Begin typing your search above and press return to search.

వీడియో... బెంగళూరు రోడ్డుపై వోల్వో బస్సు బీభత్సం!

రోడ్డు ప్రమాదాలు ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తుంటాయి.. మరెన్నో కుటుంబాలను రోడ్లపాలు చేస్తుంటాయి.

By:  Tupaki Desk   |   13 Aug 2024 10:57 AM GMT
వీడియో... బెంగళూరు రోడ్డుపై వోల్వో బస్సు బీభత్సం!
X

రోడ్డు ప్రమాదాలు ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తుంటాయి.. మరెన్నో కుటుంబాలను రోడ్లపాలు చేస్తుంటాయి. అందువల్లే వాహనదారులు చాలా జాగ్రత్తగా వాహనాలు నడపాలని.. ప్రధానంగా హెవీ వెహికల్స్ డ్రైవర్స్ మరింత అప్రమత్తంగా ఉండాల్ని నిత్యం సూచనలు వినిపిస్తూనే ఉంటాయి. అయినప్పటికీ రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతూనే ఉంటున్నాయి.

ఈ క్రమంలో తాజాగా బెంగళూరులో ఓ బస్సు రోడ్డుపై రచ్చ రచ్చ చేసింది.. బిజీ సమయంలో రోడ్డుపై పలు వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లింది. 10 సెకన్లలో రోడ్డుపై భయానక వాతావరణం సృష్టించింది. పలు వాహనాలను ధ్వంసం చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తుంది. దీనిపై ట్రాఫిక్ పోలీసులు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాల్సి ఉంది.

అవును.. సోమవారం ఉదయం 9:30 గంటల ప్రాంతం, వర్కింగ్ డే కావడంతో అత్యంత రద్దీగా ఉండే బెంగళూరులోని హెబ్బాల్ ఫ్లైఓవర్ సమీపంలో ఓ బస్సు భయానక వాతావరణం సృష్టించింది. బస్సు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో పలు బైక్ లు, కార్లను ఢీకొట్టింది. ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది.

బస్సులో అమర్చిన సీసీటీవీలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఆ వీడియోలో ముందు ట్రాఫిక్ ను చూసి బ్రేకులు వేయడానికి ప్రయత్నించినట్లుగా ఉంది! అయితే కొన్ని సెకన్ల వరకూ బస్సు ఆగలేదు. ఈ సమయంలో సుమారు నాలుగు కార్లు, ఐదు టూ వీలర్ లను ఢీకొట్టాడు. ఎట్టకేలకు సుమారు 10 సెకన్ల తర్వాత బస్సు నడిరోడ్డుపై ఆగింది.

ఇదే క్రమంలో... బస్సు అద్దం పగిలిపోయింది! ప్రస్తుతం ఈ ఘటనపై తదుపరి విచారణ జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. మరి ఈ వ్యవహారంపై ట్రాఫిక్ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి. బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యాయా.. లేక, డ్రైవర్ అప్రమత్తంగా లేడా అనేది తెలియాల్సి ఉంది.