జూన్ 2 సమీపిస్తున్న వేళ జగన్, బాబు, పవన్ లకు మాజీ జేడీ రిక్వస్ట్!
ప్రస్తుతం ఆంధ్ర - తెలంగాణ రాష్ట్రాలకు హైదరాబాద్ అనేది ఉమ్మడి రాజధాని అనే సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 31 May 2024 7:03 AM GMTప్రస్తుతం ఆంధ్ర - తెలంగాణ రాష్ట్రాలకు హైదరాబాద్ అనేది ఉమ్మడి రాజధాని అనే సంగతి తెలిసిందే. అయితే జూన్ 2తో ఈ విషయం పరిసమాప్తమవ్వబోతోంది. జూన్ 2 నుంచి హైదరాబాద్ కేవలం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే రాజధానిగా ఉండబోతుంది! అయితే ప్రస్తుతానికి ఏపీకి రాజధాని లేని నేపథ్యంలో... ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది.
ఏపీకి ఇంకా శాస్వత రాజధాని లేనందువల్ల హైదరాబాద్ ని మరికొన్నేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా పొడిగించాలని ఇటీవల వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రస్థావించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో మరోసారి ఉమ్మడి రాజధాని చర్చ తెరపైకి వచ్చింది. ఇదే సమయంలో... తాజాగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇదే విషయం మరోసారి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.
అవును... మరో 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాల్సిన అవసరం ఉందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. 2014 జూన్ 2వ తేదీన చోటు చేసుకున్న ఏపీ విభజన తర్వాత ఈ 10 సంవత్సరాల వ్యవధిలో రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా పోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే మరో 10 ఏళ్ల హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఈ క్రమంలో మరోసారి తాజాగా ఎక్స్ వేదికగా స్పందించారు మాజీ జేడీ. ఇందులో భాగంగా... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను మరికొన్నేళ్లు పొడిగించాలనే డిమాండ్ చేయాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కోరారు. ఈ అంశాన్ని ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలూ లేవనెత్తాలని కోరారు.
ఇదే సమయంలో... ఏపీలో పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 5 ప్రకారం ఉమ్మడి రాజధాని పొడిగింపుకు అవకాశం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా... ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిళను ఎక్స్ లో ట్యాగ్ చేస్తూ ఆయన ట్వీట్ చేశారు.