ఇంట్రస్టింగ్... వైసీపీలో ఆ ఐదుగురు... టీడీపీలో ఆ 13మంది!
ఆ సంగతి అలా ఉంటే... ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని పేర్లు ఎంత ఆసక్తిగా ఉన్నాయో.. ఇప్పుడు టీడీపీలోనూ ఒకేపేరు భారీ లిస్ట్ ఉండటం గమనార్హం.
By: Tupaki Desk | 7 Jun 2024 7:28 AM GMTఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు హోరాహోరీగా సాగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అత్యంత ఉత్కంఠ నడుమ వెలువడిన ఫలితాలు.. కూటమికి భారీ మెజారిటీని కట్టబెట్టాయి. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి నెలకొంది. ఆ సంగతి అలా ఉంటే... ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని పేర్లు ఎంత ఆసక్తిగా ఉన్నాయో.. ఇప్పుడు టీడీపీలోనూ ఒకేపేరు భారీ లిస్ట్ ఉండటం గమనార్హం.
అవును... ఏపీలోని వైసీపీ సర్కార్ లో ప్రధానంగా అటు పార్టీ పరంగా అయినా, ఇటు ప్రభుత్వ పరంగా అయినా "నాని" పేర్లు నిత్యం వినిపిస్తుండేవనే సంగతి తెలిసిందే. అటు అసెంబ్లీలో ప్రభుత్వం తరుపున, ఇటు అసెంబ్లీ బయట పార్టీ తరుపునా "నాని" అనే పేరున్న నేతలు బలమైన వాయిస్ గా నిలబడ్డారు. ఇదే క్రమంలో ఇప్పుడు టీడీపీలో "శ్రీను" అనే పేరున్న నేతల లిస్ట్ కూడా ఆసక్తిగా మారింది.
ఇందులో భాగంగా... గతంలో మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఆల్లగడ్డ ఎమ్మెల్యే గంగుల నాని... ఇలా సుమారు ఐదుగురు నానీలో హల్ చల్ చేసేవారు! ఈ క్రమంలో తాజాగా భారీ మెజారిటీతో గెలిచిన కూటమి నుంచి సుమారు 13 మంది "శ్రీను"లు ఈ సమయంలో ఎలాంటి పాత్ర పోషించబోతున్నారనేది ఆసక్తిగా మారింది.
ఈ లిస్ట్ ని ఒకసారి పరిశీలిస్తే... ఉత్తరాంధ్ర నుంచి గజపతినగరం ఎమ్మెల్యే - కొండపల్లి శ్రీనివాస్, భీమిలి ఎమ్మెల్యే - గంటా శ్రీనివాస్, గాజువాక - పల్లా శ్రీనివాస్, విశాఖ దక్షిణం - వంశీ కృష్ణ శ్రీనివాస్, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే - ఆదిరెడ్డి శ్రీనివాస్, తాడేపల్లిగూడెం - బొలిశెట్టి శ్రీనివాస్ లు ఉన్నారు.
ఇదే సమయంలో... కైకలూరు - కామినేని శ్రీనివాస్, తిరువూరు - కొలికపూడి శ్రీనివాస్, గురజాల - యరపతినేని శ్రీనివాస్, రాయదుర్గం ఎమ్మెల్యే - కాల్వ శ్రీనివాసులు, తిరుపతి - ఆరని శ్రీనివాస్ లతోపాటు కాకినాడ ఎంపీ - తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, నరసాపురం ఎంపీ - భూపతిరాజు శ్రీనివాస్ లు కూటమిలో "శ్రీను"లుగా ఉన్నారు. మరి ఈ శ్రీనులు ఏమేరకు కీ రోల్ పోషిస్తారనేది వేచి చూడాలి!!