Begin typing your search above and press return to search.

లోకేశ్ అరెస్టు ఎప్పుడు? ఇప్పుడిదే హాట్ టాపిక్!

ఒకటి తర్వాత ఒకటి చొప్పున కీలక పరిణామాలు వరుస పెట్టి సాగుతున్నాయి.

By:  Tupaki Desk   |   23 Sep 2023 4:19 AM GMT
లోకేశ్ అరెస్టు ఎప్పుడు? ఇప్పుడిదే హాట్ టాపిక్!
X

ఒకటి తర్వాత ఒకటి చొప్పున కీలక పరిణామాలు వరుస పెట్టి సాగుతున్నాయి. స్కిల్ స్కాంలో భాగంగా ఏపీ విపక్ష నేత.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును సీఐడీ అరెస్టు చేయటం.. రాజమండ్రి జైల్లో ఉంచటం తెలిసిందే. బయటకు వచ్చేందుకు బాబు చేస్తున్న న్యాయపోరాటం ఒక కొలిక్కి రాని పరిస్థితి. కోర్టులో వరుస పెట్టి ఎదురుదెబ్బలు తగులుతున్న వేళ.. చంద్రబాబు విడుదల ఎప్పుడన్నది ఇప్పుడో పెద్ద ప్రశ్నగా మారింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. టీడీపీ వర్గాల అంచనాలకు భిన్నంగా చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇవ్వటం.. రెండు రోజుల పాటు విచారించేందుకు కోర్టు ఓకే చెప్పటం బిగ్ షాక్ గా చెబుతున్నారు.

ఇంత జరుగుతున్నప్పుడు.. చంద్రబాబును బెయిల్ మీద బయటకు తెచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఏమిటి? అవేమీ ఎందుకు వర్కువుట్ కావట్లేదన్నది ప్రశ్నగా మారింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఢిల్లీలో ఉన్న లోకేశ్ అరెస్టు పై పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం దేశ రాజధానిలో కొద్ది రోజులుగా ఉంటున్న లోకేశ్ ను.. ఎప్పుడు అరెస్టు చేస్తారన్న దానిపై ఎవరికి వారు తమదైన వాదనలు వినిపిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం స్కిల్ స్కాంలో లోకేశ్ కూడా అరెస్టు అవుతారని.. ఆయన్ను అరెస్టు చేసేందుకు ఏపీ సీఐడీకి చెందిన ఒక టీం ఇప్పటికే ఢిల్లీకి వెళ్లినట్లుగా చెబుతున్నారు.

మరో టీం ఐదు రోజులుగా ఢిల్లీలో ఉంటూ.. లోకేశ్ అరెస్టుకు సంబంధించిన ప్లాన్ వర్కువుట్ చేస్తున్నట్లుగా టీడీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఢిల్లీలో లోకేశ్ ఎవరిని కలుస్తున్నారు? ఎవరితో భేటీ అవుతున్నారు? ఆయన కదలికలు ఏమిటి? అన్న దానిపై నిఘా వర్గాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నట్లుగా చెబుతున్నారు. ఢిల్లీకి వెళ్లిన నాటి నుంచి లోకేశ్.. చంద్రబాబు అరెస్టుపై జాతీయ స్థాయిలో ప్రచారం చేయటం పైనే ఎక్కువగా ఫోకస్ చేసినట్లుగా చెబుతున్నారు.

వివిధ మీడియా సంస్థలతో మాట్లాడిన లోకేశ్.. చంద్రబాబు అరెస్టును ప్రస్తావిస్తూ.. అరెస్టు జరిగిన తీరును.. అందులోని లోపాల్ని.. స్కాం అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించే కార్యక్రమాన్ని చేపట్టారు. అంతేకాదు.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమాలు చేస్తున్నారంటూఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి వేళ.. తెలుగుదేశం పార్టీలోనూ.. తెలుగు రాజకీయాల్లోనూ ఇప్పుడు చంద్రబాబును కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించే అంశం కన్నా లోకేశ్ అరెస్టు అంశంపైనే ఎక్కువ ఆసక్తి నెలకొన్నట్లుగా చెబుతున్నారు.