రైతుబంధు కోసం ఏ నిబంధనలు విధిస్తారో?
ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలు ఇప్పుడు సర్కారు ముందున్న అతిపెద్ద సవాలు.
By: Tupaki Desk | 27 Dec 2023 11:30 PM GMTతెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రజల్లో ఆరు గ్యారంటీల అమలుపై ఏం చేస్తారోననే అనుమానం కలుగుతోంది. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలు ఇప్పుడు సర్కారు ముందున్న అతిపెద్ద సవాలు. దీంతో దాని అమలుకు ఏం చర్యలు తీసుకుంటుందో అనే సందేహాలు అందరిలో వస్తున్నాయి.
రైతుబంధు పథకం అమలులో పాటించాల్సిన మార్గదర్శకాల కల్పనలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో రైతులు అయోమయంలో పడుతున్నారు. రైతుబంధు అమలుపై ఎలాంటి నిర్ణయాలు వెల్లడించలేదు. ఈనేపథ్యంలో రైతుబంధు గురించి ఏం చర్యలు తీసుకుంటారో తెలియడం లేదు. దీనిపై ఎలాంటి పరిమితులు విధించలేదు. బుధవారం అంబేద్కర్ సచివాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన లోగో ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డిని పలువురు ప్రశ్నించారు.
రైతుబంధు గురించి ఇంకా ఎలాంటి పరిమితులు విధించలేదు. అసెంబ్లీలో చర్చించిన తరువాత నూతన మార్గదర్శకాలు రూపొందిస్తామని ప్రకటించారు. అన్ని రాజకీయ పక్షాలతో చర్చించి తుది నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. ఈ క్రమంలో బడ్జెట్ సమావేశాల్లో దీనిపై చర్చిస్తామని పేర్కొన్నారు. అందరి ఆమోదంతోనే మంచి నిర్ణయం తీసుకుని పథకం అమలుకు శ్రీకారం చుడతామని సూచించారు.
ఆరు గ్యారంటీల్లో రైతుబంధు పథకమే ప్రధానమైనది. రైతులకు నేరుగా లబ్ధి చేకూరే పథకం కావడంతో అందరికి చొరవ కలుగుతోంది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియడం లేదు. ఎవరికి ఇస్తారు? ఎవరికి తొలగిస్తారో అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. గతంలో కేసీఆర్ ప్రభుత్వం వందల ఎకరాలు ఉన్న వారికి కూడా రైతుబంధు ఇవ్వడంతో ఇప్పుడు అలా జరగకూడదని భావిస్తోంది.
ఈనేపథ్యంలో రైతుబంధు పథకం గురించి రైతుల్లో ఆసక్తి నెలకొంది. సర్కారు ఏ రకమైన మార్గదర్శకాలు అనుసరిస్తుంది? ఎవరికి లబ్ధి చేకూరుస్తుంది అనే విషయాల మీద ఇప్పటికే శ్రద్ధగా ఉన్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఎవరికి చేటు తెస్తుంది. ఎవరికి లాభం చేకూరుస్తుందో అర్థం కావడం లేదని పలువురు రైతులు పేర్కొంటున్నారు.