వీవీ గారి మేనిఫెస్టో.. 'హోదా'ను వదల్లేదుగా!
ప్రస్తుతం శ్రీకాకుళంలో పర్యటిస్తున్న ఆయన వచ్చే ఎన్నికలకు సంబంధించి 'మేనిఫెస్టో' విడుదల చేశారు.
By: Tupaki Desk | 28 Feb 2024 3:50 PM GMTసీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ సొంత పార్టీ 'జై భారత్ నేషనల్ పార్టీ'ని స్థాపించిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికలకు సంబంధించి ఆయన పూర్తిగా ప్రిపేర్ అవుతున్నారు. ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పిన ఆయన.. తాజాగా మేనిఫెస్టో విడుదల చేశారు. ఇది రాష్ట్రంలో ఇప్పటి వరకు విడుదలైన తొలి మేనిఫెస్టో కావడం గమనార్హం. దీనిలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రత్యేకంగా చేర్చడం గమనార్హం. ఇక, తాను వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు.
తనకు ఎంపీగానే పోటీ చేయాలని ఉందని, పార్టీలో మాత్రం అసెంబ్లీకి వెళ్లాలని పలువురు కోరుతున్నట్టు లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రస్తుతం శ్రీకాకుళంలో పర్యటిస్తున్న ఆయన వచ్చే ఎన్నికలకు సంబంధిం చి 'మేనిఫెస్టో' విడుదల చేశారు. వైసీపీ తమ స్వప్రయోజనాల కోసం ఏపీని కేంద్రం వద్ద తాకట్టు పెట్టింద ని లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఎంపీలను గెలిపించినా రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలను సాధిం చుకోవడంలో జగన్ విఫలమయ్యారని విమర్శించారు.
+ అప్పు అవినీతి, డ్రగ్స్, రౌడీయిజం, ప్రకృతి విధ్వంసం లేని ఆంధ్రప్రదేశ్ సాధన
+ గత పాలకులు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని.. హోదా తెస్తామని మోసం చేశారు. ఈ నేపథ్యంలో తాము ప్రత్యేక హోదాను తీసుకువస్తాం.
+ ఏపీలో అన్ని స్థానాల్లో పోటీ చేయనున్నట్లు లక్ష్మీనారాయణ వెల్లడించారు.
+ రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వడంపై ఎలాంటి నిషేధం లేదు. ఈ విషయాన్ని 15 వ ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎన్‌కే.సింగ్ చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనే ప్రధాన ఎజెండా.
+ ఉచితాలకు వ్యతిరేకం.
+ అవసరమైన వారికి ఆర్థికసాయం చేస్తాం.
+ రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సకాలంలో తక్కువ ధరలకుఅందేలా చూస్తాంజ
+ జాబ్ క్యాలండర్‌ను సకాలంలో ప్రకటిస్తాం.
+ నిరుద్యోగాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తాం.
+ పాఠశాలల్లో మాతృభాషకు ప్రాధాన్యం ఇస్తాం. వాటిని అభివృద్ది చేస్తాం.