అష్టదిగ్భంధంలో కాంగ్రెస్.. మోడీ ఏం చేయాలనుకున్నారు?
అందునా బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో కూడా ఎన్నడూ ఇలా జరగలేదని చెబుతున్నారు.
By: Tupaki Desk | 12 April 2024 2:30 AM GMTప్రత్యర్థిని నిలువరించడం అనేది రాజకీయాల్లో కామనే. అసలు రాజకీయం అంటేనే అప్రతిహత ఏలుబ డికి ప్రత్యర్థుల అడ్డంకి లేకుండా చూసుకోవడమే! దీనిని అందరూ పాటిస్తారు. అయితే.. ఇప్పుడు దేశవ్యా ప్తంగా కాంగ్రెస్‌ను అణిచి వేస్తున్నారన్న స్తాయిలో గతంలో ఎప్పుడూ జరగలేదన్నది ప్రజాస్వామ్య వాదుల మాట. అందునా బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో కూడా ఎన్నడూ ఇలా జరగలేదని చెబుతున్నా రు. ప్రస్తుతం కాంగ్రెస్ అష్ట దిగ్బంధం అయిపోయింది.
కేసులు ఏవైనా కావొచ్చు.. పార్టీ పరిస్థితిని గమనిస్తే.. ఊపిరి పీల్చుకోవడమే అత్యంత కష్టంగా ఉంది. కీల కమైన ఎన్నికల సమయంలో బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. పన్నులు ఎగవేశారన్న కేసులో సుమారు 130 కోట్ల రూపాయలను ఐటీ స్వాధీనం చేసుకుంది. అయినా.. మరో 100 కోట్లు బకాయి ఉన్నారని కోర్టులో కేసు వేసింది. అస్సాంలో నిర్వహించిన భారత జోడో యాత్రలో పోలీసులపై రాహుల్ తిరగబడ్డారంటూ.. అక్కడి ప్రభుత్వం కేసులు పెట్టింది.
రాష్ట్రా ల విషయానికి వస్తే.. బలమైన కాంగ్రెస్ నేతలను లొంగ దీసుకోవడమో.. లేక.. వారిని కూడా కేసుల తో ఉక్కిరి బిక్కిరికి గురి చేయడమో చేస్తున్నారు. డీకే శివకుమార్ వంటివారు.. ఈ జాబితాలోనే ఉన్నారు. మరోవైపు.. ముఖ్య నేతలను పార్టీ మార్చేసుకుంటున్నారు. తాజాగా నేషనల్ హెరాల్డ్ కేసు మరో ఇబ్బంది గా మారిపోయింది. సుమారు 750 కోట్ల రూపాయలను ఈడీ స్వాధీనం చేసుకోవడాన్ని కోర్టు సమర్థించింది. దీంతో కాంగ్రెస్‌కు ఊపిరి ఆగిపోయినంత పనైంది.
అసలే ఎన్నికలు.. ఆపై కేసులు.. మొత్తంగా కాంగ్రెస్‌ను ప్రధాని మోడీ ఆర్థికంగా అష్ట దిగ్బంధంలో చిక్కు కునేలా చేశారనేది బీజేపీ నేతల అంతర్గత చర్చ. అయితే.. ఇలా కీలకమైన పార్టీ ఇబ్బందులకు గురి చేసిన కీలక ఎన్నికల సమయంలో విజయం దక్కించుకుందామనే వ్యూహం ఏదో ఉందనేది ప్రజాస్వామ్య వాదుల మాట. తన బలాన్ని ప్రదర్శించలేక పోయినప్పుడే.. ఇలా.. ప్రత్యర్థులను కట్టడి చేయడం.. నియంతృత్వ దేశాల్లో కనిపిస్తుంది. కానీ, మనది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఇలా చేయడంతగునా ? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.