Begin typing your search above and press return to search.

పార్టీని నడపడం కష్టమేనా...వైసీపీలో ఏం జరుగుతోంది ?

మరి వైసీపీకి చూస్తే టీడీపీకి రెట్టింపు సవాల్ గానే చూడాలని అంటున్నారు. మొత్తం

By:  Tupaki Desk   |   31 Aug 2024 11:30 PM GMT
పార్టీని నడపడం కష్టమేనా...వైసీపీలో ఏం జరుగుతోంది ?
X

పార్టీని నడపడం అంటే కష్టమైన వ్యవహారమే. అసలు రాజకీయమే ఒక బ్రహ్మ పదార్ధం. ఎవరికీ అర్ధం కాని విషయం. పాత రోజులలో బాగుంది అనుకుంటే ఆనాటి కాలానికి అది రాజకీయం. ఈనాటి తీరుకు ఇదే అసలైన రాజకీయం. అన్న ఎన్టీఆర్ ఎంతో పవిత్ర ఆశయంతో పార్టీని పెట్టి తొమ్మిది నెలలు తిరగకుండా అధికారంలోకి వస్తే ఆయనను ఏణ్ణర్ధ కాలంలో వెన్నుపోటు పొడిచి కూలదోసింది ఇదే రాజకీయం.

అయితే ఆనాడు ప్రజా చైతన్యం గట్టిగా ఉండడంతో పాటు ఎమ్మెల్యేలను కట్టడి చేయడంలో టీడీపీ వ్యూహం సక్సెస్ కావడంతో ఎన్టీఆర్ 1984లో తిరిగి పదవిని దక్కించుకో గలిగారు. అదే ఎన్టీఆర్ 1995లో రెండోసారి వెన్నుపోటుకు గురి అయితే మాత్రం పదవి దక్కలేదు సరిగ్గా పదకొండేళ్ళ తరువాత మలి విడత పోరాటంలో ఎన్టీఆర్ కి జనం మద్దతు దక్కలేదు. అంటే ప్రజలలో అప్పటికే మార్పు వచ్చింది.

ఇక రాజకీయ జనంలోనూ ఎంతో చేంజ్ వచ్చేసింది. అలా చూసుకుంటే నాటి నుంచి నేటి దాకా వెన్నుపోట్లూ ఫిరాయింపులూ అంతకంతకు పెరిగిపోతున్నాయి తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు. సమాజంలో నైతిక విలువలు తగ్గుతున్నాయి. జనాలు కూడా ఫిరాయింపుల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. దాంతో ఇది ఒక పొలిటికల్ స్ట్రాటజీ గా మారిపోయింది. నిజంగా 1995లో ఎన్టీఆర్ మళ్లీ పోరాడి అధికారం తెచ్చుకున్నా ఆయనను మూడోసారి కూడా వెన్నుపోటు పొడిచి పడదోసే రాజకీయం పక్కనే తప్పకుండా ఉంటుంది.

రాజకీయం అంటేనే చాణక్య వ్యూహాలు అమలు చేయాలి. అందులో వెన్నుపోట్లు అన్నవి మొదటి పేజీలోనే ఉంటాయి. సో రాజకీయం చేయడం పార్టీలను పెట్టి నిలదొక్కుకోవడం బహు కష్టం. ఈ విషయం మీద ఒక అవగాహన ఉనన్ వారు కనుకనే పార్టీ ఓడగానే ప్రజారాజ్యం ని కాంగ్రెస్ లో విలీనం చేసి గౌరవనీయమైన రాజకీయాన్ని చేసి చాలు అనుకున్నారు చిరంజీవి. ఇక పవన్ కళ్యాణ్ అయితే విపక్షంలో ఒంటరిగా రాజకీయం చేయడం కంటే కూటమి కట్టి మెల్లగా ఎదగడమే బెటర్ అని రెండవ మార్గం ఎంచుకున్నారు.

వైసీపీ తీరు అలా కాదు, ఆ పార్టీకి ఒకనాడు ఉన్న పాజిటివిటీ ఇపుడు లేదు, ఎందుకంటే అధికారంలో అయిదేళ్ల పాటు ఉంది. ఆ పార్టీని చూసేసిన సినిమాగా జనాలు భావిస్తున్నారు. ఇపుడే వైసీపీకి అసలైన రాజకీయ పరీక్షలు ఎదురవుతున్నాయి. జగన్ నుంచి చాలా మంది జారిపోతున్నారు. అధికారం ఎక్కడ ఉంటే అక్కడకు నేతలు పరుగులు తీయడం సహజమే కానీ మరీ పచ్చిగా ఉండగానే ఫలితాలు వచ్చి వంద రోజులు గడవకుండానే ఏమి కొంప మునిగింది అని వెళ్తున్నారు అంటే ఎవరి అవకాశాలు వారివి అని సరిపుచ్చుకోవాల్సిందే.

దీని మీదనే వైసీపీలో మధనం సాగుతోంది. ఆ పార్టీ ముఖ్య నేతలు కూడా దీని మీదనే చర్చించుకుంటున్నారు. ఇక పార్టీ మారబోతున్నారు అని కామెంట్స్ వచ్చిన వారిలో ఒకరిగా ఉన్న ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అయితే తాను పార్టీ మారేది లేదని ఖండితంగా చెప్పేసారు. అదే సమయంలో వర్తమాన రాజకీయాల మీద కూడా ఆయన తనదైన శైలిలో స్పందించారు.

రాజకీయాల్లో ఉన్న వారు వ్యక్తిగత అజెండాలు సెల్ఫిష్ నెస్ తగ్గించుకోవాలని అన్నారు. రాజకీయం ఒక బాధ్యత అని చెప్పారు. ఈ రోజులలో రాజకీయాల్లోకి వస్తున్న వారు అంతా ఎక్కువ కోరికలతో ఉన్నారని దాంతో పార్టీలను నడపడం కష్టం అవుతోందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. రాజకీయ పార్టీలలో నాయకులు క్యాడర్ ని అంతా ఒక తాటిపై ఉంచడం అంటే బిగ్ టాస్క్ గా మారుతోంది అని కీలక వ్యాఖ్యలు చేశారు

దీనిని బట్టి చూస్తే కనుక ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అందరి కోరికలూ తీర్చలేదు. అదే అధికారంలో ఉంటే ఇవాళ కాకపోతే రేపు అన్న ఆశ ఉంటుంది. ప్రతిపక్షంలో అలాంటివి ఉండవు కాబట్టే ఈ జంపింగులు అని భావించవచ్చు.

అదే సమయంలో పార్టీని నడపడం కష్టం అన్నది ఆళ్ల లాంటి వారి కామెంట్స్ చూస్తే టీడీపీకే 2019 నుంచి 2024 మధ్యలో అది అతి పెద్ద చాలెంజిగా మారిపోయింది. మరి వైసీపీకి చూస్తే టీడీపీకి రెట్టింపు సవాల్ గానే చూడాలని అంటున్నారు. మొత్తం మీద వైసీపీలో కూడా ముఖ్య నేతల మధ్య ఇదే తీరున చర్చ సాగుతోంది అని అంటున్నారు వైసీపీని నడపడం ఎలా అన్నది జగన్ ఆలోచనలను బట్టే ఆధారపడి ఉంటుంది అన్నది వాస్తవం.