Begin typing your search above and press return to search.

ఆ 36 నియోజకవర్గాలలో షర్మిల ఫ్యాక్టర్ ఎంత...!?

ఇలా 34 సీట్లలో జెండా ఎగరేసి మొత్తం తొంబై అయిదు శాతం పైగా రిజర్వుడు సీట్లలో జెండా ఎగరేసింది.

By:  Tupaki Desk   |   25 Jan 2024 2:45 AM GMT
ఆ 36 నియోజకవర్గాలలో షర్మిల ఫ్యాక్టర్ ఎంత...!?
X

ఏపీలో మొత్తం 175 నియోజకవర్గాలు ఉంటే ఇందులో రిజర్వుడు సీట్లు 36 ఉన్నాయి. ఎస్సీ ఎస్టీలకు వీటిని కేటాయించారు. ఇందులో ఎస్టీలకు ఏడు అసెంబ్లీ సీట్లు ఉంటే ఎస్సీలకు 37 సీట్లు ఉన్నాయి. ఈ నియోజకవర్గాలలో ఎపుడూ వైసీపీదే ఆధిపత్యం. 2014లో వైసీపీ మొత్తం 36 సీట్లకు గానూ ముప్పైకి పైగా గెలుచుకుంది.

అదే 2019కి వచ్చేసరికి జనసేన ఒకటి, తెలుగుదేశం ఒకటి ఎస్సీ సీట్లు గెలుచుకుంటే మిగిలిన 27 ఎస్సీ సీట్లతో పాటు, ఏడింటికి ఏడు ఎస్టీ సీట్లు గెలుచుకుంది. ఇలా 34 సీట్లలో జెండా ఎగరేసి మొత్తం తొంబై అయిదు శాతం పైగా రిజర్వుడు సీట్లలో జెండా ఎగరేసింది.

అయితే 2024లో పరిస్థితులు అలా ఉంటాయా అంటే చూడాలి. దానికి కారణం అయిదేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం పట్ల జనాలలో సహజంగా కొంత వ్యతిరేకత ఉంటుంది. అదే విధంగా చూస్తే కనుక రిజర్వుడు సీట్లలో కూడా ఆ వ్యతిరేకత ఉండవచ్చు. అందులో వేరే భావన ఉండదు. అయితే అది ఎంత అన్నది ఒక చర్చ.

ఇదిలా ఉంటే ఏపీలో మొత్తం రిజర్వుడు సీట్లలో 70 లక్షల దాకా ఓటర్లు ఉన్నారు. ఇందులో టీడీపీకి ఇరవై లక్షల నుంచి ఆ పై దాకా ఓటు షేర్ ఉంది. అంటే యాభై లక్షలకు పైగా ఓట్ల షేర్ తో వైసీపీ ఎపుడూ బంపర్ మెజారిటీతో గెలుస్తోంది అన్న మాట.

ఇదే పరిస్థితిలో వ్యతిరేకత ప్రభుత్వం మీద ఉండడంతో టీడీపీ ఓటు బ్యాంక్ బాగా పెరుగుతుంది అని భావిస్తున్నారు. ఇపుడు కొత్తగా కాంగ్రెస్ కూడా ఈ ఓట్లలో గండి కొట్టడానికి రెడీ అవుతోంది. మామూలుగా 2014, 2019లలో మాదిరిగా అయి ఉంటే కాంగ్రెస్ నుంచి ఏ రకమైన ముప్పూ ఉండే చాన్స్ లేదు. కానీ అలా కాకుండా వైఎస్సార్ తనయ అయిన వైఎస్ షర్మిల కాంగ్రెస్ కి నాయకత్వం వహిస్తున్నారు.

ఆమె ఎక్కువగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓట్ల మీదనే గురి పెడుతున్నారు. ఆమె ప్రసంగాలు కూడా అలాగే ఉంటున్నాయి. వైఎస్ జగన్ బీజేపీతో తెర వెనక పొత్తుని కొనసాగిస్తున్నారు అని విమర్శలు చేస్తున్నారు. మణిపూర్ రాష్ట్రంలో జరిగిన సంఘటనలను జనంలో చర్చకు పెడుతున్నారు. వైసీపీ ఆ విషయంలో వైసీపీని నిలదీయలేదు అని అంటున్నారు. ఈ విషయంలో చూసుకుంటే కనుక ఒక పద్ధతి ప్రకారమే షర్మిల ఈ ఆరోపణలు చేస్తున్నారు.

దాంతో ఎంత కాదనుకున్నా బీజేపీతో వైసీపీ పొత్తు అని అంటే ఆయా వర్గాలు వైసీపీకి దూరం అవుతాయి. ఇంతకాలం వారికి ఆ విషయం తెలియనిది కాదు, కానీ ఇపుడు షర్మిల చెప్పడంతో పాటు కాంగ్రెస్ కే ఓట్లు వేసే ట్రెడిషనల్ ఓటర్లు కాంగ్రెస్ లేకపోవడం వల్ల వైసీపీ వైపు వచ్చిన వారు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయడానికి ఏ మాత్రం ఇష్టపడని వారు అంతా కూడా కాంగ్రెస్ వైపు మళ్ళితే కచ్చితంగా వైసీపీ ఓటు బ్యాంక్ లో చీలిన వస్తుందని అంటున్నారు.

వైఎస్ షర్మిల ఇదే విధంగా దూకుడు గా ఉంటూ మైనారిటీలు ఎసీ ఎస్టీల విషయంలో రాజకీయం చేస్తే కనుక కచ్చితంగా ఆయా సెక్షన్లలో ఎంతో కొంత మార్పు రాక తప్పదు. ఒక అంచనా ప్రకారం మొత్తం 36 రిజర్వుడ్ సీట్లలో షర్మిల ఫ్యాక్టర్ తో కనీసంగా పది నుంచి పదిహేను లక్షల దాకా ఓట్లు చీలిపోతాయని అంటున్నారు. అదే జరిగితే మరో వైపు టీడీపీ ఓటు బ్యాంక్ ఎస్సీ ఎస్టీ రిజర్వుడ్ సీట్లలో బాగా పెరిగితే అంతిమంగా ఇబ్బందుల్లో పడేది వైసీపీ అన్నది ఒక కఠిన విశ్లేషణ. గత ఎన్నికలో దాదాపుగా స్వీప్ చేసిన రిజర్వ్డ్ నియోజకవర్గాలలో వైసీపీకి చిల్లు పడితే అది టీడీపీకే మేలు చేస్తుంది అని అంటున్నారు.