Begin typing your search above and press return to search.

జగన్ అండ్ కో ని జైలు పంపే ముహూర్తం ?

అవులపల్లి ప్రాజెక్ట్ లో పెద్దిరెడ్డి ఆరు వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు అని ఆయన విమర్శించారు.

By:  Tupaki Desk   |   16 Jun 2024 3:15 AM GMT
జగన్ అండ్  కో ని జైలు పంపే ముహూర్తం ?
X

ఏపీలో ప్రభుత్వం మారింది. అంటే అధికారం చేతులు మారింది. మిగిలీంది అంతా సేం టూ సేం అన్నట్లుగానే కొత్త ప్రభుత్వం తొలి అడుగులు పడుతున్నాయని అంటున్నారు. తాజాగా జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద హాట్ కామెంట్స్ చేశారు. అవులపల్లి ప్రాజెక్ట్ లో పెద్దిరెడ్డి ఆరు వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు అని ఆయన విమర్శించారు.

ఇది ఒక్క ఉదాహరణ మాత్రమేనని మిగిలిన ఇరిగేషన్ ప్రాజెక్టులలో అవినీతి జరిగిందా లేదా అని పూర్తిగా అధ్యాయం చేస్తున్నామని ఆయన చెబుతున్నారు. జల వనరుల శాఖను అవినీతిమయం చేశారు వైసీపీ మంత్రులు అని ఆయన నిందించారు. దీనిని బట్టి చూస్తే తొందరలోనే వీటి మీద విచారణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక విద్యా శాఖలో అవినీతి అని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విషయంలో ఇప్పటికే ఏసీబీఎకి టీడీపీ నేత వర్ల రామయ్య బృందం ఫిర్యాదు చేసింది. టీచర్ల బదిలీలలో కోట్ల సొమ్ము చేతులు మారింది అన్నది ప్రధాన అభియోగంగా ఉంది. అంతే కాదు విద్యా రంగంలో గత అయిదేళ్ళుగా సాగిన అవకతవకల మీద విచారణ చేయాలని చూస్తున్నారు.

గనుల శాఖతో పాటు అటవీ శాఖ, ఎక్సైజ్ శాఖ ఇలా కీలక శాఖలలో జరిగిన అవినీతి మీద విచారణకు కొత్త ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇక జగన్ ని కేంద్రంగా చేసుకుని కూడా విచారణలు చేయాలని ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. లిక్కర్ స్కాం విషయంలో జగన్ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డిల పాత్రల మీద సమగ్ర దర్యాప్తు చేయాలని కొత్త ప్రభుత్వం చూస్తోంది అని అంటున్నారు.

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కంటే ఏపీలోనే పదింతలు స్కాం జరిగింది అని చాలా సార్లు టీడీపీ నేతలు ఆరోపించిన సంగతి విధితమే. ఏపీలో మద్యం స్కాం మీద ఈడీ సీబీఐలతో విచారణ జరిపించాలని ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరి కేంద్రాన్ని ఆ మధ్య కోరిన నేపధ్యం కూడా ఉంది.

ఈ క్రమంలోనే మద్యం కుంభకోణం అంటూ ఎక్సైజ్ శాఖకు చెందిన ఉన్నతాధికారి వాసుదేవరెడ్డి మీద కేసు నమోదు చేసిన ప్రభుత్వం మరింత లోతులకు వెళ్ళేలా ఉంది అని అంటున్నారు. ఆయన ఇంట్లో ఫైళ్లను కూడా సోదా చేసి చాలా వాటిని స్వాధీనపరచుకున్నారు.

ఇక వీటితో పాటు వైసీపీ మొత్తం అయిదేళ్ల పాలన అవినీతిమయం అయింది అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దాంతో అన్ని శాఖల మీద అధ్యాయం చేయడం అవినీతిని వెలికి తీసి మాజీ మంత్రుల మీద చర్యలకు దిగడం వంటివి చేయడానికి చూస్తున్నారు అని అంటున్నారు. మరో వైపు చూస్తే జగన్ సహా కీలక నేతలకు అరెస్టులు తప్పకపోవచ్చు అని అంటున్నారు.

అయితే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారు అరెస్టులు చేసి జైలుకు పంపితే ఆయా నేతలకు సానుభూతి వచ్చి రాజకీయ లాభం వారికే కలుగుతుందని చెబుతూ వస్తున్నారు. అందుకే కొత్త ప్రభుత్వం ఆ విధంగా చేయకుండా తొలి రోజులలోనే అరెస్టులు చేసి జైలుకు పంపిస్తే ఎన్నికల వేళకు జనాలు కూడా ఈ విషయం మరచిపోతారు అపుడు సానుభూతి కూడా రాదు అని భావిస్తోందిట.

అందుకే తొలి ఆరు నెలలలోనే ఈ తరహా కేసులలో అవినీతిని వెలికి తీసి జగన్ అండ్ కో లకు జైలు దారి చూపించాలని అధికార పార్టీలో దూకుడు కనిపిస్తోంది అని అంటున్నారు. మరి చూడాలి ఏమి జరుగుతుందో. అవినీతి చేసిన వారి మీద చర్యలు ఉండాల్సిందే. అదే సమయంలో కక్ష పూరిత చర్యలను జనాలు హర్షించరు అని గతంలోనే రుజువు అయింది. మరి ఏ విధంగా వైసీపీ నేతల విషయంలో యాక్షన్ ఉంటుందో చూడాల్సి ఉంది.