Begin typing your search above and press return to search.

వారిని స‌రిగా వాడుకోలేదా... వైసీపీ అంత‌ర్మ‌థ‌నం ..!

అయినప్పటికీ వారిని పార్టీ సరిగ్గా వినియోగించుకోలేదని పెద్ద చర్చ అయితే జరుగుతుంది.

By:  Tupaki Desk   |   28 Aug 2024 12:30 AM GMT
వారిని స‌రిగా వాడుకోలేదా...  వైసీపీ అంత‌ర్మ‌థ‌నం ..!
X

వైసిపిలో ఉన్న కొంతమంది నాయకులు విషయం ఇప్పుడు చర్చకు వస్తుంది. ఎందుకంటే వైసీపీలో వేరే పార్టీల నుంచి వచ్చిన కొంతమంది నాయకులు బలమైన గ‌ళం వినిపించేవారు ఉన్నారు. సొంతంగా పార్టీలో ఉన్న వారికి క‌న్నా కూడా వారు చాలా బలమైన టార్గెట్గా మాట్లాడటంతో పాటు కౌంటర్ రాజకీయాలు చేయడంలోనూ మంచి అనుభవం ఉన్న నాయకులుగా పేరు తెచ్చుకున్నారు. ఇలాంటి వారిలో కొడాలి నాని, వంశీ, రోజా, కొరసాల కన్నబాబు అదేవిధంగా బొత్స సత్యనారాయణ, ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు వంటి అనేకమంది నాయకులు ఉన్నారు.

అయినప్పటికీ వారిని పార్టీ సరిగ్గా వినియోగించుకోలేదని పెద్ద చర్చ అయితే జరుగుతుంది. కొంత మంది నాయకులను కేవలం తిట్టడం కోసం మరి కొంతమంది నాయకులు సైలెంట్ గా ఉంచడం కోసం వాడుకున్నారని దీనివల్ల పార్టీకి భారీ డామేజ్ జరిగిందని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొడాలి నానీని తీసుకుంటే ఆయనకు భారీ చదువు లేకపోయినా బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న‌ కారణంగా సబ్జెక్టు కూడా ఉంది. దీంతో ఆయనను సరిగ్గా నియోగించుకుని ఉండుంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్టివంటి వాటిపై బలమైన కౌంటర్ ఇచ్చి ఉండే వారు.

ఇది పార్టీకి మేలు చేసి ఉండేదని కొంతమంది సీనియర్లు చెబుతున్నారు. కానీ కొడాలి నానిని కేవలం బూతులు తిట్టడానికి మాత్రమే వాడుకున్నారు అనేది వారు చేస్తున్న విమర్శ. ఇక మాజీ మంత్రి రోజా విషయాన్ని తీసుకుంటే ఆమెను కూడా సరిగ్గా పార్టీ కోసం వినియోగించలేదు అనేది తెలుస్తోంది. కేవలం చంద్రబాబును లోకేష్ ను తిట్టడానికి మాత్రమే ఆమెను వాడుకున్నారని.. స్క్రిప్ట్ ఇచ్చి చదివించారనేది ఇప్పుడు చేస్తున్న విమర్శ. నిజానికి అలా కాకుండా పార్టీ తరఫున వాయిసు వినిపించమని ఆదేశించి ఉంటే అది వేరేగా ఉండేదని చెబుతున్నారు.

అలాగే బొత్స‌ సత్యనారాయణకు ఫ్రీడం ఇవ్వకపోవడంతోనే ఉత్తరాంధ్రలో పార్టీ దెబ్బతినిందనేది ఒక వాదన. కొరసాల కన్నబాబు కొన్నాళ్లు పాటు మంత్రిగా ఉంచినప్పటికీ ఆ తర్వాత ఆయన తొలగించడం ఆయనకు కూడా బలమైన వాయిస్ వినిపించే అవకాశం లేకుండా చేయటంతో పార్టీ కాపు సామాజిక ఓట్ల‌ను గెలుచుకోలేకపోయింది. ఇక‌, ఏమాత్రం రాజకీయ నేపథ్యం లేనటువంటి అప్పటి ఎంపీ నందిగం సురేష్, గోరంట్ల మాధవ్‌ వంటి వారికి బలమైన వాయిస్ వినిపించే అవకాశం ఇవ్వడం వల్ల వారు ఇష్టమొచ్చినట్టు మాట్లాడి పార్టీని దెబ్బతీశారు. ఇదే ఇప్పుడు చ‌ర్చ‌గా మారింది. మ‌రి ఇప్ప‌టికైనా బ‌ల‌మైన వారికి అవ‌కాశం ఇస్తారో లేదో చూడాలి.