Begin typing your search above and press return to search.

"పొమ్మనలేక పొగ"... కార్పొరేట్ రంగంలో ఏమిటీ కొత్త ట్రెండ్?

అయితే.. ఇప్పుడు ఆ హెచ్చరికలు నిజమవుతున్నాయని అంటున్నారు. ఈ సమయంలో ప్రస్తుతం కార్పొరేట్ ప్రపంచమంతా అవలంబిస్తోన్న విధానమే ఈ సైలంట్ ఫైరింగ్!

By:  Tupaki Desk   |   30 Oct 2024 1:30 PM GMT
పొమ్మనలేక పొగ...  కార్పొరేట్  రంగంలో ఏమిటీ కొత్త ట్రెండ్?
X

కార్పొరేట్ రంగంలో ఎప్పటికప్పుడు కొన్ని కొత కొత్త పదాలు పుట్టుకొస్తుంటాయనే సంగతి తెలిసిందే. అనంతరం ఇవి సోషల్ మీడియా వేదికగా ట్రెండింగ్ లో చేరి, వైరల్ గా మారుతుంటాయి. మూన్ లైంటింగ్, క్వైట్ క్విట్టింగ్ వంటివి ఈ కోవలోకి వచ్చేవే. ఈ సమయంలో తాజాగా "సైలెంట్ ఫైరింగ్" అనే పదం ఒకటి ఇప్పుడు హల్ చల్ చేస్తోంది.

అవును... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వస్తే చాలా రంగాల్లో ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే హెచ్చరికలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఆ హెచ్చరికలు నిజమవుతున్నాయని అంటున్నారు. ఈ సమయంలో ప్రస్తుతం కార్పొరేట్ ప్రపంచమంతా అవలంబిస్తోన్న విధానమే ఈ సైలంట్ ఫైరింగ్!

ఒక్క మాటలో చెప్పాలంటే... పొమ్మనలేక పొగబెట్టడాన్నే సైలంట్ ఫైరింగ్ అంటారు. కంపెనీలు ఉద్యోగులకు తమ విధులను కష్టతరం చేసి, వారంత వారే జాబ్ కి రిజై న్ చేసేలా చేయడమే ఈ సైలంట్ ఫైరింగ్ అసలు ఉద్దేశ్యం అన్నమాట. అలా సదరు ఉద్యోగులు జాబ్ కి రిజైన్ చేసిన తర్వాత.. వారి స్థానంలో ఏఐని భర్తీ చేయాలనేది యాజమాన్యాల ఆలోచన అట!

మరోవైపు ఏఐ తమ ఉద్యోగాలను ఎక్కడ భారీ చేసేస్తుందో అనే ఆందోళనతో చాలా మంది పనిపై కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నారని.. సుమారు 10 మందిలో ముగ్గురు ఉద్యోగులు ఈ ఆందోళనల కారణంగా పనిలో నిమగ్నం కావడం లేదని అంటున్నారు. ఈ విధయంగా ఏఐ ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ పలువురు ఉద్యోగుల జీవితాల్లో నిప్పు పెట్టేస్తోందని తెలుస్తోంది!