Begin typing your search above and press return to search.

భర్త చనిపోయిన వేళ.. ఓటేసుందుకు క్యూలో నిలుచుంది

పుట్టెడు శోకంలో ఉన్న ఆమె.. ఓటేసే అంశాన్ని మర్చిపోలేదు. చిరుద్యోగిగా ఉన్నప్పటికీ.. ప్రజాస్వామ్యంలో ఓటుకున్న విలువను ఆమె చాటి చెప్పారు.

By:  Tupaki Desk   |   14 May 2024 5:11 AM GMT
భర్త చనిపోయిన వేళ.. ఓటేసుందుకు క్యూలో నిలుచుంది
X

డ్రాయింగ్ రూంలో కూర్చొని గంటల తరబడి రాజకీయాల గురించి మాట్లాడే ఎందరో.. తీరా పోలింగ్ సమయానికి పత్తా ఉండని వైనం చూస్తున్నాం. కానీ.. ఇప్పుడు చెప్పే ఉదంతం అందుకు భిన్నం. పుట్టెడు శోకంలోనూ ప్రజాస్వామ్యంలో ఓటు విలువను చాటి చెప్పేలా చేసిన ఈ మహిళ గురించి తెలిస్తే.. ఆమెకు నమస్కరించకుండా ఉండలేం.

పెద్ద పెద్ద చదువులు చదుకున్నోళ్లలో కొరవడే ఈ తరహా తీరు దేశంలోని అందరికి ఉంటే.. మనల్ని పాలించే వాళ్లను మనమే ఎన్నుకునేలా చేయొచ్చన్న భావన కలుగకమానదు. బాపట్ల జిల్లా కారంచేడుకు చెందిన మహిళ ఉదంతం గురించి తెలిస్తే నోట మాట రాదు. సోమవారం జరిగిన పోలింగ్ వేళలో కారంచేడుకు చచెందిన చిట్టెమ్మ గ్రామంలో వీవోఏగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె భర్త సింగయ్య (62) అనారోగ్యంతో సోమవారం మరణించారు.

పుట్టెడు శోకంలో ఉన్న ఆమె.. ఓటేసే అంశాన్ని మర్చిపోలేదు. చిరుద్యోగిగా ఉన్నప్పటికీ.. ప్రజాస్వామ్యంలో ఓటుకున్న విలువను ఆమె చాటి చెప్పారు. కారంచేడులోని 178వ పోలింగ్ కేంద్రంలో ఓటేసిన ఆమె.. ఎందరికో స్ఫూర్తివంతంగా నిలిచారు. మాటలు చెప్పటం వేరు.. చేతల్లో చేసి చూపించటం వేరన్న విషయం చిట్టెమ్మ లాంటి వారిని చూస్తే ఇట్టే అర్థం కాక మానదు. ఓటేసే విషయంలో అందరూ ఇంతటి కమిట్ మెంట్ తో ఉంటే ఎంత బాగుండు?