Begin typing your search above and press return to search.

ఓవర్ టూ బెంగళూరు : ఏపీ పాలిటిక్స్ కి అక్కడ ఇంధనం ?

ఇదిలా ఉంటే జగన్ బెంగళూరు వెళ్లడం వెనక అక్కడ తన భవిష్యత్తు రాజకీయాలకు వ్యూహరచన చేస్తున్నారు అని ప్రచారం సాగుతోంది.

By:  Tupaki Desk   |   25 Aug 2024 3:21 AM GMT
ఓవర్ టూ బెంగళూరు : ఏపీ పాలిటిక్స్ కి అక్కడ ఇంధనం ?
X

బెంగళూరు ఇపుడు ఏపీ రాజకీయాలలో కీలకంగా మారుతోంది. ఏపీలో వైసీపీ ఓటమి తరువాత వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ బెంగళూరుకు మకాం మార్చారని ప్రచారమూ ఉంది. వారంలో మూడు రోజుల పాటు జగన్ బెంగళూరులో ఉంటున్నారు. గడచిన రెండు నెలల్లో ఆయన అనేక సార్లు బెంగళూరు ట్రిప్పులు వేసారు.

ఇదిలా ఉంటే జగన్ బెంగళూరు వెళ్లడం వెనక అక్కడ తన భవిష్యత్తు రాజకీయాలకు వ్యూహరచన చేస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. అదే సమయంలో ఆయన ఇండియా కూటమిలో చేరేందుకు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలోకి కీలక నేతతో చర్చలు జరుపుతున్నారని తన సందేశాలను ఆయన ద్వారా కాంగ్రెస్ హై కమాండ్ కి పంపిస్తున్నారు అని కూడా పుకార్లు షికారు చేస్తున్న నేపధ్యం ఉంది.

ఎన్డీయే కూటమికి పోటీగా ఇండియా కూటమి జాతీయ స్థాయిలో ఉంది. ఏపీలో టీడీపీ జనసేన ఎన్డీయేలో ఉన్నాయి. దాంతో అక్కడ పొలిటికల్ స్పేస్ కానీ ప్లేస్ కానీ లేదని భావించిన జగన్ వైపు చూస్తున్నారు అని జాతీయ స్థాయిలోనూ విపరీతంగా ప్రచారం సాగుతోంది.

ఇవన్నీ ఇలా ఉంటే చంద్రబాబుకు జాతీయ స్థాయిలో అన్ని పార్టీలతోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయనకు కర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ తోనూ మంచి రిలేషన్స్ ఉన్నాయని అప్పట్లో విమానాశ్రయంలో ఇద్దరూ కలసి ఏకాంతంగా మాట్లాడుకున్న వీడియోని చూసిన వారూ చెప్పుకున్నారు. జగన్ చెల్లెలు షర్మిల ఏపీలో ఎంటరై కాంగ్రెస్ తరఫున పాలిటిక్స్ చేయడానికి పీసీసీ చీఫ్ కావడానికి కూడా టీడీపీ పెద్దల రాజకీయ మంత్రాంగం ఉంది వైసీపీ అనుమానిస్తూనే ఉంది అంటారు.

ఇక జగన్ ఇండియా కూటమిలో చేరినట్లు అయితే రాజకీయంగా బలపడతారు అన్నది కూడా ఎన్డీయే కూటమిలో ప్రత్యేకించి ఏపీ పెద్దలలో ఉంది అని అంటున్నారు. జగన్ కి అక్కడ ప్లేస్ లేకుండా చేసే వ్యూహాన్ని రచిస్తున్నారు అని కూడా ప్రచారం చేస్తున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే చంద్రబాబు శుక్రవారం గోదావరి జిల్లాలో ఒక గ్రామ సభలో పాల్గొని ఆ వెంటనే బెంగళూరుకి పయనం అయ్యారని ఆయన స్పేషల్ ఫ్లైట్ లో బెంగళూరు వెళ్ళి అక్కడ రెండున్నర గంటల పాటు గడిపారు అని వైసీపీ ఎక్స్ లో బయటపెట్టింది. చంద్రబాబు ఎందుకు బెంగళూరు వెళ్లారు అక్కడ ఎవరెవరికి కలిశారు ఈ పర్యటన ఎందుకు గోప్యంగా ఉంచారు అని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఈ టూర్ ని అధికార షెడ్యూల్ లో ఎందుకు పెట్టలేదని కూడా వైసీపీ ఎత్తి చూపుస్తోంది.

మరి చంద్రబాబు నిజంగానే బెంగళూరు వెళ్లారా వెళ్తే ఎవరిని కలిశారు అన్నది ఇపుడు రాజకీయంగా చర్చకు వచ్చే విషయం. బెంగళూరు లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి రాజకీయ చర్చలు జరపడానికి ఎన్డీయే అధికారంలో లేదు. అయితే ముందే చెప్పుకున్నట్లుగా బాబుకు కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ తోనూ పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఆయన కాంగ్రెస్ పెద్దలను కలిశారా అన్నదే వైసీపీ అనుమానంగా ఉంది.

మొత్తానికి బెంగళూరు కి జగన్ వెళ్లడం అక్కడ విడిది చేయడంతో ఏపీ పాలిటిక్స్ ఇపుడు బెంగళూరుకి టర్న్ అయింది అని అంటున్నారు. ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎం హోదాలో బెంగళూరు కి అధికార పర్యటనకు వెళ్ళారు. కుంకీ ఏనుగులను ఏపీకి అడగడం కోసం ఆయన వెళ్ళారు. మొత్తానికి ఏపీ నేతలు అంతా బెంగళూరు వెళ్తున్నారు. మరి అక్కడ ఏమి పాలిటిక్స్ చేస్తున్నారు అంటే ఏపీ ఫ్యూచర్ పాలిటిక్స్ కి బెంగళూరు ఇంధనంగా మారుతోందా అన్న చర్చ కూడా సాగుతోంది. చూడాలి మరి వైసీపీ డౌట్లకు టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుందో.