైసీపీ అభిమానులో లేక న్యూట్రల్ గా రాజకీయాలను గమనించేవారో పోస్టు గా పెడుతున్నారు. వాలాంటీర్లను నమ్ముకుని సున్నా అయిన వైసీపీకి తెలిసి వచ్చేలాగానే ఈ పోస్టు ఉందని అంటున్నారు. మరి ఇకనైనా వైసీపీ అధినాయకత్వం ఈ విషయంలో ఏమైనా ఆలోచించి మార్పు చేర్పులకు దిగుతుందా అంటే చూడాల్సిందే.