Begin typing your search above and press return to search.

రెండో రోజూ మార్కెట్ కు చంద్రకళ.. ఎన్నిపాయింట్లు ముందుకంటే?

చంద్రకళతో ఫలితాల వెల్లడి పక్కరోజున భారీ ర్యాలీ చోటుచేసుకుంటే.. రెండో రోజు కూడా అదే పాజిటివిటీ కంటిన్యూ అయ్యింది.

By:  Tupaki Desk   |   7 Jun 2024 4:53 AM GMT
రెండో రోజూ మార్కెట్ కు చంద్రకళ.. ఎన్నిపాయింట్లు ముందుకంటే?
X

ఎగ్జిట్ పోల్ తో ఎగిసిన అలగా స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లటం.. సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడి రోజున దారుణంగా దెబ్బ తిన్న సెంటిమెంట్ కారణంగా సెన్సెక్స్ లు పాతాళం వైపు చూసిన కారణంగా మార్కెట్ కు బ్లడ్ బాత్ అయ్యింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలం బీజేపీకి సొంతంగా లేకున్నా.. మిత్రుల సహకారంతో కేంద్రంలో కొలువు తీరే అవకాశం ఉండటం సానుకూల అంశంగా మారింది. దీనికి తోడు.. ప్రభుత్వ ఏర్పాటులో చంద్రబాబు కీగా మారిన వేళ.. ఆయన సైతం తాను ఎన్డీయేలోనే ఉంటానని.. కూటమి మారే ఆలోచన లేదన్న విషయాన్ని స్పష్టం చేయటంతో.. కేంద్రంలో మోడీ సర్కారు కొలువు తీరటం ఖాయమన్న సంకేతాలు వ్యక్తమయ్యాయి.

దీంతో దెబ్బ తిన్న మార్కెట్ సెంటిమెంట్ రికవరీ మోడ్ లోకి వెళ్లింది. చంద్రకళతో ఫలితాల వెల్లడి పక్కరోజున భారీ ర్యాలీ చోటుచేసుకుంటే.. రెండో రోజు కూడా అదే పాజిటివిటీ కంటిన్యూ అయ్యింది. దీంతో.. సెన్సెక్స్ 692 పాయింట్లు జంప్ చేస్తే.. నిఫ్టీ సైతం 201 పాయింట్లు ఎగిసింది. మొత్తంగా సెన్సెక్స్ 75,075 పాయింట్ల వద్ద.. నిఫ్టీ 22,821 పాయింట్ల వద్ద గురువారం ట్రేడింగ్ ముగిసింది.

రెండు రోజుల సానుకూల ట్రేడింగ్ పుణ్యమా అని.. ఎన్నికల ఫలితాల వెల్లడి రోజున మార్కెట్ నుంచి ఆవిరైన రూ.31 లక్షల కోట్ల మార్కెట్ విలువలో చాలావరకు రికవరీ అయినట్లుగా చెప్పాలి. గడిచిన రెండు రోజులుగా మార్కెట్ క్యాప్ రూ.21 లక్షల కోట్లకు పైగా బలపడటంతో బీఎస్ఈ మొత్తం మార్కెట్ క్యాప్ దాదాపు రూ.416 లక్షల కోట్లకు చేరుకుంది. ఫలితాల వెల్లడి రోజున దారుణంగా దెబ్బ తిన్న అదానీ షేర్లకు మంచి రోజులు వచ్చాయి.

గడిచిన రెండో రోజులుగా ఈ గ్రూప్ లో లిస్ట్ అయిన 10 కంపెనీల్లో అదానీ పోర్ట్స్ స్వల్పంగా వెనకుడు వేసింది. మిగిలిన అన్నీ స్టాక్ లు 2 శాతం నుంచి 5 శాతం మధ్య పెరిగాయి. దీంతో.. గ్రూపు మార్కెట్ విలువ రూ.17 లక్షల కోట్లను దాటింది. మొత్ంగా స్టాక్ మార్కెట్ లో మంగళవారం నాటి బ్లడ్ బాత్ మరకలు త్వరగా తొలిగిపోతున్నాయి. ఇందులో చంద్రబాబు కీలక భూమిక పోషించారని మాత్రం చెప్పక తప్పదు. ఆయన నోటి నుంచి కూటమి మారే అంశం మీద ఆలోచన చేస్తామన్న ఒక్క మాట వస్తే.. మొత్తంగా సీన్ మారిపోతుందని చెబుతున్నారు.