Begin typing your search above and press return to search.

ఈ స్థాయిలో ఆస్తులేమిటి కింగ్ రామా - X?

అవును... కింగ్ రామా - 10 గా పిలిచే థాయిలాండ్‌ రాజు మహా వచిరలాంగ్‌ కాన్‌ ఆస్తుల చిట్టా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

By:  Tupaki Desk   |   9 Jan 2024 5:30 PM GMT
ఈ స్థాయిలో ఆస్తులేమిటి కింగ్  రామా - X?
X

ప్రపంచంలోని కుబేరులందు ఈ కుబేరుడు వేరయా అన్నట్లుగా ఒక పేరు బలంగా వినిపిస్తుంటుంది. రాచరికం అనే పదాలు పోతున్న దశలో సైతం... దర్పాన్ని ఇప్పటికీ తనదైన శైలిలో ప్రదర్శిస్తూ, లగ్జరీ లైఫ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా జీవిస్తున్నాడు థాయిలాండ్‌ రాజు మహా వచిరలాంగ్‌ కాన్‌! కింగ్ రామా - X గా పిలిచే ఆయన ఆస్తుల వివరాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. వినగానే వామంలో అనేలా ఉన్న ఆయన ఆస్తుల చిట్టా ఇప్పుడు చూద్దాం!

అవును... కింగ్ రామా - 10 గా పిలిచే థాయిలాండ్‌ రాజు మహా వచిరలాంగ్‌ కాన్‌ ఆస్తుల చిట్టా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇందులో భాగంగా... ఆయన సంపద విలువ రూ. 3లక్షల కోట్లు పైనే అని తెలుస్తుంది. ఇక వాటి వివరాలు తెలిస్తే వామ్మో అనాల్సిందే!! వాటిలో 38 విమానాలు, వందల సంఖ్యలో లగ్జరీ కార్లు, సుమారు రూ.వంద కోట్ల విలువైన వజ్రవైడూర్యాలతోపాటు వేల ఎకరాల భూమి ఆయన సొంతం!

వివరాళ్లోకి వెళ్తే... థాయిలాండ్‌ రాజు మహా వచిరలాంగ్‌ కాన్‌ కుటుంబం సంపద విలువ సుమారు రూ. 3.2లక్షల కోట్లుగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు! ఇందులో ప్రధానంగా... దేశ వ్యాప్తంగా సుమారు 40వేల స్థిరాస్తులతో దేశంలో అతిపెద్ద భూస్వామిగా నిలిచారట. ఓవరాల్ గా చూస్తే... సుమారుగా ఈయనకున్న భూమి 16,210 ఎకరాలు! ఈ భూమిలో ప్రభుత్వ భవనాలు, మాల్స్‌, హోటళ్లు ఉంటాయి!

రాజకుటుంబానికి 21 హెలికాప్టర్లతో కలిపి బోయింగ్‌, ఎయిర్‌ బస్‌ విమానాలు కూడా ఉన్నాయట. వీటి మొత్తం సంఖ్య 38! ఇక వీటిని మెయింటైన్ చేయడానికి ఏడాదికి అయ్యే ఖర్చే సుమారు రూ.524 కోట్లు అని అంటున్నారు. ఇదే సమయంలో అత్యంత విలాసవంతమైన మెర్సిడెస్‌ బెంజ్‌, లిమజీన్‌ తో సహా 300 లగ్జరీ కార్లను ఈ కుటుంబం కలిగి ఉంది.

ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ఖరీదైన 545 క్యారెట్‌ "గోల్డెన్‌ జూబ్లీ డైమండ్‌" కూడా వీరివద్దే ఉండగా... దాని విలువ సుమారు రూ.98కోట్లు అని అంటున్నారు! ఇక వీటితోపాటు బంగారు పూత పూసిన 52 పడవలూ ఉండటం విశేషం. ఇదే ఫ్లోలో వీరి రాజభవనం కూడా భారీ స్థాయిలోనే ఉంటుంది. ఇందులో భాగంగా... 1782లో నిర్మించిన ఆ రాజభవనం సుమారు 23లక్షల అడుగుల విస్తీర్ణంలో ఉందట.

అక్కడితో అయిపోయిందనుకుంటే పొరపాటే సుమా.! వీటితోపాటుగా థాయిలాండ్‌ లోనే రెండో అతిపెద్ద బ్యాంకు సియామ్‌ కమర్షియల్‌ బ్యాంకులో 23శాతం వాటా.. దేశంలోనే అతిపెద్ద పరిశ్రమల్లో ఒకటైన సియామ్‌ సిమెంట్‌ గ్రూప్‌ లో 33.3శాతం వాటా కలిగి ఉన్నారట. ఇలా మొత్తంగా ఈ థాయిలాండ్‌ రాజు మహా వచిరలాంగ్‌ కాన్‌ కుటుంబం సంపద విలువ సుమారు రూ. 3.2లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు.