Begin typing your search above and press return to search.

పేలుళ్ల వేళ ఆ దేశంలోని విమానాల్లో వాకీటాకీలపై బ్యాన్

తాజాగా బ్యాన్ నిర్ణయాన్ని తీసుకుంది. వరుస దాడులతో వణుకుతున్న లెబనాన్.. ఇకపై విమానాల్లో ప్రయాణించే వారు ఎట్టి పరిస్థితుల్లో పేజర్లు.. వాకీటాకీలు తీసేకెళ్లేందుకు అనుమతి లేదని తేల్చేసింది.

By:  Tupaki Desk   |   20 Sep 2024 3:53 AM GMT
పేలుళ్ల వేళ ఆ దేశంలోని విమానాల్లో వాకీటాకీలపై బ్యాన్
X

అనూహ్య రీతిలో జరుగుతున్న దాడుల నేపథ్యంలో లెబనాన్ రాజధాని బీరూట్ నుంచి టేకాఫ్ అయ్యే విమానాల్లో పేజర్లు.. వాకీటాకీలను బ్యాన్ చేస్తూ అక్కడి అధికారులు నిషేధం విధించారు. ఒకేసారి సిరియాలోనూ.. లెబనాన్ లోనూ వందలాది పేజర్లు.. వాకీటాకీలు పేలిన వైనంతో ఉలిక్కిపడిన ఆ దేశం.. తాజాగా బ్యాన్ నిర్ణయాన్ని తీసుకుంది. వరుస దాడులతో వణుకుతున్న లెబనాన్.. ఇకపై విమానాల్లో ప్రయాణించే వారు ఎట్టి పరిస్థితుల్లో పేజర్లు.. వాకీటాకీలు తీసేకెళ్లేందుకు అనుమతి లేదని తేల్చేసింది.

ఎయిర్ పోర్టుకు వచ్చే ప్రతివారిని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే లోపలకు అనుమతిస్తున్నారు. తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు ప్రయాణికులు పేజర్లు.. వాకీటాకీలను అనుమతించకూడదని డిసైడ్ అయ్యారు. రెండు.. మూడు రోజుల క్రితం పశ్చిమాసియాలోని లెబనాన్ తో పాటు సిరియాలో వేలాది పేజర్లు పేలిపోవటం.. ఈ ఉదంతంలో మూడు వేలకు పైనే గాయాల బారిన పడుటం.. పలువురు మరణించటం (30 మంది వరకు) తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఆందోళనలు సాగుతున్నాయి.

ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో అన్న ఆందోళన ఎక్కువ అవుతోంది. ఇప్పటివరకు ఈ పేలుళ్ల వెనుక ఉన్నది ఇజ్రాయెల్ నిఘా విభాగంగా లెబనాన్ ఆరోపిస్తోంది. ఇజ్రాయెల్ ఆయుధ స్థావరాలపై దాడులు మొదలెట్టిన హెజ్ బొల్లా కారణంగా పశ్చిమసియాలో ఉద్రిక్తలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇప్పటికే అశాంతితో రగిలిపోతున్న ఆ ప్రాంతం మరోసారి హింసకు తెర తీసినట్లైంది.

హెజ్ బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా టీవీల్లో ప్రసంగించిన వేళలో లెబనాన్ లోని సంస్థ స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులతో విరుచుకుపడింది. హెజ్ బొల్లా ఉగ్ర కార్యకలాపాలను నాశనం చేయటమే తమ లక్ష్యంగా పేర్కొంది. దశాబ్దాలుగా పౌరుల ఇళ్లను ఆయుధాలతో నింపి.. వాటి కింద సొరంగాలు తవ్వినట్లుగా ఆరోపించిన ఇజ్రాయెల్.. పౌరులను మానవ కవచాలుగా వాడే తీరును తప్పు పట్టింది.

మరోవైపు ఇజ్రాయెల్ తీరుపై హెజ్ బొల్లా చీఫ్ నిప్పులు చెరిగారు. పేజర్లు.. వాకీటాకీల పేలుళ్లను తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్లుగా పేర్కొన్న ఆయన.. దాదాపు 4వేల పేజర్లను లక్ష్యంగా పెట్టుకొని నాలుగు వేల మంది ప్రాణాలు తీసేందుకు ప్లాన్ చేసినట్లుగా ఆరోపించారు. ఈ దాడుల వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందన్న ఆరోపణల్ని టీవీ ప్రసంగంలో చేస్తున్న వేళ.. లెబనాన్ రాజధాని బీరుట్ లో తక్కువ ఎత్తులో యుద్ధ విమానాలు దూసుకెళ్లటం ద్వారా అక్కడి పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి,