Begin typing your search above and press return to search.

కేసీయార్ వర్సెస్ రేవంత్ : కామారెడ్డిలో జరిగే అద్భుతం ఏమిటి...?

అంతే కాదు ఉత్తర తెలంగాణాలోని జిల్లాలు అన్నింటా పార్టీని పటిష్టం చేసుకోవడానికి కూడా కేసీయార్ రంగంలోకి దిగారు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   17 Nov 2023 12:30 AM GMT
కేసీయార్ వర్సెస్ రేవంత్ :  కామారెడ్డిలో జరిగే అద్భుతం ఏమిటి...?
X

కామారెడ్డి ఇపుడు జాతీయ స్థాయిలో చర్చను రేపుతోంది. ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి కేసీయార్ పోటీ చేస్తున్నారు. పీసీసీ చీఫ్ కాబోయే సీఎం అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి కూడా కేసీయార్ మీదకు పోటీకి దిగారు. ఈ విధంగా రాజకీయ రణ క్షేత్రంగా కామారెడ్డి మారింది.

ఇపుడు చూస్తే జాతీయ స్థాయిలో కామారెడ్డి చర్చనీయాంశం అవుతొంది. కామారెడ్డి ఉత్తర తెలంగాణాలో ఉన్నారు. ఇది బీయారెస్ కి గట్టి పట్టు ఉన్న ప్రాంతం. అయితే గత కొంతకాలంగా బీయారెస్ కి పట్టు తగ్గుతోంది. 2019లో నిజమాబాద్ ఎంపీగా పోటీ చేస్తే కవిత ఓటమి పాలు అయ్యారు. దాంతో ఈ ప్రాంతం మీద ఫుల్ ఫోకస్ పెట్టడానికే కేసీయార్ బరిలోకి దిగారు అని అంటున్నారు.

అంతే కాదు ఉత్తర తెలంగాణాలోని జిల్లాలు అన్నింటా పార్టీని పటిష్టం చేసుకోవడానికి కూడా కేసీయార్ రంగంలోకి దిగారు అని అంటున్నారు. ఇదిలా ఉంటే కర్నాటక ఎన్నికల తరువాత చూస్తే ముస్లిం మైనారిటీ వర్గాలు కాంగ్రెస్ వైపు మెల్లగా మళ్ళుతున్నారు అని అంటున్నారు. అదే విధంగా మిగిలిన వర్గాలు కూడా అధికార బీయారెస్ మీద అసంతృప్తితో ఉన్నాయని అంటున్నారు. దీంతో కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని బరిలోకి దింపింది అని అంటున్నారు.

ఉత్తర తెలంగాణాలో సీట్లను ఎక్కువగా గెలుచుకుంటే కాంగ్రెస్ కి అధికారానికి తిరుగులేదని అంటున్నారు. అందుకోసం ఇక్కడే కాంగ్రెస్ గురి పెట్టింది. ఇక చూస్తే కామారెడ్డి కాంగ్రెస్ కి కానీ బీయారెస్ కి కానీ పెను సవాల్ గానే ఉంది అని అంటున్నారు. బీయారెస్ నుంచి అధికారాన్ని తీసుకోవడం కాంగ్రెస్ కి కొంచెం కష్టమే అయినప్పటికీ ఓవరాల్ గా కాంగ్రెస్ గ్రాఫ్ పెరగడంతో అద్భుతం నమోదు చేయడానికే కాంగ్రెస్ చూస్తోంది అని అంటున్నారు.

అంటే కేసీయార్ ని ఓడించడం ద్వారా జాతీయ స్థాయిలో రికార్డు క్రియేట్ చేయడానికి రేవంత్ రెడ్డి చూస్తున్నారు. అదే విధంగా చూస్తే బీయారెస్ కి కూడా గుండెలలో గుబులు ఉంది. కేసీయార్ రెండు చోట్ల నుంచి పోటీ చేయడం మైనస్ అవుతుందా అన్న చర్చ ఉంది. ఎందుకంటే గజ్వేల్ లో ఆయన పోటీ చేస్తున్నారు. ఈ సీటు ఎటూ గంప గోవర్ధన్ కే తిరిగి ఇస్తారు అని అంటున్న వారూ ఉన్నారు

దాంతో జనంలోనూ గంప గోవర్ధన్ మీద వ్యతిరేకత ఉంది. బీయారెస్ లోనూ వ్యతిరేకత ఉంది. కేసీయార్ ఇటీవల నామినేషన్ కి వచ్చినపుడు గ్రూప్ పాలిటిక్స్ మీద గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. గంప గోవర్ధన్ కి టికెట్ ఇస్తామని ప్రామిస్ చేసిన మీదటనే కేసీయార్ బరిలోకి దిగారు అని అంటున్నారు. దాంతో ఇప్పటికి నాలుగు సార్లు గెలిచిన గంప గోవర్ధన్ వద్దు అని అంటున్న వారే బీయారెస్ లో ఉన్నారు.

ఈ అసంతృప్తిని సొమ్ము చేసుకోవడానికి కాంగ్రెస్ ఎత్తులు వేస్తోంది. మరో వైపు చూస్తే నాలుగు సార్లు నుంచి కాంగ్రెస్ గెలవడం లేదు, అదే టైం లో షబ్బీర్ అలీ వంటి భారీ ముస్లిం నేత ఆ పార్టీలో ఉన్నారు. ఆయన మద్దతు కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కి దక్కుతోంది. దాంతో కామారెడ్డిలో రోజురోజుకూ కాంగ్రెస్ ఆశలు పెరుగుతున్నాయని అంటున్నారు. దాంతో ఈసారి కచ్చితంగా కామారెడ్డిలో కాంగ్రెస్ జెండా పాతుతామని అంటున్నారు.

ఇక గెలిస్తే కనుక రేవంత్ రెడ్డి కామారెడ్డి సీటుని ఉంచుకుంటారని అని కూడా అంటున్నారు. ఇప్పటికే షబ్బీర్ అలీకి వేరే సీటు ఇచ్చినందువల్ల కామారెడ్డిలో రేవంత్ రెడ్డి కొనసాగుతారు. ఆయన సొంత సీటు కొడంగల్ నుంచి ఆయన మనుషులనే దింపుకుంటారు అని అంటున్నారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా బీయారెస్ ని తెలంగాణాలో ఓడించడమే కాకుండా కేసీయార్ ని నేరుగా ఓడించడం ద్వారా జెయింట్ కిల్లర్ కావాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారు

ఇక అభ్యర్ధులుగా చూస్తే రేవంత్ రెడ్డికి కొడంగల్ అన్నది పెద్ద సమస్య కాదు, ఆయన ఫుల్ ఫోకస్ కామారెడ్డి మీద పెట్టారు. కేసీయార్ కి అలా కాదు గజ్వేల్ లో కూడా ఈటెల రాజేందర్ పోటీలో ఉన్నారు. దాంతో రెండు చోట్లా పోటీ గట్టిగా ఉండడం పైగా తెలంగాణా అంతటా ఆయన తిరగాల్సి రావడంతో కొంత ఇబ్బందిగా ఉంటోంది అంటున్నారు. అయినా చివరి ప్రచారంలో మరో భారీ బహిరంగ సభను కేసీయార్ కామారెడ్డిలో ఏర్పాటు చేస్తారని అంటున్నారు. ఇక రేవంత్ రెడ్డి అయితే ప్రచారం ముగింపునే కామారెడ్డితో చేయాలని ప్లాన్ వేసుకుంటున్నాట్లుగా తెలుస్తోంది. ఏ విధంగా చూసినా కామారెడ్డి టాక్ ఆఫ్ ది నేషన్ అవుతోంది అని అంటున్నారు.