చెల్లని ఎగ్జిట్ పోల్ .. బెంగాల్ 'దీదీ'దే
బీజేపీ కేవలం 11 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఒక స్థానానికి పరిమితం అయింది.
By: Tupaki Desk | 4 Jun 2024 1:54 PM GMTపశ్చిమ బెంగాల్‌లో ఎగ్జిట్ పోల్స్ తలకిందులు అయ్యాయి. బెంగాల్ ప్రజలు మమతా బెనర్జీ నాయకత్వంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకే మద్దతు తెలిపారు. మొత్తం 42 స్థానాలు ఉన్న బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ 30 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ కేవలం 11 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఒక స్థానానికి పరిమితం అయింది.
బెంగాల్‌లో బీజేపీనే అత్యధిక స్థానాలు గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఇండియా టుడే – యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. బీజేపీ 26 -31 స్థానాల్లో గెలుస్తుందని వెల్లడైంది. టీఎంసీ 11 నుంచి 14 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని తెలిపారు.
2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ 18 స్థానాల్లో, టీఎంసీ 22 స్థానాల్లో గెలుపొందింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తలకిందులు అవుతాయని సీఎం మమతా బెనర్జీ సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఇప్పుడు అదే జరిగింది. డైమండ్ హార్బర్ నియోజకవర్గంలో మమత అల్లుడు అభిషేక్ బెనర్జీ 7.7 లక్షల మెజారిటీ ఆధిక్యంలో దేశంలో అత్యధిక మెజారిటీ దిశగా దూసుకువెళ్తున్నాడు.