Begin typing your search above and press return to search.

షర్మిలకు జగన్ ఏమి అన్యాయం చేశారు... సజ్జల సూటి ప్రశ్నలు!

ఇదే సమయంలో రాజకీయ విమర్శలు కాస్తా ఫ్యామిలీ మేటర్స్ లోకి టర్న్ తీసుకుంటున్నాయి.

By:  Tupaki Desk   |   25 Jan 2024 12:39 PM GMT
షర్మిలకు జగన్  ఏమి అన్యాయం చేశారు... సజ్జల సూటి ప్రశ్నలు!
X

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిళ వర్సెస్ వైసీపీ అనే ఫైట్ పీక్స్ కి చేరుకుంటుంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై షర్మిళ చేసిన విమర్శలు రోజు రోజుకీ పీక్స్ కి చేరుకుంటున్నాయి. ఇదే సమయంలో రాజకీయ విమర్శలు కాస్తా ఫ్యామిలీ మేటర్స్ లోకి టర్న్ తీసుకుంటున్నాయి. దీంతో... రెండూ మిక్సయిన విమర్శలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. దీంతో... చంద్రబాబు వదిలిన చివరి అస్త్రం షర్మిల అని.. బాబు చెప్పినట్లుగానే షర్మిల నడుచుకుంటారని.. బాబు చెప్పిన దానికి మించి ఒక్క ముక్క కూడా ఎక్కువ మాట్లాడరని అంటున్నారు సజ్జల.

అవును... ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టినప్పటిన అనంతరం మైకందుకున్న షర్మిల... జగన్ రెడ్డి అని సంభోదిస్తూ ఏపీ సీఎంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీలో అభివృద్ధే లేదని... ఎటుచూసినా మాఫియా రాజ్యమేలుతుందని అన్నారు. అనంతరం రాష్ట్రపర్యటన చేపట్టిన షర్మిల... వెళ్లిన ప్రతీచోటా బీజేపీ, వైసీపీని ఒక గాటిన కట్టి దుబ్బయడుతున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ మహా గొప్ప పార్టీ అని చెప్పుకొస్తున్నారు.

ఇందులో భాగంగా వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ఇబ్బందులూ పెట్టలేదని షర్మిల చెప్పుకొచ్చారు. దీంతో.. ఒకపుడు కాంగ్రెస్ పార్టీ తమ కుటుంబాన్ని చాలా ఇబ్బందులకు గురిచేసిందంటూ ఆమె చేసిన ఆరోపణల వీడియోలు బయటకు తీస్తున్నారు వైసీపీ నేతలు. కావాలనే చరిత్ర వక్రీకరిస్తున్నారంటూ షర్మిలపై ఫైరవుతున్నారు. ఈ సందర్భంగా మైకుల ముందుకు వచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి.. సజ్జలకు సూటి ప్రశ్నలు వేశారు.

ఇందులో భాగంగా... కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ కుటుంబాన్ని ఎంతగా వేధించిందీ షర్మిలకు తెలుసు అని చెప్పిన సజ్జల... తనకి జగన్ ఏం అన్యాయం చేశారో షర్మిళ స్పష్టంగా చెప్పాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో పదవులు అన్నీ కుటుంబానికే ఇస్తారా? అంటూ ప్రశ్నించారు. ఇదే సమయంలో... వైఎస్సార్‌టీపీ అని తెలంగాణలో పార్టీ పెట్టారు.. తర్వాత తీసేశారు.. మరి ఆ పార్టీ కోసం పని చేసినవారికి ఆమె ఏం చేశారు? అని సజ్జల సూటిగా ప్రశ్నించారు.

ఇక జగన్ విషయంలో కాంగ్రెస్ అవలంభించిన వైఖరిని గుర్తుచేసిన సజ్జల... నాడు జగన్ కోసం లక్షలాది మంది కదలి వచ్చారని గుర్తుచేసారు. ఇదే సమయంలో... నాడు వైఎస్సార్ మరణానంతరం జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర వద్దన్నందుకు కాంగ్రెస్ నుండి బయటకు వచ్చారని.. దీంతో కక్షగట్టి 16 నెలలు జైల్లో పెట్టించారని.. అవన్నీ అక్రమ కేసులని అందరికీ తెలుసని.. ఈ విషయాన్ని అప్పటి సీబీఐ అధికారి లక్ష్మీనారాయణ సైతం ఆ కేసుల్లో అవినీతి లేదని చెప్పారని సజ్జల తెలిపారు.

ఈ సందర్భంగా... అసలు వైఎస్సార్ ఆశయాలు ఏవీ అమలు చేయలేదని షర్మిల అంటున్నారంటే.. ఆ స్క్రిప్టు ఎవరి నుండి వచ్చిందో అర్థం చేసుకోవచ్చని.. షర్మిల అబద్దాలను ప్రజలు గుర్తిస్తూనే ఉన్నారని అన్నారు. ఇక జగన్‌ ని విమర్శించిన రోజే ఎల్లోమీడియా షర్మిలను భుజాన వేసుకుందని.. గతంలో ఏనాడూ ఆమె గురించి గొప్పగా రాయలేదని గుర్తు చేసిన సజ్జల... వైఎస్సార్ గురించి ఇంటర్వ్యూలో ఏబీఎన్ ఆర్కే ఇష్టానుసారం మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి మాట్లాడకపోయిన విషయం షర్మిలకు కనిపించలేదా అని ప్రశ్నించారు.

ప్రస్తుతం షర్మిల చేస్తున్న విమర్శల స్క్రిప్ట్ ఎవరిదో అర్ధమవుతూనే ఉందని చెప్పిన సజ్జల... ప్రభుత్వ వ్యతిరేక ఓటు కోసం ఓ ప్లాన్ ప్రకారం చంద్రబాబు షర్మిళను తెచ్చారని.. చంద్రబాబుకు ఎంత అవసరమో అంతే షర్మిళ మాట్లాడుతోందని.. అంతకంటే ఎక్కువ మాట్లాడితే చంద్రబాబు ఒప్పుకోడంటూ సజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు.