Begin typing your search above and press return to search.

ఓటు వేసే విషయంలో ఆ సమస్య అమెరికాలోనూ ఉంది!

ఓటింగ్ పై ఆలోచించజేసే ప్రశ్నలు సంధించారు.

By:  Tupaki Desk   |   25 Oct 2024 4:08 AM GMT
ఓటు వేసే విషయంలో ఆ సమస్య అమెరికాలోనూ ఉంది!
X

ఇటీవల కాలంలో చాలా మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడం లేదు. అయితే ఈ సమస్య భారతదేశంలోనే కాదు అమెరికాలోనూ ఉందని అంటున్నారు. ఈ సమయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా.. యువతకు విజప్తి చేశారు. ఓటింగ్ పై ఆలోచించజేసే ప్రశ్నలు సంధించారు. మాగ్జిమం ప్రొవోక్ చేసినంత పనిచేశారు!

అవును... ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనది. ప్రజలు తమ జీవితాలు, తమ కెరీర్, తమ ఫ్యూచర్, రోడ్లు, వీధులు, బడులు, ఆసుపత్రులు ఎలా ఉండాలని భావిస్తున్నారో చెప్పే విషయం! అయితే... ఓటు వేసే విషయంలో యువత ముందుకు రావడం లేదు! ప్రధానంగా పట్టణ యువత పోలింగ్ రోజును సెలవు దినంగా భావిస్తున్నారని అంటున్నారు.

ఈ నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరక్ ఒబామా స్పందించారు. ఇందులో భాగంగా... ఓటు వేసే విషయంలో యువతకు కీలక విజ్ఞప్తి చేశారు. ఓటు వేయడం అంత కష్టం కాదని అన్నారు. మీరు ఓటు వేయరు అంటే.. మీ ఫ్యూచర్ ను డిసైడ్ చేయడానికి వృద్ధుల సమూహాన్ని అనుమతించబోతున్నట్లు అర్ధమని తెలిపారు.

మీరు మీ దుస్తుల విషయంలో, మ్యూజిక్ విషయంలో అలా చేయరు కానీ... మీ భవిష్యత్తు, మీ కేరీర్ తో పాటు మీ పరిశరాలు ఎలా ఉండాలో నిర్ణయించుకోవడానికి వారిని అనుమతించబోతున్నారా? అని సూటిగా ప్రశ్నించారు. బాస్కెట్ బాల్ పోడ్ కాస్ట్ "ది యంగ్ మ్యాన్ & ది త్రీ" లో కనిపించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇదే సమయంలో... “ప్రజలు ప్రతీదానికీ ఓటు వేస్తారు.. అమెరికా ఐడల్ పైనా ఓటు వేస్తున్నారు.. అలాంటప్పుడు మన దేశానికి ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారో నిర్ణయించడానికి కూడా ఓటు వేయవచ్చు” అని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కమలా హారిస్ అభ్యర్థిత్వాన్ని ఆమోదించారు!

కాగా... చికాగో యూనివర్శిటీ తాజా జెన్ ఫార్వర్డ్ పోల్ ప్రకారం... హారిస్ కు నల్లజాతి అమెరికన్ల నుంచి బలమైన మద్దతు ఉంది. ఇందులో భాగంగా... ప్రతీ 10 మందిలో ఆరుగురు ఆమెకు మద్దతు ఇస్తున్నారు. వాస్తవానికి ఇది తక్కువే అని అంటున్నారు. నాలుగేళ్ల క్రితం బైడెన్ కు 10 మందిలో ఏడుగురు నల్లజతీయులు మద్దతు ఇచ్చారు!