ఎన్నికల విధుల్లో టీచర్లు.. వైసీపీ నష్టమేంటి? టీడీపీకి లాభమేంటి?
అయితే.. ఎన్నికల విధుల్లో టీచర్లను వినియోగించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
By: Tupaki Desk | 17 Jan 2024 3:00 AM GMTఏపీలో రాజకీయ పక్షాల మధ్య టీచర్ల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సమయంలో బూత్ స్థాయిలో విధులు నిర్వహించేందుకు.. ఉపాధ్యాయుల సేవలే వినియోగిం చాలని కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ఆదేశించింది. దీంతో ఏ యే జిల్లాల్లో ఎంత మంది టీచర్లు ఉన్నారు.. వారి విద్యార్హతలు.. ప్రస్తుత పని.. వంటివివరాలను విద్యాశాఖ ప్రభుత్వానికి అందించింది. ఆ వెంటనే వీటిని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. దీనిపై సీఈసీ ఒక నిర్ణయం తీసుకుంటుంది.
అయితే.. ఎన్నికల విధుల్లో టీచర్లను వినియోగించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో ఈ విధుల నుంచి వారిని తప్పిస్తూ.. వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపైనా రాజకీయ విమర్శలు వచ్చాయి. ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన సొమ్ములు ఇవ్వడం లేదని, వారి డిమాండ్లను పరిష్కరించడం లేదని.. అందుకే. . వారంతా వైసీపీ సర్కారుపై ఆగ్రహంతో ఉన్నారని.. ప్రతిపక్షాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీ వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించిందని చెబుతున్నాయి.
ఇదేసమయంలో వలంటీర్లను, లేదా సచివాలయ ఉద్యోగులను ఎన్నికల విధుల్లో నియమించేందుకు వైసీపీ ప్రయత్నించింది. దీనిని రాజకీయ పక్షాలు వ్యతిరేకించాయి. వీరంతా వైసీపీ మనుషులేనని.. వారు ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తారని.. కాబట్టివీరికి ఎన్నికల విధులు అప్పగించేందుకు వీల్లేదని తేల్చి చెబుతూ.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం.. సంఘం వెంటనే ఉపాధ్యాయులనే నియమించాలని ఆదేశించడం తెలిసిందే. అసలు ఉపాధ్యాయులతో ఇటు వైసీపీకి వచ్చే నష్టం కానీ.. అటు టీడీపీకి ఒనగూరే ప్రయోజనం కానీ ఏమీలేదని అధికారులు చెబుతున్నారు.
పోలింగ్ కేంద్రంలో కూర్చుని విధుల్లో పాల్గొనే టీచర్లు.. కేవలం ఓటర్లతో రిజిస్టర్‌లపై సంతకాలు చేయిం చుకోవడం, ఓటు వేసిన వారి వేలిపై సిరా గుర్తు వేయడం వరకే పరిమితం అవుతారు.. తప్ప పోలింగ్ బూతుల్లో కూర్చుని పార్టీ ప్రచారం అయితే.. చేయరు. చేయడానికి కూడా వీల్లేదు. ఇది ఉద్యోగానికే ప్రమాదం. సో.. టీచర్లు ఎన్నికల విధుల్లో పాల్గొన్నా.. వైసీపీకి వచ్చే నష్టం కానీ.. ప్రత్యేకంగా టీడీపీకి వచ్చే లాభం కానీ లేదు.
మరివైసీపీ ఎందుకు తొలగించింది? అనే ప్రశ్న సాధారణంగానే రెయిజ్ అవుతుంది. ఎందుకంటే.. ఉపాధ్యాయులే.. తమకు బోధనేతర పనులు అప్పగించొద్దని ఏళ్ల కిందటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల విధులు వద్దని.. అక్కడ జరిగే ఘర్షణలు.,. వివాదాలు.. అవకతవకలకు తాము సాక్షులుగా.. మారిపోలీసు కేసులు, కోర్టు కేసులుఎదుర్కొనాల్సి వస్తోందని.. ఉపాధ్యాయులే కొన్నేళ్లుగా చెబుతూ వచ్చారు.
ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించింది. అయితే.. వీరికి ప్రత్యామ్నాయంగా వ్యవస్థ లేకపోవడంతోనే కేంద్ర ఎన్నిక లసంఘం వీరిని నియమించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంతకు మించి.. దీనిలో గొప్ప విషయం ఏమీ లేదని పరిశీలకులు చెబుతున్నారు.